ట్విట్టర్ లో #clickhere ట్రెండింగ్.. అసలేంటి దీని కథ?

ఎక్స్ (ట్విట్టర్) లో శనివారం నుండి "క్లిక్ హియర్" ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. చాలామంది యూజర్ల వాల్ పై ఈ క్లిక్ హియర్ ఆల్ట్ టెక్స్ట్ ఇమేజెస్ దర్శనమిస్తున్నాయి.;

Update: 2024-03-31 13:18 GMT

ఎక్స్ (ట్విట్టర్) లో శనివారం నుండి "క్లిక్ హియర్" ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. చాలామంది యూజర్ల వాల్ పై ఈ క్లిక్ హియర్ ఆల్ట్ టెక్స్ట్ ఇమేజెస్ దర్శనమిస్తున్నాయి. సామాన్యులే కాదు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఈ ఫీచర్ ని సోషల్ మీడియా ప్రచారం కోసం బాగా ఉపయోగించుకుంటున్నారు. ట్విట్టర్ ఓపెన్ చేయగానే ఇవే పోస్ట్స్ కనిపిస్తుండటంతో దీంతో ఈ క్లిక్ హియర్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.

ఏంటి ఈ క్లిక్ హియర్..

పైన ఫొటోలో కనిపించినట్టు వైట్ బ్యాగ్రౌండ్ లో Click here అని రాసి ఉంటుంది. దాని కింద ఎడమవైపు కార్నర్ లో Alt బటన్ ఉంది. క్లిక్ హియర్ నుండి ఒక యారో సింబల్ Alt వైపు ఇండికేట్ చేస్తూ కనిపిస్తుంది. Alt పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ డిస్ ప్లే అవుతుంది. ఆల్ట్ టెక్స్ట్ లేదా ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫీచర్ తో 1000 లెటర్స్ తో కూడిన సందేశాన్ని ఇవ్వవచ్చు. ఈ ఆల్ట్ ఫీచర్ ని ట్విట్టర్ 2016 లోనే పరిచయం చేసింది. కానీ రెండు రోజుల నుండి రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, ప్రముఖులు, ఇతర ట్విట్టర్ యూజర్లు ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.

ఈ ఆల్ట్ ఫీచర్ ఎలా వాడాలి?

ట్విట్టర్ లో ఫొటోలకి మాత్రమే ఈ ఫీచర్ ని వాడడానికి అవకాశం ఉంది. వీడియోలకి ఉపయోగించలేము. మొబైల్ ట్విట్టర్ యాప్ లో ఏదైనా ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు alt+ ఆప్షన్ కనిపిస్తుంది. ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లో అయితే ఫోటో అప్లోడ్ చేసినప్పుడు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆల్ట్ కనిపిస్తుంది. ఆల్ట్ పైన క్లిక్ చేసి మీరు రాయాలి అనుకున్న మెసేజ్ ని టైప్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది.

మెసేజ్ ఫోటో కి యాడ్ అవుతుంది. ఎవరైనా ఆల్ట్ పైన క్లిక్ చేస్తే వారికి మెసేజ్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు యూజర్లు క్లిక్ హియర్, యారో మార్క్ తో ఉన్న ఫోటో కి ఆల్ట్ టెక్స్ట్ యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ఆల్ట్ టెక్స్ట్ క్లిక్ చేయడం సులువుగా అర్ధమవుతుంది. దీనివలన తమ మెసేజ్ ఎక్కువమందికి చేరువ అవుతుంది.

ట్రెండ్ ఫాలో అవుతున్న పార్టీలు..

పలు పార్టీల ట్విట్టర్ ఖాతాల్లో క్లిక్ హియర్ ఆల్ట్ ట్రెండ్ లో ఇలా తమ సందేశాన్ని రాసుకొచ్చారు.

జనసేన పార్టీ: వైసీపీ ప్రభుత్వానికి సౌండ్ ఎక్కువ - గాలి తక్కువ.

బీజేపీ తెలంగాణ : అబ్కీ బార్ 400 పార్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ : 2024 జగనన్న వన్స్ మోర్

తెలంగాణ కాంగ్రెస్: భారత్ ఏకమవుతుంది, #india గెలుస్తుంది

తెలుగు దేశం పార్టీ: 2024 వైసీపీ నో మోర్ 

Tags:    

Similar News

అరుణ తార!