నువ్వు గడియారంతో పోటీ పడుతోంటే
కాలం సిగ్గుతో కరిగి పోతుందేమో
నువ్వు సూర్యోదయానికి
ఎదురొడ్డితే కోడి కాకై కూస్తుందేమో
కమలం ముడుచుకుపోతుందేమో
కలువలు చిన్నబుచ్చుకుంటాయేమో
కాలాన్ని కదలనీ
కలం కదిలినంత కదలనీ
కలలని చెదరనీక
కలష్వంగంలో బంధించేయ్
నిశిని నీ కవిత్వంలో ఒదగనీ
సంధ్యని నీ పరిష్వంగంలో ఇమడనీ
ప్రకృతిని తన బాట సాగనీ
కాల చక్రాన్ని తిరగనీ
తిరిగే గడియారాన్ని గమించనీ
పొద్దు పోకడలుపోటు పాట్లు
ఎవరి కోసమూ ఆగవు
మనం కొలిచేది కాలమానాన్ని మాత్రమే
కాలాన్ని కాదు
-ప్రొఫెసర్ కొవ్వలి గోపాలకృష్ణ