శ్రీరాముడిగా మహేష్ బాబు ?! చర్చల్లో నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్శ్!
8 నిమిషాల ఎపిసోడ్ తో గూస్‌బంప్స్;
మహేష్ బాబు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్. ఆయన యాక్షన్ హిరోయిజం – ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ వంటి చిత్రాలతో దశాబ్దాలుగా మాస్ ఆడియన్స్‌ను హిప్నోటైజ్ చేస్తోంది. కానీ ఆయన కెరీర్‌లో పురాణ పాత్రల్లో కనిపించటం జరగలేదు. అయితే ఇప్పుడు తొలిసారి ఆయన దివ్య అవతారంలో – శ్రీరాముడిగా స్క్రీన్‌పై కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. అదే నిజమైతే శ్రీరాముడి పాత్రలో ఆయన స్క్రీన్‌పై ప్రత్యక్షమవడం, అభిమానులకు మాత్రమే కాదు, ప్రపంచ ప్రేక్షకులకు కూడా ఒక కల్చరల్ షాక్ విత్ డివైన్ ఇంపాక్ట్ అవుతుందనటంలో సందేహం లేదు. వివరాల్లోకి వెళితే..
భారతీయ సినిమాలు గ్లోబల్ స్టేజీలో నిలబడటానికి అవసరమైన రెండు ప్రధాన శక్తులు మైథాలజీ, మాడర్న్ న్యారేటివ్. ఈ రెండింటినీ ఒకే ఫ్రేమ్‌లో మిళితం చేయగల దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు ఆయన సూపర్‌స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 కేవలం ఒక సినిమా కాదు – అది సాంస్కృతిక పునర్‌వ్యాఖ్యానం, గ్లోబల్ మైథాలజికల్ అడ్వెంచర్ గా నిలబడే అవకాశం ఉంది.
“పురాణం + గ్లోబల్ అడ్వెంచర్” – రాజమౌళి నెక్స్ట్ గేమ్ ప్లాన్
రాజమౌళి ఇప్పటివరకు చేసిన ప్రతీ సినిమా “లోకల్ rooted + గ్లోబల్ visual appeal” కలయిక. బాహుబలిలో పురాణస్ఫూర్తి, RRR లో చరిత్రతో కూడిన ఫిక్షన్ – రెండూ ప్రపంచానికి కొత్తగా అనిపించాయి. ఇప్పుడు ఆయన SSMB 29 లో శ్రీరాముడి పాత్రను ఓ ఎపిసోడ్ లెవల్‌లో చూపించడం ద్వారా ఒక మైథలాజికల్ ఎమోషన్‌ని అడ్వెంచర్ న్యారేటివ్‌తో మేళవించబోతున్నారని తెలుస్తోంది.
ఒక 8 నిమిషాల సీక్వెన్స్ – మహేష్ బాబు శ్రీరాముడిగా రాక్షసులతో యుద్ధం చేస్తూ కనిపించే సన్నివేశం – గూస్‌బంప్స్ రేపుతుందని, సినిమా మొత్తానికి “హార్ట్‌బీట్”గా నిలుస్తుందని అంతర్గత వర్గాల సమాచారం.
పురాణ పాత్రలు ఎందుకు ఎప్పుడూ క్లిక్ అవుతాయి?
కలెక్టివ్ మెమరీ – రామాయణం, మహాభారతం వంటి కథలు భారతీయుల DNAలో భాగం. ఒక స్టార్ ఆ పాత్రలో కనబడితే అది “ఒక కొత్త దశలో పురాణాన్ని మళ్లీ అనుభవించడం” లాంటిది.
ఎథికల్ సింబలిజం – శ్రీరాముడు కేవలం హీరో కాదు; ఆయన ధర్మం, త్యాగం, ఆత్మనియంత్రణకు ప్రతీక. సినిమా ఒక యాక్షన్-అడ్వెంచర్ అయినా, ఆధ్యాత్మిక లేయర్ ఆడియన్స్ హృదయాలను బలంగా తాకుతుంది.
సినిమాటిక్ స్కేల్ – పురాణం అంటే పెద్ద పెద్ద సెట్‌లు, రాక్షస యుద్ధాలు, దివ్య విజువల్స్. ఇవి పెద్ద తెరపై నెక్స్ట్ లెవెల్ స్పెక్టకిల్‌గా మారుతాయి.
