ట్రంప్- జెలెన్ స్కీ మధ్య వైట్ హౌజ్ లో మాటల యుద్ధం

మీ వల్ల మూడో ప్రపంచ యుద్దం వస్తుందని జెలెన్ స్కీ పై ట్రంప్ ఆగ్రహం;

Update: 2025-03-01 06:55 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మధ్య వైట్ హౌజ్ వేదికగా ప్రారంభమైన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఇరువురు దేశాధినేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు.

వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో ప్రారంభమైన చర్చలు అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఇలా జరగడంతో ప్రపంచం ఒక్కసారిగా అవాక్కయింది. ఈ పరిణామాల అనంతరం ఇరువురు దేశాధినేతల సంయుక్త మీడియా సమావేశం, విందు రద్దయ్యాయి.

బిగ్గరగా మాట్లాడిన ట్రంప్..
వైట్ హౌజ్ లోని ఓవల్ లో ప్రారంభమైన శాంతి సమావేశంలో ట్రంప్, జెలెన్ స్కీ చర్చలు ప్రారంభించారు. శాంతి ఒప్పందం, ఖనిజాల అప్పగింతపై ఇరువురు అధినేతల మధ్య మాటామాట పెరగడంతో ట్రంప్ సహనం కోల్పోయారు.
జెలెన్ స్కీ పై బిగ్గర మాట్లాడుతూ.. హెచ్చరించారు. ‘‘ఒప్పందం కుదుర్చుకోండి, మీ వల్ల మూడో ప్రపంచ యుద్దం రాబోతోంది. మీ వల్లే ఉక్రెయిన్ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మీరు సొంతంగా గెలవలేరు’’ అని ట్రంప్ అన్నారు.
ఎక్కడా తగ్గని జెలెన్ స్కీ..
ట్రంప్ మాటతీరుతో కంగుతిన్న జెలెన్ స్కీ కూడా తరువాత అదే మాటతీరుతో అమెరికా అధ్యక్షుడికి సమాధానాలు చెప్పారు. ‘‘మేము మా దేశంలో బలంగా ఉన్నాము. మీ సాయానికి కృతజ్ఞతలు’’ అని కటువుగా అన్నారు.
దీనితో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జోక్యం చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కనక లేకపోతే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటనీ నిలదీశారు.
ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ మీడియా ముందే జరగడంతో వారు కూడా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. చర్చలు కాస్త అరుపుల కార్యక్రమంగా మారింది. కొద్దిసేపు తరువాత నిగ్రహించుకున్న ట్రంప్.. ‘‘ ఉక్రెయిన ఈ విధంగా వ్యవహరిస్తే శాంతి చర్చలు కష్టమవుతున్నాయని నేను అనుకుంటున్నాను’’ అని అన్నారు.
‘‘మీరు లక్షలాది మంది జీవితాలతో జూదం ఆడుతున్నారు. మీరు మూడో ప్రపంచ యుద్దం రావాడానికి కారణం అవుతున్నారు. ఈ దేశానికి చాలా అగౌరవంగా ఉంది’’ అని జెలెన్ స్కీ ప్రపంచ స్థిరత్వాన్ని పణంగా పెట్టారని ఆయన ఆరోపించారు.
యుద్దం ముగించడానికి దౌత్యం అవసరం అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అనగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు కల్పించుకుంటూ ఏ విధమైన దౌత్యం అని అడిగాడు. దీనికి ప్రతిగా వాన్స్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ నాయకుడు అమెరికా అధ్యక్షుడి పై అగౌరవంగా ఉన్నాడని వాన్స్ ఆరోపించారు.
కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ట్రంప్
కొన్ని గంటల తరువాత రష్యా- ఉక్రెయిన్ మధ్య తక్షణ కాల్పుల విరమణను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. జెలెన్ స్కీ శాంతిని నెలకొల్పాలని, లేదా అమెరికా మద్దతును కోల్పోవాలని హెచ్చరించారు. జలెన్ స్కీ శాంతిని కోరుకునే వ్యక్తి కాదని కూడా అన్నారు. ‘‘ నాకు ఇప్పుడు కాల్పుల విరమణ కావాలి’’ అని అన్నారు.
మాకు భద్రతా హమీలు కావాలి..
ఉక్రెయిన్ పై రష్యా మరోసారి దాడి చేయదనే హమీ లభించే వరకూ శాంతి చర్చలకు వెళ్లకూడదని జెలెన్ స్కీ మీడియాతో అన్నారు. శుక్రవారం నాటి వివాదాన్ని ప్రస్తావిస్తూ.. ఇటువంటి వివాదాలు రెండు దేశాలకు మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడేళ్ల ఘర్షణను ముగించడానికి సిద్దంగా ఉన్నారని పదే పదే ప్రస్తావిస్తున్న ట్రంప్.. రష్యా పై ఉక్రెయిన్ వైఖరిలో ఎలాంటి మార్పులేదని అన్నారు.
