ముంబై ఉగ్రవాద నిందితుడిని భారత్ కు అప్పగించబోతున్న అమెరికా
రాణా పిటిషన్ ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు;
By : The Federal
Update: 2025-01-25 11:36 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబై పై ఉగ్రవాద దాడి జరిపి, 166 మంది మృతికి కారణమైన ఘటనలో కీలక నిందితుడు తహావ్వూర్ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ఎన్నిక అయిన రెండు రోజుల్లోనే ఈ నిర్ణయం వచ్చింది. రాణా వేసిన రివ్యూ పిటిషన్ ను తిరస్కరిస్తున్నామని సుప్రీంకోర్టు తెలియజేసింది.
అంతకుముందు శాన్ ప్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తో సహ అనేక ఫెడరల్ కోర్టులలో దాఖలు చేసిన కేసులలో రాణాకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. పాకిస్తాన్ జాతికి చెందిన కెనడియన్ పౌరుడు తహవ్వూర్ రాణా గత ఏడాది నవంబర్ 13న దిగువ కోర్టులో తీర్పును సమీక్షించడానికి సుప్రీంకోర్టులో రిట్ ఆఫ్ సర్టియోరారీ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం రాణా లాస్ ఏంజెల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో నిర్భంధంలో ఉన్నారు. రాణా 26/11 ముంబై దాడుల ప్రధాన కుట్రదారులలో ఒకరైన పాకిస్తాన్ - అమెరికన్ ఉగ్రవాదీ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. హెడ్లీ, భారత్ లో రెక్కీ నిర్వహించడానికి ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయాన్ని తెరవడానికి రాణా సహకరించాడు.
సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా భారత్ కు అప్పగించే విషయంలో ఉపశమనం పొందేందుకు రాణాకు అర్హత లేదని ప్రభుత్వం వాదించింది. తొమ్మిదవ సర్క్యూట్ కోసం యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ను తీర్పును సమీక్షించుకోవడానికి తన రిట్ ఆఫ్ సెర్టియోరారీ కోసం పిటిషన్లలో ఇల్లినాయిస్(చికాగో) ఉత్తర డిస్ట్రిక్ లోని ఫెడరల్ కోర్టులో విచారణలో నిర్దోషిగా తీర్పు వచ్చిందని వాదించారు. అయితే వీటిపై వాదనలు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
2008 లో ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు అమెరిక్లతో సహ 166 మంది మరణించాడు. ఇందులో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 60 గంటలకు పైగా బంధించారు. ముంబైలోని ముఖ్యమైన ప్రదేశాలలో సామాన్య ప్రజలపై కాల్పులు జరిపి, గ్రేనెడ్లు విసిరి భీభత్సం సృష్టించారు.