కాలం చెక్కిన కవి అందెశ్రీ

మనిషి ఎలా చిరునామా కోల్పోతున్నాడో వివరంగా గొంతెత్తి వినిపించిన కవి

Update: 2025-11-10 12:34 GMT
జోహార్ ప్రజాగాయకుడు అందెశ్రీ

కవీ! నీ గురించి నివాళి రాయాలంటే అక్షరాలు కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నాయి. అందెశ్రీ! నిన్ను తలంచుకోవాలంటే కలం గద్గద స్వరంతో ఇక రాయలేక నిలువెల్లా వణికి పోతుంది. మొన్న నాతో మాట్లాడిన అందెశ్రీ ఇలా అర్ధాంతరంగా అకస్మాత్తుగా మాట మాత్రం గానైనా చెప్పా పెట్టకుండా  వెళ్లిపోతాడని అనుకోలేదు.  ఒకప్పటి వరంగల్ జిల్లా జనగాం తాలూకా లోని రేబర్తి గ్రామం అందెశ్రీ స్వంత గ్రామం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉంది.  చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. ఆ గ్రామంలో మల్లారెడ్డి పటేల్ వద్ద పెరిగాడు. బడికి పోవాల్సిన  వయసులో పశువుల కాపరిగా పని చేశాడు.చిన్నప్పటినుండి దైవభక్తి  మిక్కిలిగా ఉండేడిది.. ఊరిలోని అన్ని కులాల ప్రజల నోటిలో పండుగా మెదిలాడు.

      అనేక జీవితంలో సంభవించిన అనేక పరిణామాల కారణంగా  నిజామాబాద్ జిల్లాలో హైదరాబాద్లో కూడా మేస్త్రిగా పనికి కుదిరాడు.బతుకు పాఠశాలలో అనేక పాఠాలు నేర్చుకున్నాడు. నాలుగో తరగతి చదువుల చదువుకున్నారని ఆయన చెప్పాడు ప్రారంభంలో అందెశ్రీ వివిధ పత్రికలలో  ఇంటర్వ్యూలును చూస్తే సంబరమా శ్చర్యాలు కలుగక మానవు. అందెల పదాలు పాటల పూదోట ఆయన పుస్తకాలు. కొత్త పాట రాసిన ప్రతిసారి తాపీ పని నుంచి సరాసరి పత్రిక ఆఫీసులకు వచ్చేవాడు మిత్రులైన తదితరులను కలిసేవాడు వారి కోరికపై కొత్త పాటను వినిపించేవాడు. మొదట్లో బిరుదురాజు రామరాజు దగ్గర ఎక్కువగా కనిపించేవాడు. తర్వాత తర్వాత ఆయన సాహితీ ప్రపంచం విస్తృతమైన కొద్దీ ,ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాడు. "నెత్తి మీద సుట్ట బట్ట ఆపైన పండ్ల బుట్ట తెనుగోల్ల ఎల్లవ్వా ఏది"  తెలంగాణ అస్తిత్వం లో  కింది కులాల పైన రాసిన గొప్ప పాట ఇది. "మాదిగయ్యల  మేధ నుండి పురుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడు మేలుకొలుపుతున్నది" వంటి పాటలను రాసి పాడిన అద్భుతమైన జానపద వాగ్గేయకారుడు మరియు "మాయమైపోతున్నడమ్మా  మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు   మానవత్వం లేని వాడు " ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి ఎలా చిరునామా కోల్పోతున్నాడో వివరంగా తన కలం ద్వారా గళం ద్వారా గొంతెత్తి వినిపించాడు.

          ఇకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా వాగ్గేయకారుడుగా ఆయన పాత్ర అమోఘమైనది. అద్వితీయమైనది. ఆయన సాహితీ ప్రస్థానం అంతా ఒక ఎత్తు తెలంగాణ ప్రజల రాష్ట్ర గీతం " జయ జయ జయహే   .     తెలంగాణ" లో తెలంగాణ ఖ్యాతిని చరిత్రను నిక్షిప్త చేస ప్రజల నాలికల పైన అజరామైన కవి అందెశ్రీ్ తాటికవి ఇకముందు తెలంగాణలో జన్మిస్తాలనుకోవడం అసాధ్యమైన అసాధ్యమైన అంశం. ఆయన పాటల మాటల సారాంశం అంతా తెలంగాణ అస్తిత్వంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి అందులో తెలంగాణ సాహిత్యానికి ఒక తీరని లోటు ఆ లోటును భర్తీ చేయడం ఎవరి తరం కాదు  ఇకముందు కానేరదు. అన్నిటికన్నా మిక్కిలి నాకు అత్యంత ఆత్మీయుడైనా అందెశ్రీ ఈ ఉదయం అకాల మరణం చెందడం నాకు పుట్టెడు దుఃఖాన్ని తీరని ఆవేదనలను మిగిల్చింది . అందెశ్రీ అసలు పేరు అందె ఎలయ్య ప్రపంచంలోని నదులన్నీ తిరిగి వచ్చి నది కావ్యం బ్రోతుకావ్యం రాయాలని బృహత్ కావ్యం రాయాలని సంకల్పించాడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆయన హృదయాంతరాంతరాలలో ఒక ఆధ్యాత్మిక స్రోతస్విని  నిరంతరంగా ప్రవహిస్తుంది

