నోరు జారా, నన్ను క్షమించండి! చిరంజీవి ముందు మోకరిల్లిన చిన్నికృష్ణ!!

అడుసు తొక్కనేల, కాలు కడగనేల అని మనకో మోటు సామెత ఉంది. కోపం, అసంతృప్తి తలకెక్కినప్పుడు మనుషులందరూ ఏమి చేస్తారో సినీ రచయిత చిన్నికృష్ణ అదే చేశారు

Update: 2024-02-02 15:40 GMT
చిరంజీవికి సారీ చెప్పిన చిన్నికృష్ణ

అడుసు తొక్కనేల, కాలు కడగనేల అని మనకో మోటు సామెత ఉంది. కోపం, అసంతృప్తి తలకెక్కినప్పుడు మనుషులందరూ ఏమి చేస్తారో సినీ రచయిత చిన్నికృష్ణ అదే చేశారు. ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవిని పట్టుకుని నానామాటలన్నారు. ఏవేవో ఆరోపణలు చేశారు. తనకు సినిమా చాన్సులు రాకపోవడానికి చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులే కారణమంటూ కడుపులో ఉన్నదంతా కక్కెశాడు. అంతటితో ఆగకుండా.. ఏవేవో వీడియోలు కూడా విడుదల చేశారు. కోపం చల్లారింది. రెచ్చగొట్టిన వాళ్లు దూరమయ్యారు. చిరంజీవిని తిట్టినా సినీ చాన్సులు రాలేదు. దెబ్బకు దెయ్యం దిగొచ్చినట్టయింది. ‘కొందరి ఒత్తిడి కారణంగా చిరంజీవి దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందంటూ‘ ఇప్పుడు వీడియోను విడుదల చేశారు.

ఇంద్ర సినీ రచయిత చిన్ని కృష్ణే...

‘అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. నేనూ చేశాను. నాపై నమ్మకంతో ‘ఇంద్ర’లో నాకు అవకాశమిచ్చారు. అయితే.. గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడాను. దీంతో నా కుటుంబసభ్యులు, స్నేహితులు నాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ క్షణం నుంచి ప్రతిరోజు నేను భగవంతుడి దగ్గర క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంతో బాధపడ్డాను. చిరంజీవి గారికి పద్మవిభూషణ్‌ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించా. వాళ్ల ఇంటికెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నా కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నా వృత్తిగత జీవితం ఎలా ఉందని అడిగారు. ఇవన్నీ చూశాక ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని పశ్చాత్తాపపడి క్షమించమని అడిగాను’ అన్నారు చిన్నికృష్ణ ఆ వీడియోలో.

అద్భుతమైన కథ రాసిస్తానన్నా..

‘‘ఏమైనా కథలు ఉంటే కలిసి పనిచేద్దాం’ అని చిరంజీవి అన్నట్టు చిన్నికృష్ణ చెప్పారు. ‘ఈసారి మీతో చేయబోయే సినిమా దేశమంతా గుర్తుంచుకునేలా ఉంటుంది అన్నయ్య. అంత గొప్ప కథ రాస్తాను. మీరు మరెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చే జన్మంటూ ఉంటే మీ తమ్ముడిగా పుట్టాలని కోరుకుంటా’’ అని ఆ వీడియోలో ఏకరవు పెట్టారు చిన్నికృష్ణ. ఏమైనా పశ్చాతాపాన్ని మించింది లేదు కదా. ఆ ఔదార్యాన్ని చిరంజీవి చూపించారు.

Tags:    

Similar News