గ్లోబల్ కనెక్టివిటీ – హాలీవుడ్‌లో గ్రీకు మిథాలజీ (Thor, Hercules), నార్సు కథలు Marvel సినిమాల ద్వారా మళ్లీ పాపులర్ అయ్యాయి. అదే విధంగా భారతీయ పురాణం ప్రపంచానికి “New Myth Universe” అవ్వగలదు.
ఇది రాజమౌళి తెలుసుకుని అర్దం చేసుకున్న విషయం. అందుకే ఆయన పురాణాన్ని ఒక “గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్”తో కలపడం ద్వారా కొత్త జానర్ సృష్టించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.
మహేష్ బాబు క్రేజ్ – ఎందుకు గ్లోబల్?
* స్టైల్ + స్టార్డమ్: మహేష్ బాబు సినిమాలు తెలుగులోనే కాకుండా, హిందీ డబ్బింగ్ మార్కెట్లోనూ భారీగా వర్క్ అవుతున్నాయి.
* పాన్-ఇండియా యాక్షన్ హీరో ఇమేజ్: ‘బిజినెస్‌మ్యాన్’, ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆయనకు నార్త్ మార్కెట్‌లోనూ రిప్యుటేషన్ బాగా పెరిగింది.
* ఇంటర్నేషనల్ అపీలింగ్ లుక్స్: మహేష్ బాబు “గ్రీక్ గాడ్” లుక్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ – గ్లోబల్ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు.
భారీ కలయిక
* ప్రధాన పాత్రలో ప్రియాంక చోప్రా (హాలీవుడ్ కనెక్షన్)
* విలన్‌గా పృథ్విరాజ్ సుకుమారన్
* కీలక పాత్రలో ఆర్. మాధవన్
* Warner Bros తో టై అప్ అయ్యే అవకాసం
* Netflix గ్లోబల్ రిలీజ్ బ్యాకింగ్
ఎలాంటి కథ
టాంజానియాకు చెందిన 'ది సిటిజన్' అనే పత్రిక ఈ మూవీ రాబోయే షూటింగ్ షెడ్యూల్‌ను వెల్లడించడమే కాకుండా స్టోరీనీ లిక్ చేసింది. "ఇండియానా జోన్స్, ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్‌ల నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమా ఒక కఠినమైన అన్వేషకుడిని చూపిస్తుంది.
అతను మారుమూల ప్రాంతాల గుండా అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభిస్తాడు. ప్రకృతి, రహస్యం ఒక శక్తివంతమైన శత్రువుతో పోరాడి ప్రపంచాన్ని మార్చగల ఒక చిరకాల రహస్యాన్ని కనుగొంటాడు. పురాణాలు, అడవి, ప్రకృతి దృశ్యాలు, ఉత్కంఠభరితమైన థ్రిల్స్‌ను ఆశించవచ్చు" అని ఆ రిపోర్ట్ చెప్పడం విశేషం.
మరో ప్రక్క ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో పీరియాడిక్ డ్రామాగా మూవీ రూపొందనుందని సినీ ఇండస్ట్రీలో జోరు ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లుగా నటీనటుల మేకోవర్స్ని వందల ఏళ్ల నాటి గిరిజన జాతికి చెందిన ఓ తెగ లుక్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఇందులో భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.
రిలీజ్ ప్లాన్
2026 అక్టోబర్ లో – ఒకే పార్ట్‌గా, కానీ భారీ స్పెక్టకిల్ గా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్. ఇది మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనూ గేమ్‌చేంజర్ అవుతుందని ట్రేడ్ అంటోంది.
ఫైనల్ గా ..
మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించడం అనేది నిజమైతే... కేవలం ఒక “ఫ్యాన్ మోమెంట్” కాదు. ఇది – ఆయన కెరీర్‌ను హీరో నుండి లెజెండ్ స్థాయికి తీసుకెళ్తుంది. రాజమౌళి సినిమాను మైథాలజికల్ హాలీవుడ్ లెవెల్ ఫ్రాంచైజ్ గా మార్చుతుంది. భారతీయ సినిమా కల్చరల్ ఎక్స్‌పోర్ట్ కు కొత్త దారి చూపుతుంది. అప్పుడు SSMB 29 – కేవలం ఒక సినిమా కాదు. అది ఒక కల్చరల్ ఈవెంట్.