సుదూర తీరాలకు ‘స్పీడ్ రేసర్’! ఇద్దరు బిడ్డలు సహా హాలివుడ్ స్టార్ మృతి

క్రిస్టియన్ క్లెప్సర్‌లో జన్మించిన హాలివుడ్ స్టార్ ఆలివర్ జీవిత విషాదకర ముగింపుపై హాలివుడ్ యావత్ ఉద్వేగభరితంగా స్పందించింది.

Update: 2024-01-06 13:38 GMT
Hollywood actor Christian oliver and his two daughters

కలకాలం ప్రశాంతంగా ఉండు’ అనే ఇంగ్లీషు సీరీస్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన హాలివుడ్ నటుడు క్రిస్టియన్ ఆలివర్ సుదూర దూరాల్లో ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్లిపోయారు. విమాన ప్రమాదంలో హాలీవుడ్‌ నటుడు క్రిస్టియన్ ఒలివర్‌ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు ఇద్దరు కుమార్తెలూ ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తోన్న చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కరీబియన్ సముద్రంలో కూలిపోయింది. తీర రక్షక దళం వీరి ముగ్గురితో పాటు పైలట్‌ మృతదేహాన్ని వెలికితీసింది.

హాలివుడ్ అద్భుత నటుల్లో ఒకరు ఆలివర్.. జర్మనీలో పుట్టి అమెరికాలో పెరిగి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నటుడు. 51 ఏళ్ల వయసు. పదీ, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు. ఓ ప్రైవేటు విమానంలో బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు వెళ్తూ విమానం కూలి చనిపోయారు. హాలీవుడ్‌తో పాటు జర్మనీలో పలు టీవీ సిరీస్‌ల్లో నటించారు. కోబ్రా 11 సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ది గుడ్ జర్మన్‌’, ‘స్పీడ్ రేసర్‌’ సహా మొత్తం 60 సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.

ఆలివర్, తన బిడ్డలు ప్రయాణిస్తున్న సింగిల్-ఇంజిన్ విమానం సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్‌లోని చిన్న ద్వీపం బెక్వియా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. సినిమాల్లో, సీరీయల్స్ లో బిజీబిజీగా ఉన్న సమయంలో క్రిస్టియన్ ఆలివర్ అకాలమరణం హాలివుడ్ ను కలచివేసింది. హాలివుడ్ అగ్రతారలు టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీ వంటి వారితో కలిసి నటించారు.

క్రిస్టియన్ క్లెప్సర్‌లో జన్మించిన ఆలివర్ జీవిత విషాదకర ముగింపుపై హాలివుడ్ యావత్ ఉద్వేగభరితంగా స్పందించింది. క్రిస్టియన్ ఆలివర్, ఆయన బిడ్డల మరణంపై యావత్ వినోద పరిశ్రమ నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి.

ఆలివర్ నటించిన ఆఖరి చిత్రం "ఫరెవర్ హోల్డ్ యువర్ పీస్". ఇటీవలే ఈ సినిమా చివరి సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది. 1994లో "సేవ్డ్ బై ది బెల్: ది న్యూ క్లాస్"లో కెరీర్ ను ప్రారంభించి 30 ఏళ్ల పాటు హీరోగా ఉన్నారు. జార్జ్ క్లూనీ, కేట్ బ్లాంచెట్ తో కలిసి నటించిన "ది గుడ్ జర్మన్," వంటి చిత్రాలలో ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఎమిలే హిర్ష్ తీసిన "స్పీడ్ రేసర్," టామ్ క్రూజ్ దర్శకత్వం వహించిన "వాల్కైరీ" వంటివి మంచి విజయాన్ని సాధించాయి.


Tags:    

Similar News