ఆ పది నిమిషాలు ఏం జరిగింది...
ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడానికి ట్రంప్ డిమాండ్ చేసి సూచించిన షరతు ప్రకారం.. అమెరికాతో కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్ స్కీ అకస్మాత్తుగా వైట్ హౌజ్ నుంచి వెళ్లిపోయాడు.
నిజానికి జెలెన్ స్కీని శ్వేత సౌధం నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించినట్లు బీబీసీ తెలియజేసింది. మీరు శాంతికి సిద్దంగా ఉంటే తరలిరండి.. లేకపోతే వద్దు అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.
45 నిమిషాల సమావేశం..
ట్రంప్- జెలెన్ స్కీ- వాన్స్ మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇందులో చివరి 10 నిమిషాలు అధినేతల మధ్య వాగ్వాదం జరిగింది. రష్యా పై కీవ్ అధినేత మాట తూలడంతో జేడీ వాన్స్ కలగజేసుకున్నారు.
అమెరికా మీడియా ముందు మీరు మమ్మల్ని దోషిగా చేయడానికే దీనిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారని అనడంతో వివాదం ప్రారంభమైంది.
దీనిపై జెలెన్ స్కీ అభ్యంతరం చెప్పడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు లక్షలాది మంది జీవితాలతో జూదం ఆడుతున్నారు. మూడో ప్రపంచ యుద్దం రావడానికి బీజం వేస్తున్నారు.
మీకు మద్దతు ఇచ్చినందుకు అగౌరవం చూపిస్తున్నారు’’ అని అన్నారు. ట్రంప్ - జెలెన్ స్కీ తో బలవంతంగా ఖనిజాలతో కూడిన ఒప్పందాన్ని, శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించారు.
దీనికోసం దౌత్యపరమైన పరిష్కారం తీసుకురావడానికి పట్టుబట్టారు. కానీ రష్యా నుంచి కొన్ని స్పష్టమైన హమీలను ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. దానికి ఒప్పందంలో స్థానం లేకపోవడంతో చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి.
జెలెన్ స్కీకి డిమాండ్ చేసే స్థానం లేదు..
ఈ సమావేశంలో ముందుగా ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కు సాయం అందిస్తూనే ఉంటామని.. అయితే ఇంతకుముందులా కాదని అన్నారు. మేము యుద్దాన్ని ముగించాలని అనుకుంటున్నాం.
జెలెన్ స్కీ రాయితీలు డిమాండ్ చేసే స్థితిలో లేరని ట్రంప్ సూచించారు. ‘‘నువ్వు మంచి స్థితిలో లేవు. నీ దగ్గర ఇప్పుడు రాయితీ కార్డులు లేవు’’ అని ట్రంప్, జెలెన్ స్కీ వైపు వేలు చూపిస్తూ అన్నారు.
మా దగ్గర మీకు కార్డులు ఉండటం మొదలు పెట్టారు. జెలెన్ స్కీ అమెరికా పట్ల అగౌరవంగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల పాటు యుద్దం జరగడంతో కీవ్ మొత్తం అతలాకుతలమైంది.యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ పుననిర్మాణానికి సంతకాలు జరుగుతాయని అంతా భావించారు. కానీ ఇక్కడ అలాంటివేమి జరగలేదు.
ఉగ్రవాదితో సంబంధం ఏంటీ?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉగ్రవాదిగా అభివర్ణించిన జెలెన్ స్కీ.. హంతకుడితో రాజీపడాల్సిన అవసరం లేదని అన్నారు. యుద్దం సమయంలో కూడా నియామాలు ఉన్నాయని అన్నారు.
జెలెన్ స్కీతో ఒప్పందం కుదిరితే వెలికితీసే ఖనిజాలు, హైడ్రో కార్బన్ల ఇతర వాటితో వెలికి తీస్తే దాని నంచి వచ్చే ఆదాయం దేశానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇలాంటి అరుదైన ఖనిజాలు అమెరికాలో తక్కువగా ఉన్నాయని, వాటిని ఉపయోగించుకుని వాషింగ్టన్ ఏఐ మొదలు సైనిక అవసరాల వరకు వాడుతుందని యోచిస్తోందని అన్నారు.
భవిష్యత్ లో రష్యా దురాక్రమణ నుంచి రక్షణ కల్పించడానికి దీర్ఘకాలిక భద్రతా హమీ గురించి అడిగినప్పుడూ ఒప్పందం పై సంతకం చేసిన తరువాత పోరాటంలో రావడం అసంభవం అన్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదనలను జెలెన్ స్కీ విభేదిస్తున్నారు.


Tags:    

Similar News