హైదరాబాద్ లో రెండు పుస్తకాల ఆవిష్కరణ

బి ఎస్ రాములు ‘అఖిల భారత పర్యటన’, మామిడిపెల్లి ఇంద్రాణి ‘ఇంద్ర కమలం’ కవితా సంపుటి ని అవిష్కరించారు.

Update: 2025-10-28 05:21 GMT

విశాల సాహిత్య అకాడమీ, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సౌజన్యంతో పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది.

హైదరాబాద్ బాగ్ లింపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయబ్ హాల్ లో జరిగిన ఈ సభలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మన్, సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు "అఖిల భారత పర్యటన " అనే స్వీయ చరిత్ర నాలుగవ సంపుటి, వర్ధమాన కవయత్రి మామిడిపెల్లి ఇంద్రాణి  తొలి కవితా సంపుటి "ఇంద్ర-కమలం " రెండు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.

"అఖిల భారత పర్యటన" గ్రంథాన్ని ‘నేటి నిజం’ సంపాదకులు బైస దేవదాస్  ఆవిష్కరించారు. తొలి ప్రతిని కర్నాటి మనోహర్ కి 'అఖిల భారత వీవర్స్ ఫ్రంటు' నాయకులకు అందజేసారు. "ఇంద్ర- కమలం " కవితా సంపుటిని బి ఎస్ రాములు ఆవిష్కరించారు.
తొలి ప్రతిని అమ్మకు అన్నకు అందజేసి సత్కరించారు. ఉద్యోగార్థులు, సీనియర్ సాహితీ వేత్తలు జూపాక సుభద్ర, డి యం రవి ప్సాద్, డా. అందెశ్రీ, సుప్రసిద్ద విశ్లేషకులు రిటైర్డ్ ప్రొ. రాం కిషోర్ , దూదర్శన్ రిటైర్డ్ అధికారి అనంత పద్మనాభ రావు తదితరులు పాల్గొన్నారు. 


సంగిశెట్టి శ్రీనివాస్

ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రసిద్ద సాహితీ వేత్త, సంగిశెట్టి శ్రీనివాస్ "అఖిల భారత పర్యటన " పుస్తకాన్ని పరిచయం చేశారు. ఇది ఒక చారిత్రక డాక్యుమెంటు అన్నారు. 1985 నాటికి దేశంలో వామ పక్ష తీవ్రవాద ఉద్యమాలు దేశవ్యాప్తంగా ఎలా సాగుతున్నాయో ప్రత్యక్షంగా చూసినవి నాయకులతో చర్చించిన అంశాలు రికార్డు చేశారు. ఆనాటికే ఉద్యమాల్లో కుల సమస్య , కుల వివక్ష తీవ్ర స్థాయికి చేరుకొని ఉద్యమాలు ఎదుగుదల లేకుండా నిలిచి పోయాయని చెప్పడంతో పాటు అంబేద్కర్ దృక్పథాన్ని అధ్యయనం చేసి ఉద్యమ రూపాలను రూపొందించుకోవాలని అవగాహన కొచ్చారు. అయితే పార్టీలు అంబేద్కర్ ను వ్యతిరేకించాయి. ఈ నాటి పరిస్థితులకు మూలాలను ఆనాడే ఎలా పసికట్టిన తీరు ఇందులో కనపడుతుందని పేర్కొన్నారు.
విజిఆర్ నారగోని
విజి ఆర్ నారగోని మాట్లాడుతూ 1990 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాహిత్య ఉద్యమాలను బి ఎస్ రాములు ముందుకు నడిపారని అందరం కలిసి పనిచేసి సామాజిక సాహిత్య చరిత్రను మలపు తిప్పడం జరిగిందని , బి ఎస్ రాములు దరకమే అధ్యక్షులుగా చేిన కృషి చరిత్రాత్మక మైనదని పేర్కొన్నారు.
బి ఎస్ రాములు
యువరచయితలు ,కవులు,కవయిత్రులు ్శ్నించడంతో పాటు వాటికి తామే పరిష్కారాలు వెతికి నాయకత్వం వహించాలని అన్నారు. ప్రశ్నించడంతో ఆగిపోతే ప్రతి పక్షంగా మిగిలి పోయి పాలితులుగా మారుతారు. ప్రశ్నకు మనమే జవాబివ్వడం ద్వారా నాయకత్వం అందించడం ద్వారా రాజ్యాధికారంలోకి వస్తారని అన్నారు. తన అఖిల భారత పర్యటనలో అన్నిటికన్నా బాగా నచ్చిన ఉద్యమం శంకర్ గుహ నియోగి నాయకత్వంలో చత్తీస్ గడ్, భిలాయ్ , రాజ్ నంద్ గాం లో సాగిన సమగ్ర సామాజిక వికాసం అని, ప్రభుత్వం తో పని లేకుండా స్కూల్లు, హాస్పటల్స్ మొదలైనవన్నీ వారే స్వయంగా నిర్వహిస్తున్నారని అన్నారు. 

సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు పిలుపునిచ్చారు. తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను స్వయంగా పరిశీలించానని తెలిపారు.దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథులుగా సాహితీవేత్తలు సంగిశెట్టి శ్రీనివాస్,డా.జెల్ది విద్యాధర్,నారగోని,బైస దేవదాస్,డా.అనంతపద్మనాభరావు ,మువ్వా శ్రీనివాసరావు ,కవయిత్రులు జ్వలిత,జాజుల గౌరి,డా.రాధా కుసుమ, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇంద్రాణి కవితల సంపుటికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు తరఫున సి. గంగ పూర్తి స్థాయిలో సౌజన్యం అందించారని వారిని అభినందించారు.
బి.ఎస్.రాములు ఎందరో దళిత బహుజన యువతీ యువకులను కవులుగా,కథారచయితలుగా తీర్చి దిద్దిన ప్రత్యామ్నాయ సాహిత్యోద్యమ నిర్మాతగా,బహుజన తాత్విక సిద్ధాంత కర్తగా అతిథులు అభివర్ణించారు.
యువ కవయిత్రి ఇంద్రాణి "ఇంద్ర కమలం" కవితా సంపుటిలో అనేక అంశాలపై,అధునాతన ప్రతీకలతో సహజ భావోద్వేగాలతో అద్భుత కవిత్వం పండించార న్నారు.బి.ఎస్.రాములు,మరెందరో సహకారం వల్లనే తాను కవయిత్రిగా వెలుగులోకొచ్చానని,తన కుటుంబసభ్యులు సహకారం వల్లనే కవయిత్రిగా మారానని తెలిపారు.ఈ సందర్భంగా అతిథులతో పాటు గ్రంథ రచయితలను ఘనంగా సత్కరించారు.
కవి సమ్మేళనం
పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు డా. రాధా కుసుమ (కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు) కవి సమ్మేళనం నిర్వహించారు.
యువ కవులు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
మొదటి కవితను ఝాన్సీ ముడుంబై చదివారు ఆన్లైన్లో బెట్టింగ్ మీద సమాజంలో ఆన్లైన్ బెట్టింగ్ ల వల్ల ఎంతమంది మోసపోతున్నారు అనేది తన కవితలు అద్భుతంగా రాశారు. కేశరాజు వెంకట ప్రభాకర్ రావు దివ్యాంగుల మీద రాశారు కవిత రాసి వినిపించారు.
మామిడి అక్షిత సిరామృతం అనే కవితలో పేదరికం ధనికం అంటూ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. కందుకూరి కోటేశ్వరరావు కాశ్మీరీ మౌనరాగం యుద్ధ వాతావరణం గురించి మతోన్మాదుల గురించి తన ఆవేదనను వ్యక్తం చేశారు. హరి ప్రసాద్  వివేకానందుని బోధనలను గుర్తు చేశారు. యువత దేశ భవితకు పునాదిరాళ్లు అంటూ చక్కటి కవితను వినిపించారు. మధుశ్రీ  స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను వారు పడే వేదనలను ఎలుగెత్తి చాటారు. శాంతిశ్రీ  రైతు మీద, బిక్కీ కృష్ణ  రాసిన గజల్ ను వినిపించారు
ఇంకా కొమ్ము వరలక్ష్మి  డాక్టర్ ఎలిపే రత్నం ప్రసాద్ ,ఎస్ రాములు , డా బిక్కి కృష్ణ , పెద్దలు సీనియర్ కవులు డా జెల్దీ విద్యాధర్  ,జ్వలిత , జాజుల గౌరి, బి ఎస్ రాములు ఇంకా అనేక మంది కవులు తమ కవితలను చదివి వినిపించారు.
డా. రాధా కుసుమ
రాధా కుసుమ గారి అద్భుత ప్రసంగం, రచయితలు బి.ఎస్. రాములు మరియు మామిడిపెల్లి ఇంద్రాణి గారి సాహిత్య గుణాలను సమన్వయంగా ప్రతిబింబించింది.
ఇంద్రాణి గారి పదాల్లోని ఆ మధురమైన అనుబంధం — స్వదేశం, కుటుంబం, సమాజం, ప్రకృతితో ఉన్న బంధం — ఆమె కవితా పంక్తుల్లోని లోతైన సానుకూలతను, ఇతరులను ప్రేరేపించే శక్తిని బలంగా వ్యక్తం చేశాయి.
ఈ 40 కవితా పుష్పాలు రచయితల, సంపాదకుల సీనియార్టీని దాటి ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకాయి. ఆమె నిజంగా ఈ మట్టిలో మాణిక్యంలా , ఒక విత్తనం మొలకెత్తి చెట్టుగా పెరిగి, కొమ్మలు, పూలు, పండ్లు ఇచ్చినట్టు వికసించింది. ఆ వికాసాన్ని ప్రకృతి, మానవతకు అంకితం చేయడం ద్వారా తన అంతరంగ విత్తనాన్ని వ్యక్తం చేసింది.
చివరగా కవయిత్రి ఇంద్రాణి స్పందిస్తూ?. బి ఎస్.రాములు, కుటుబ సభ్యులు , మరెందరో సహకారం వల్లనే తాను కవయిత్రిగా వెలుగులోకొచ్చానని,తన కుటుంబసభ్యులు సహకారం వల్లనే కవయిత్రిగా . ఈ పుస్తకం వెలువడింది అన్నారు. అందరూ ఆహ్లాదంగా గ్రూపుఫోటోలు తీసుకోవడం సభ తీసుకోవడంతో సభ ముగిసింది


Tags:    

Similar News