ముసుగు తొలగిపోతుంది

ఆదివారం కవిత: జూకంటి జగన్నాథం

Update: 2025-12-14 06:04 GMT
ఫోటో సోర్స్: శ్యామ్ ఫ్రేమింగ్ అర్ట్స్ అమేజాన్

పైసలు తీసుకొని పాడే పాటకు

ప్రజల కోసం పాడే పాటకు మధ్య
సరిహద్దు రేఖ ఉంది

సరిగమల నుండి ఆలపించే గీతానికి
చెమట శ్రమ నుండి పుట్టే పాటకు మధ్య
తప్పకుండా వ్యత్యాసం ఉంది

రుచి వేరు శుచి వేరు
అభిరుచి వేరు భాష వేరు
బతుకు వేరు మెతుకు వేరు
అతుకు వేరువేరు

సంక్రాంతికి బతుకమ్మకు మధ్య
తప్పకుండా ఫరక్ ఉంది
మట్టి వేరు తడి వేరు
మనిషి వేరు మనసు వేరు
అస్తిత్వం వేరు ఆధిపత్యం వేరు వేరు

ఉప్పు వేసి పొత్తుగూడితే
తప్పు చేసిన వాడు తలదించుకునే
రోజు ఒకటి తప్పకుండా వస్తుంది
నీరు పల్లె మేరకు
నిజము దేవుడెరుగు
ఎదురెక్కి తెలంగాణ వేరు వేరు

ముసుగు వేయడం వేరు
అన్ని రకాల ముసుగులు తొలగిపోవడం పేరు వేరు



Tags:    

Similar News