‘మోదీ ప్రభుత్వానికి జో బైడెన్ అత్యంత అనుకూలంగా సహకరించారు’

హడ్సన్ యూనివర్శిటీ థింక్ ట్యాంకర్ అపర్ణ పాండే అభిప్రాయం;

Update: 2025-01-05 11:00 GMT

త్వరలోనే పీఠం దిగిపోనున్న జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ దశాబ్ధంలోనే అత్యంత ప్రో ఇండియా విధానాన్ని అనుసరించిందని, ఈ విధానాన్ని క్రాస్ చేయడం మిగిలి అధ్యక్షులకి సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ 2.0 సర్కార్ గ్రేట్ పవర్ పాలిటిక్స్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉందని అయితే ఇవన్నీ వ్యూహాత్మక పరోపకారం మాత్రం కాదని అభిప్రాయపడ్డారు.

అమెరికన్ జాతీయ ప్రయోజనాలకు భారత్ ఉపయోగపడుతుందని భావించి సంబంధాలు మెరుగుపరుచుకున్నారని హడ్సన్ యూనివర్శిటీలోని ఫ్యూచర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా విభాగాపు థింక్ ట్యాంక్ అపర్ణ పాండే తెలిపారు.

ఈ సంబంధాలు చాలా లోతుగా అల్లుకున్నాయని అవన్నీ కూడా సెక్యూరిటీ, ఢిపెన్స్ రంగంలోని హై టెక్నాలజీ పంచుకోవడం వరకూ వచ్చిందని ‘చాణక్య టూ మోదీ’: ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా ఫారెన్ పాలసీ వంటి అనేక పుస్తకాలు రాసిన అపర్ణ పాండే అభిప్రాయపడ్డారు.
దేశంలో కిరాయి హత్యలు చేయడం ఇతరత్రా సమస్యలు ఉన్నప్పటికీ రెండు ప్రజాస్వామ్య దేశాలు తమ బంధాలను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదని అన్నారు. పాకిస్తాన్, చైనా గురించి సేకరించిన ఇంటలిజెన్స్ సమాచారాన్ని యూఎస్, భారత్ తో నిరంతరం పంచుకుంటూనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అలాగే రెండు దేశాలకు బంగ్లాదేశ్ ప్రస్తుత విషయంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అయినప్పటికీ తమ సంబంధాలను ధృడపరుచుకుంటూనే ఉన్నారని పేర్కొన్నారు. ట్రంప్ హయాంలోనూ ఇవి కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ కు మోదీతో మంచి స్నేహం ఉందని, ఇండియా అంటే ఓవరాల్ గా మంచి అభిప్రాయంతోనే ఉన్నారని పేర్కొన్నారు. అతని ప్రభుత్వంలో నామినేట్ అయిన వ్యక్తులు కూడా న్యూఢిల్లీతో మంచి సంబంధాలు కోరుకునే వ్యక్తులు అని అభిప్రాయపడ్డారు.
ఇంతకుముందు ట్రంప్ 1. 0 హయాంలో వచ్చిన పాలసీలకు తిరిగి పున: ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఉదాహారణకు ఫసిఫిక్ పాలసీ, క్వాడ్, షేరింగ్ హై టెక్నాలజీ తిరిగి పట్టాలు ఎక్కుతాయని అన్నారు. ఆయుధ అమ్మకాలు, కీలకమైన టెక్నాలజీ ట్రాన్ ఫర్ జరుగుతాయని అన్నారు. ట్రంప్ హాయాంలో చైనాను వెనక్కి నెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారని, ఆర్థిక, టెక్నాలజీ, మిలిటరీ వంటి రంగాలలో దానికి దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తారని అన్నారు.
అయితే ఇమ్మిగ్రెంట్స్ విషయంలో మాత్రం ట్రంప్ నుంచి భారత్ కు సవాల్ ఎదురుకావచ్చని, తెలిపారు. కాగా ట్రంప్ జనవరి 20న అమెరికా 47 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Tags:    

Similar News