అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి

తీవ్రంగా ఖండించిన భారత్, విచారణ చేయాలని కాష్ పటేల్ న్యాయవాదుల డిమాండ్;

Update: 2025-03-09 12:01 GMT

కాలిఫోర్నియాలోని చినో హిల్స్ లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి జరగడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దాడి చేసిన దుండగులపై కఠినంగా శిక్షించాలని కోరింది. అలాగే దేవాలయాలకు తగినంత రక్షణ కల్పించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.

ఈ అంశంపై మీడియా సమావేశంలో విదేశాంగ స్పోక్ పర్సన్ రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ‘‘ మేము సంబంధిత అధికారులతో మాట్లాడాము. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. అలాగే దేవాలయానికి భద్రత పెంచాలని కూడా కోరాము’’ అని ఆయన చెప్పారు.
అమెరికాలో నెలకొన్న పవిత్ర దేవాలయాలు ప్రాంగణాల్లో ఈ మధ్య భారత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మోదీ వ్యతిరేక నినాదాలు, రాతలు అక్కడ కనిపించడం సాధారణంగా మారింది. ఆ వ్యక్తులు ఎవరో కూడా అమెరికా పోలీసులు పట్టుకోలేకపోయారు.
ఇంతకుముందు కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని దేవాలయం వెలుపల కూడా ఇలాగే అసభ్యకరమైన రాతలు కనిపించాయి. ఈ ఘటనకు కొన్ని నెలల ముందు కూడా న్యూయార్క్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
అపవిత్రం చేశారు..
చినోహిల్స్ లోని శ్రీ నారాయణ మందిరం అపవిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ శనివారం వెల్లడించింది.
‘‘హిందూ సమాజం ద్వేషానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. చినోహిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని సమాజంతో కలిసి ద్వేషం వెళ్లూనుకోకుండా పోరాడుతుంది’’ అని బీఏపీఎస్ పబ్లిక్ అఫైర్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
అమెరికా లోని భారత కాన్సులేట్ కార్యాలయం కూడా ఈ ఘటనను ఖండించింది. మెల్ విల్లేలోని స్వామి నారాయణ్ ఆలయంపై జరిగిన విధ్వంసం ఆమోదయోగ్యం కాదని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ అన్నారు. యూఎస్ అధికారులు త్వరితగా నిందితులను పట్టుకోవాలని అన్నారు.
న్యాయవాద సంఘాల డిమాండ్..
స్వామి నారాయణ్ ఆలయంపై దాడి జరిగిన ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్, న్యాయవాద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ను కోరింది.
‘‘మా పవిత్ర స్థలాలపై హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలపై దర్యాప్తు జరపాలని మేము ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, తులసీ గబ్బార్డ్ లను కోరుతున్నాం’’ అని తెలియజేసింది.
దేశంలో మరో దేవాలయం పై దాడి జరిగింది. ఇది కేవలం హిందూ ఫోబియా మాత్రమే అని ఆ సంస్థ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. లాస్ ఏంజెల్స్ లోని ఎల్ ఏ ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ రోజు దగ్గరపడుతున్న తరుణంలో ఈ విధంగా జరగడం అందరికి అనుమానాలు బలపడుతున్నాయి.
పది దేవాలయాలు ధ్వంసం..
గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో దాదాపు 10 హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడటం లేదా దొంగతనానిక గురైయ్యాయి. ఇదే దేవాలయం గత ఏడాది సెప్టెంబర్ లో ‘‘హిందువులు తిరిగి వెళ్లండి’’ అంటూ అసభ్యకరంగా రాతలు రాశారు. ఇప్పుడు మరోసారి ఆలయంపై దాడి చేశారు.


Tags:    

Similar News