బాగుపడవురా నాయనా!

చాలా మందికి డబ్బు జబ్బు చేసింది. కోట్లున్నా కరోనా ఎత్తుకు పోలేదా, కంటి మీద కునుకు లేకుండా చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు కవి తమ్మినేని అక్కిరాజు.;

Update: 2025-03-20 06:17 GMT
చాలా మందికి డబ్బు జబ్బు చేసింది. పోగేయడమే పనిగా పెట్టుకున్న వారెందరో.. కోట్లున్నా కరోనా ఎత్తుకు పోలేదా, కంటి మీద కునుకు లేకుండా చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు.
****


 


సంపాదించు -ఇంకా
కోట్లు సంపాదించు!
నువ్వు బాగుపడవు!
నీకు బాధలు లేవా?
కరోనా ఎత్తుకు పోలేదా?
క్షణ క్షణం టెన్షన్లు!
నీకెందుకున్నాయి?
నీ డబ్బు ఏంచేసింది?
నిద్ర పడుతోందా?
నవ్వు తున్నావా?
తగ్గని జబ్బులు!
భార్యాభర్తల మధ్య?
నీ బిడ్డలతో నువ్వు?
సహోదరుల మధ్య?
సమాజ బంధాల్లో?
హాయిగా ఉన్నావా?
నీకు డబ్బులున్నాయి
పిల్లలకు చదువుల్రావు!
నువ్వు సంపాదిస్తావు
పిల్లలు అహంకారులు!
కారణం నువ్వే కదా?
పదితరాలకు సరిపడా
నువ్వే సంపాదించేసావు!
వాళ్ళకు జీవితం తెలీదు!
సమాజ బంధాల్లోకొస్తే
నువ్వు ఎక్కువ కులం!
వాడు తక్కువ కులం!
నీకు కోట్లు ఉన్నాయి!
వాడికి తింటానికి లేదు!
కులగజ్జి!మతోన్మాదం!
సర్వనాశనం చేసేసావ్
సనాతనధర్మాలు పెట్టి!
అందుకే బాగుపడవు!
ఈ 'కర్మ'లన్నిటికీ
కారణభూతం నువ్వే!
నీ కర్మకు నువ్వే కర్త!
ఈ వ్యవస్థకు వ్యవహర్త!
నువ్వు బాగుపడవు!
ఎప్పటికీ బాగుపడవు!
నాది కష్టం!నీది దోపిడి!
****-తమ్మినేని అక్కిరాజు
Tags:    

Similar News

అవిటి నత్త