కలలకు రంగులు అద్దిన రంగవల్లి విజ్ఞాన కేంద్రం వార్షికోత్సవం

ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి

Update: 2025-11-16 02:30 GMT

   ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు కోరినారు. ఇందుకొరకు ఉదయం 11 గంటల వరకు నేను సిరిసిల్ల నుండి వేములవాడ కమాన్ దగ్గర నూతనంగా నిర్మించిన రంగవల్లి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్నాను. తీవ్రమైన చలిని లెక్క చేయకుండా అప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అమరుల కుటుంబాల వారు వచ్చారు . భుజాన గొంగడి వేసుకున్న పురుషులు ఎర్ర దుస్తువులు ధరించిన స్త్రీలు యువకులు మొత్తానికి అరుణోదయ కళాకారులందరూ రోడ్డు దగ్గరికి నుంచి కొంచెం లోపల ఉన్న విజ్ఞాన కేంద్రం వరకు ఒక పాటల ఊరేగింపుగా వెళ్లడానికి తయారు అవుతున్నారు. కొందరి యువకులు డప్పుతో కొందరు నడుస్తున్నారు . విమల నన్ను" అన్నా నడుస్తారే మీరు" అడిగింది . "నేనూ నడుస్తాను" అంటూ తారు రోడ్ వైపు అడుగులు వేశాను . సిరిసిల్ల కరీంనగర్ రోడ్డు పక్కన పాతిన రంగవల్లి విజ్ఞాన కేంద్రం బోర్డు దగ్గర నుండి కొంతమంది ఎర్రజెండాలు చేత పట్టుకోగా పనికొందరు డప్పు దరువు వాయిస్తూ పాటలు పాడుకుంటూ ఒక గోగు పూల ఊరేగింపు భవనం వైపు కదిలింది.

సభకు అధ్యక్షత వహించిన విమల తో పాటు ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కొల్లూరు విమల,విశిష్ట అతిథిగా నేనూ పాల్గొన్నాను.


సహజంగా అధికార, విపక్ష పార్టీలు నిర్వహించే సభలకు ముందు వెనుక ఉండే ఆర్భాటాలు అట్టి సభలకు ప్రజలు తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయడం సభకు వచ్చిన వారికి ఇతోదికంగా మర్యాదలు చేయడం యాంత్రికంగా జరుగుతున్నవి. అందుకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి కి గుర్తుగా స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి సమాజం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన ఈ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొని వారి వారి కారణాలవల్ల మౌనం వహించి జరుగుతున్న అన్ని పరిణామాలను ప్రేక్షకుడిగా గమనిస్తున్న వారు కూడా ఈ సమావేశంలో బాధ్యులుగా చురుకైన పాత్ర నిర్వహించారు .

మధ్య మధ్య అరుణోదయ కళాకారుల పాటలతో ఇప్పటివరకు అమరత్వం పొందిన వీరుల త్యాగాలను కీర్తిస్తూ తలుచుకొని గణంగా నివాళులు అర్పించారు. పరిమితంగా నైనా ఆసక్తికరంగా స్త్రీలు పురుషులతో పాటు ఆలోచనా పరులు సామాన్యులు వచ్చారు . చాలామంది ఈ సమాజం ఎటు పోతుంది అనే ఆలోచనలను పంచుకున్న వారితో చివరి వరకూ జరిగింది.

అరుణోదయ కళాకారులు పాడుకునే పాటలలో ఎక్కువగా రచించిన కవి మిత్ర అలియాస్ అమర్ అలియాస్ కూర దేవేందర్ ఈ సభలో ఉండడం విశేషం. ఆయన సహచరి విమల అధ్యక్షత వహించడం వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడం మాత్రమే కాదు వీరు ఎంతో ఆత్మీయంగా కలివిడిగా మాట్లాడే తీరును చూస్తే ప్రజా ఉద్యమాల నిర్మాణంలో నిబద్ధత ఆచరణ ప్రత్యక్షంగా కనబడింది.

