ఓటిటిలోకి పుష్ప విలన్ 'ఆవేశం' ... ఏముంది ఈ సినిమాలో ?

ప్రక్క రాష్ట్రాల్లో, ఇతర భాషల్లో రిలీజై హిట్టైన సినిమాలు మనకు ఇక్కడ తెలుగులో చూడాలనిపిస్తుంది.

Update: 2024-05-04 08:14 GMT
Source: Twitter

ప్రక్క రాష్ట్రాల్లో,భాషల్లో రిలీజై హిట్టైన సినిమాలు మనకు ఇక్కడ తెలుగులో చూడాలనిపిస్తుంది. అక్కడ ఎందుకంత పెద్ద హిట్ అయ్యాయో తెలుసుకోవాలనిపించటం సహజం. అలాగే ఇప్పుడు 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అడ్డూ అదుపూ లేకుండా దూసుకుపోతుంది. దాంతో కేవలం మళయాళంలోనే కాదు మన తెలుగు సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే అంత విషయం ఈ సినిమాలో ఏముంది..ఆ చిత్రం స్టోరీ లైన్ ఏంటి

శాంత‌న్ (రోష‌న్ శాన్‌వాజ్‌), బీబీ (మిథున్ జై శంక‌ర్‌), అజు(ప్ర‌ణ‌వ్‌రాజ్‌) వీళ్లు ముగ్గరూ ఇంజినీరింగ్ చ‌ద‌వ‌డానికి కేర‌ళ నుంచి బెంగ‌ళూరు వ‌స్తారు. అయితే ఎప్పటిలాగే కాలేజీలో సీనియ‌ర్స్ ఈ ముగ్గురిని ర్యాగింగ్ పేరుతో దారుణంగా ఇబ్బంది పెడతారు. అంతేకాకుండా వీళ్లు ముగ్గురినీ బట్టలు ఊడదీయించి సిటీ అంతా కార్లో తిప్పి తమ ప్లేస్‌కు తీసుకువెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వీళ్లని కొడతారు.దాంతో సీనియ‌ర్స్‌పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటారు. కానీ వాళ్ల వల్ల కాదు. అందుకే వాళ్లు లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ రంగా రావు అలియా రంగాతో (ఫ‌హాద్ ఫాజిల్‌) ని సీన్ లోకి తేవాలనుకుంటారు. అందుకోసం ఈ ముగ్గురు కుర్రాళ్లు వెళ్లి రంగా తో స్నేహం చేస్తారు. ఆ తర్వాత రంగాకు చెప్పి ఈ ముగ్గురిని ర్యాగింగ్ చేసిన కుట్టి అండ్ టీమ్‌ను చిత‌క్కొట్టిస్తారు.

అక్కడ నుంచి రంగా మ‌నుషులుగా అజు, బీబీ, శాంత‌న్‌ల‌కు ముద్రపడుతుంది. దాంతో వాళ్లకి కాలేజీలో ఎదురేలేకుండాపోతుంది. అయితే రంగా టీమ్‌లో చేరిన అజు, బీబీ, శాంత‌న్‌ జీవితాలు ఓ గమ్మత్తైన టర్న్ తీసుకున్నాయని వారు గమనించరు. ఈ క్రమంలో చ‌దువును సైతం వారు నిర్ల‌క్ష్యం చేస్తారు. రంగాతో బాగా క్లోజ్ అయ్యిన తర్వాత త‌మ‌కు సాయం చేసిన రంగానే చంపాల‌్సిన పరిస్దితి బీబీ, అజు, శాంత‌న్ లకు వస్తుంది. అప్పుడు ఏమైంది...ఈ విషయం తెలుసుకున్న రంగా ఈ ముగ్గురిని ఏం చేశాడు? అన్న‌దే ఆవేశం మూవీ క‌థ‌.

నిజానికి చిన్న స్టోరీలైన్ బాగా విస్తరించారు. ఫస్టాఫ్ అంతా కాలేజీ గొడవలతో నింపేసినా రంగాగా ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథ పరుగెట్టడం మొదలెడుతుంది. ఫ‌హాద్ ఫాజిల్ కు తెలుగులోను మంచి అభిమానులు ఉన్నారు. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2లో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. ఫ‌స్ట్ పార్ట్‌లో త‌క్కువ నిడివితో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించిన ఫ‌హాద్ ఫాజిల్ పుష్ప 2లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ చేయ‌బోతున్న‌ారు. కాబట్టి ఇక్కడ తెలుగులోనూ ఆవేశం బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. వీటికి కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలను ఇలానే డబ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఆవేశం సినిమాను కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. అలాగే చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయాలంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ను ట్యాగ్ చేసల్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

కానీ ఈలోపై ఓటీటీ రిలీజ్‌పై వార్తలు మొదలయ్యాయి. ఓటీటీలో రిలీజ్ అంటే తెలుగుతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ ఎలాగో అందుబాటులో ఉంటుంది. దీంతో ఈ చిత్రం తెలుగు థియేటర్ రిలీజ్ లేనట్లే...కాబట్టిఓటిటిలో చూసుకోవాల్సిందే.

ఇంతకీ ఓటిటిలో ఎప్పటినుంచి అంటారా..?

మే 9న ఈ మ‌ల‌యాళం మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది. ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఈ వారంలోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు చెబుతోన్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జిత్తు మాధవన్ రాసి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుశిన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు.

Tags:    

Similar News