 జూకంటి జగన్నాథం

అక్షరాలు కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నాయి. అందెశ్రీ! నిన్ను తలంచుకోవాలంటే కలం గద్గద స్వరంతో ఇక రాయలేక నిలువెల్లా వణికి పోతుంది. మొన్న నాతో మాట్లాడిన అందెశ్రీ ఇలా అర్ధాంతరంగా అకస్మాత్తుగా మాట మాత్రం గానైనా చెప్పా పెట్టకుండా వెళ్లిపోతాడని అనుకోలేదు. ఒకప్పటి వరంగల్ జిల్లా జనగాం తాలూకా లోని రేబర్తి గ్రామం అందెశ్రీ స్వంత గ్రామం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. ఆ గ్రామంలో మల్లారెడ్డి పటేల్ వద్ద పెరిగాడు. బడికి పోవాల్సిన వయసులో పశువుల కాపరిగా పని చేశాడు.చిన్నప్పటినుండి దైవభక్తి మిక్కిలిగా ఉండేడిది.. ఊరిలోని అన్ని కులాల ప్రజల నోటిలో పండుగా మెదిలాడు.

అనేక జీవితంలో సంభవించిన అనేక పరిణామాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో హైదరాబాద్లో కూడా మేస్త్రిగా పనికి కుదిరాడు.బతుకు పాఠశాలలో అనేక పాఠాలు నేర్చుకున్నాడు. నాలుగో తరగతి చదువుల చదువుకున్నారని ఆయన చెప్పాడు ప్రారంభంలో అందెశ్రీ వివిధ పత్రికలలో ఇంటర్వ్యూలును చూస్తే సంబరమా శ్చర్యాలు కలుగక మానవు. అందెల పదాలు పాటల పూదోట ఆయన పుస్తకాలు. కొత్త పాట రాసిన ప్రతిసారి తాపీ పని నుంచి సరాసరి పత్రిక ఆఫీసులకు వచ్చేవాడు మిత్రులైన తదితరులను కలిసేవాడు వారి కోరికపై కొత్త పాటను వినిపించేవాడు. మొదట్లో బిరుదురాజు రామరాజు దగ్గర ఎక్కువగా కనిపించేవాడు. తర్వాత తర్వాత ఆయన సాహితీ ప్రపంచం విస్తృతమైన కొద్దీ ,ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాడు. "నెత్తి మీద సుట్ట బట్ట ఆపైన పండ్ల బుట్ట తెనుగోల్ల ఎల్లవ్వా ఏది" తెలంగాణ అస్తిత్వం లో కింది కులాల పైన రాసిన గొప్ప పాట ఇది. "మాదిగయ్యల మేధ నుండి పురుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడు మేలుకొలుపుతున్నది" వంటి పాటలను రాసి పాడిన అద్భుతమైన జానపద వాగ్గేయకారుడు మరియు "మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం లేని వాడు " ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి ఎలా చిరునామా కోల్పోతున్నాడో వివరంగా తన కలం ద్వారా గళం ద్వారా గొంతెత్తి వినిపించాడు.

ఇకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా వాగ్గేయకారుడుగా ఆయన పాత్ర అమోఘమైనది. అద్వితీయమైనది. ఆయన సాహితీ ప్రస్థానం అంతా ఒక ఎత్తు తెలంగాణ ప్రజల రాష్ట్ర గీతం " జయ జయ జయహే . తెలంగాణ" లో తెలంగాణ ఖ్యాతిని చరిత్రను నిక్షిప్త చేస ప్రజల నాలికల పైన అజరామైన కవి అందెశ్రీ్ తాటికవి ఇకముందు తెలంగాణలో జన్మిస్తాలనుకోవడం అసాధ్యమైన అసాధ్యమైన అంశం. ఆయన పాటల మాటల సారాంశం అంతా తెలంగాణ అస్తిత్వంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి అందులో తెలంగాణ సాహిత్యానికి ఒక తీరని లోటు ఆ లోటును భర్తీ చేయడం ఎవరి తరం కాదు ఇకముందు కానేరదు. అన్నిటికన్నా మిక్కిలి నాకు అత్యంత ఆత్మీయుడైనా అందెశ్రీ ఈ ఉదయం అకాల మరణం చెందడం నాకు పుట్టెడు దుఃఖాన్ని తీరని ఆవేదనలను మిగిల్చింది . అందెశ్రీ అసలు పేరు అందె ఎలయ్య ప్రపంచంలోని నదులన్నీ తిరిగి వచ్చి నది కావ్యం బ్రోతుకావ్యం రాయాలని బృహత్ కావ్యం రాయాలని సంకల్పించాడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆయన హృదయాంతరాంతరాలలో ఒక ఆధ్యాత్మిక స్రోతస్విని నిరంతరంగా ప్రవహిస్తుంది

Tags:    

Similar News