అంతేకాకుండా ఒక ఆశయం కోసం లక్ష్యం కోసం పనిచేసే అమరవీరులైన వారి భార్యలు, అనేక విధాలుగా గాయపడిన మాజీ సహచరులు ఈ ఒక పూట సభలో తమ తమ ఊర్ల నుండి స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

అమెరికాలోని ఇతర దేశాలలోని వివిధ యూనివర్సిటీలను హ్యుమానిటీస్ భాగంలో బోధన చేసింది. తిరిగి వచ్చి హైదరాబాదులోని అమెరికా స్టడీస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కొల్లూరు విమల ఉపన్యాసంలో స్థానిక ఉదాహరణ లను తీసుకొని సమాజ సంక్షోభం గురించి వివరించిన అంశాలు పాల్గొన్న వారిని దీర్ఘమైన ఆలోచనలు పడవేసింది. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అనేక చిక్కుముళ్లను సుధా రంగా విద్యార్థులకు చెప్పినట్టు విప్పి చెప్పింది.

సభాధ్యక్షత వహించిన గాయకురాలు, నాయకురాలైన విమల ఇక్కడ జరిగిన పోరాటాల గురించి ఆయా పోరాటంలో ఆయా సంఘటనలలో నేల కొరిగిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వివరించింది.

నేను ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకతను నా యొక్క అనుభవాలు,నేను చదివిన పుస్తకాలు నన్ను తీర్చిదిద్దిన గ్రంధాల గురించి వివరించాను. ప్రస్తుత అత్యాధునిక కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాత్వికవేత్తల గ్రంథాలను మహనీయుల ఆత్మకథలను జీవిత వాస్తవాలకు అద్దం పట్టిన గొప్ప కథలు, నవలలు వ్యాసాల పుస్తకాల అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నాను. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవడానికి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఒక ప్రజా దృక్పథం ఏర్పరచుకోవడానికి ప్రజా గ్రంధాలయాల అవసరం గ్రామ గ్రామాలలో నెలకొల్పాల్సిన ఆవశ్యకత మరింత ఏర్పడిందని చెప్పాను.

ఉపన్యాసానికి ఉపన్యాసానికి నడుమ అరుణోదయ కళాకారులు అద్భుతమైన పాటలు పాడారు. డబ్బు దరువులతో కాళ్ల గజ్జల సవ్వడితో సభా ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. చివరగా ఆ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులతో మాట్లాడించడం వలన వివిధ సమస్యల సమాహారమైన సంధి కాలం దిశ దశల తీరు పైన వారి ఆలోచనలను మిగతావారు పంచుకున్నట్లు అయింది. సమావేశం దాదాపు మూడు గంటల పైగా జరిగింది. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఆయా వ్యక్తుల జీవితాలను ఒకరికొకరు కలబోసుకుంటూ భోజనం చేశాము.

సభ ముగియగానే ఎక్కడి వారు అక్కడికి వెళ్ళక విజ్ఞాన కేంద్రంలో కూర్చుని సాయంత్రం వరకు అందరూ కలిసి మెలిసి మాట్లాడుకున్నారు.

అనేక ప్రజా పోరాటాల సమావేశాలను, ప్రజాస్వామ్య పార్టీల సభలను దగ్గరగా చూసిన అనుభవాలు అనేకం ఉన్నాయి.. కానీ ఎన్నో దశాబ్దాల తర్వాత మళ్లీ ఇటువంటి సభలో పాల్గొనడం వలన నాకు ఒక ఆశాజనకమైన ఊరట లభించింది.ఒక ప్రత్యామ్నాయ సమాజ నిర్మాణం గురించిన కలలకు కొత్త రెక్కలు వచ్చాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆశాజనకమైన ఇంధనాన్ని అందించింది. ఒకానొక నూతనోత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగించిందనడంలో ఏమాత్రం సంశయం లేదు.

Tags:    

Similar News