సీనియర్ సిటిజన్స్ కు మోడీ శుభ వార్త
ప్రయాణాల నుంచి వైద్యం వరకు అన్నింటిలో రాయితీలు.;
దేశంలోని సీనియర్ సిటిజన్స్‌కే ప్రధాని మోడీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ప్రయాణాల్లో, వైద్య సదుపాయాల్లో రాయితీలు, బ్యాంక్ డిపాజిట్లలో మంచి వడ్డీలు ఇలా చాలానే ప్రయోజనాలను అందిస్తుంది. ఇందుకోసం సీనియర్ సిటిజన్స్ చేయాల్సింది ఒక్కటే.. కేంద్రం అందించే ‘సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్’ను కలిగి ఉండటం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు అన్నింటిలో మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్తోంది. ఈ ఐడీ కార్డ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. వీటి ద్వారా వృద్ధులకు అనేక ప్రయోజనాలు చేరువవుతాయి. సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వివిధ ఆర్థిక, పన్ను, ఆరోగ్య ప్రయోజనాలను ఈ కార్డ్ ద్వారా పొందవచ్చు.
సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి..?
దేశంలో 60 సంవత్సరాల వయసుపైబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీనియర్ సిటిజన్‌షిప్ కార్డ్ అందిస్తాయి. ఇది చాలా కీలకమైన గుర్తింపు డాక్యుమెంట్. ఇది వృద్ధులకు ఆధార్ కార్డ్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించే వివిధ ప్రయోజనాలను పొందగలుగుతారు.
అర్హతలు ఇవే..
60 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న ప్రతి భారతీయ పౌరులు ఈ కార్డ్‌ను పొందడానికి అర్హులే. కానీ వారి వయసును ధ్రువీకరించడానికి తగిన పత్రాలు కావాల్సి ఉంటుంది. మీరు ఏ రాష్ట్రంలో అయితే ఈ కార్డ్ పొందాలని భావిస్తున్నారో.. ఆ రాష్ట్ర శాశ్వత నివాసిగా నిరూపించే అధికారిక పత్రాలను మీరు కలిగి ఉండాలి.
దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు..
సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్ పొందడానికి మీ గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, వయసు ధ్రువీకరణ పత్రం కావాలి. వీటిలో ఐడీ ప్రూఫ్‌గా దాదాపు ఎనిమిది కార్డులను ప్రభుత్వం స్వీకరిస్తుంది. అదే విధంగా అడ్రస్ ప్రూఫ్‌గా 10 దరఖాస్తులను అంగీకరిస్తుంది. ఏజ్ ప్రూఫ్‌గా నాలుగు పత్రాలను ఆమోదిస్తుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్‌కు అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అయితే దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా అధికారిక జాతీయ ప్రభుత్వ సేవల వెబ్‌సైట‌్‌ను సందర్శించాలి. అందులో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ పేజీకి వెళ్లాలి. అక్కడ ‘సీనియర్ సిటిజన్ ఐడీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. కొత్త యూజర్ అయితే.. రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు దరఖాస్తు ఫారమ్ వస్తుంది. దానిని అన్ని వివరాలతో నింపి, అడిగిన సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌కు చేయాల్సిన చెల్లింపు చేయాలి. ఆ తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి. అన్ని వివరాలతో అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఏడు రోజుల్లో సీనియర్ సిటిజన్ కార్డు జారీ చేయబడుతుంది.
అదే విధంగా మీరు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్ దరఖాస్తు పొంది.. అందులో అన్ని వివరాలు నింపాలి. కావాల్సిన పత్రాలను దరఖాస్తుకు జతచేయి.. సంబంధిత ఫీజును చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో మీకు కార్డ్ జారీ చేయబడుతుంది.
అసలు ఈ కార్డ్ వల్ల ప్రయోజనాలు ఏంటి..
- సీనియర్ సిటిజన్ ఐడీ కార్డ్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే..
- FDలు (ఫిక్సెడ్ డిపాజిట్) మరియు RDలు (రికరింగ్ డిపాజిట్) పై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తుంది.
- ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.
- ప్రైవేట్ ఆసుపత్రులలో రాయితీ వైద్య ప్రయోజనాలు
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం
- సీనియర్ సిటిజన్లు ఈ కార్డును ఉపయోగించి భారత హైకోర్టులో ప్రాధాన్యతా విచారణ తేదీలను అభ్యర్థించవచ్చు.
- MTNL మరియు BSNL కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాధాన్యతా సంస్థాపన సౌకర్యంతో పాటు కనీస రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందించబడతాయి.
- వృద్ధాశ్రమ కేంద్రాల నుండి సేవలను పొందేందుకు తక్కువ ఛార్జీలు వర్తిస్తాయి.
- కార్డు యొక్క చెల్లుబాటు దేశవ్యాప్తంగా ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సు రవాణా సేవల సంస్థ లేదా విమాన ప్రయాణ సంస్థ అందించే బస్సు టిక్కెట్లపై డిస్కౌంట్లు అందించబడతాయి.