‘పవన్ కల్యాణ్, నేనూ యమ దోస్తులం....’

పవన్ కల్యాణ్, క్రిష్ మధ్య ఎటువంటి విభేదాలు లేవా.. అయితే డైరెక్షన్ నుంచి క్రిష్ ఎందుకుతప్పుకున్నారు.. వాటికి సమాధానమే ఇది;

Update: 2025-07-26 10:10 GMT
ప్రముఖ సినీనటుడు, ఏపీ డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని ప్రముఖ దర్శకుడు, హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)ను నిర్మించిన క్రిష్ స్పష్టం చేశారు. ఈ సినిమా నిర్మాణంలో తనకు పవన్ కల్యాణ్ కు మధ్య విభేదాలు ఉన్నట్టు మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

హరిహర వీరమల్లు జూలై 24న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదట క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో ప్రారంభమైంది. తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జ్యోతికృష్ణ ఈ సినిమా పూర్తి చేశారు. జ్యోతికృష్ణ ఈ సినీ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు. ఇటీవల క్రిష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ త్వరలోనే ఇందుకు గల కారణాలు బయటకు వస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు నిర్మాణం సుమారు 5 ఏళ్ల పాటుసాగింది. ఈ జాప్యాన్ని తట్టుకోలేక క్రిష్ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో పవన్‌తో (Pawan Kalyan) తనకు విభేదాలు లేవని క్రిష్ స్పష్టం చేశారు.
‘నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్‌ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసేందుకు కూడా సిద్ధమే’ అని క్రిష్ చెప్పినట్టు ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఇటీవల ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందు కూడా పవన్‌పై ప్రశంసలు కురిపిస్తూ క్రిష్‌ పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా పవన్‌, ఏఎం రత్నం కారణంగానే పూర్తి అయిందని కూడా ఆయన ప్రశంసించారు.
జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు వసూలు చేసింది (Hari Hara Veeramallu Collection). తొలిరోజే వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది.
Tags:    

Similar News