2026లో బంగ్లాదేశ్‌ ఎన్నికలు..

ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్..;

Update: 2025-06-07 09:17 GMT
Click the Play button to listen to article

బంగ్లాదేశ్‌(Bangladesh)లో జాతీయ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్(Muhammad Yunus). 2026 ఏప్రిల్ ప్రథమార్థంలో ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. కాగా ఎన్నికలు వీలైనంత త్వరలో నిర్వహించాలని అటు సైన్యం, ఇటు రాజకీయ పార్టీలు యూనస్‌పై ఒత్తిడి తెచ్చాయి.

ఈ ఏడాదిలోపే ఎన్నికలు(Elections) నిర్వహించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యూనస్‌ను గత నెలలో కోరిన విషయం తెలిసిందే. జమునలోని తన అధికారిక నివాసంలో బిఎన్‌పి ప్రతినిధి బృందం యూనస్‌ను కలిసింది. మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించాలని కూడా డిమాండ్ చేసింది. వివాదాస్పద సలహాదారులను తొలగించాలని కోరింది. ముఖ్యంగా మహ్ఫుజ్ ఆలం ఆసిఫ్ మహ్ముద్ షోజిబ్ భూయాన్‌ను పక్కన పెట్టాలని ప్రతిపాదించింది. వీరిద్దరు మాజీ ప్రధాన మంత్రి హసీనా అవామీ లీగ్ పాలనకు వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ (SAD) ప్రతినిధులు. ప్రస్తుతం మహఫుజ్ ఆలం యువత, క్రీడలు విభాగం, ఆసిఫ్ మహమూద్ షోజిబ్‌కు సమాచార మంత్రిత్వ శాఖల శాఖను అప్పగించారు. 

Tags:    

Similar News