మోదీ, షీ, పుతిన్ మధ్య బాండింగ్ ప్రపంచానికి అర్థమైందా?

పాక్ ప్రధానిని పట్టించుకోని ఎస్సీఓ సమ్మిట్;

Update: 2025-09-01 07:12 GMT
పుతిన్ తో ప్రధాని మోదీ, చిత్రంలో దూరంగా ఉన్న పాక్ ప్రధాని షరీఫ్

తియాంజిన్ లో జరుగున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో మోదీ- పుతిన్- షీ జిన్ పింగ్ ల స్నేహం ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. సెప్టెంబర్ 1న జరిగిన ఎస్సీఓ ప్లీనరీ సమావేశానికి ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కనిపించారు. అంతకుముందు వీరు ముగ్గురు కలిసి ఎస్సీఓ సమావేశానికి కలిసి వచ్చారు.

పాకిస్తాన్ ఒంటరి..
ఎస్సీఓ వేదిక నుంచి విడుదల అయిన వీడియోలు, ఫొటోలు ముగ్గురు దేశాధినేతల మధ్య ఉన్న స్నేహాన్ని బహిరంగంగా బయట పెట్టింది. ఇందులో ముగ్గురు దేశాధినేతలు పక్కపక్కన ఉండగా, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దూరంగా నడుచుకుంటూ వస్తున్నట్లు చూపించాయి.
షరీఫ్ ఒంటరిగా ముందుకు నడుస్తున్నారు. ఇది పాక్ స్థాయిని అంతర్జాతీయంగా తెలియజేసినట్లు అయింది. ఇంతకుముందు కూడా కొన్ని చిత్రాలు ఎస్సీఓ సమ్మిట్ నుంచి విడుదల అయ్యాయి. ఇందులో కూడా పాక్ ప్రధానిని ఎక్కడో దూరంగా పెట్టారు. మోదీ, పుతిన్, షీ ఒకరి వీపు మీద ఒకరు చేయి వేసుకుని కనిపించారు.


 


దేశాధినేతల మధ్య సంభాషణ తరువాత కొద్ది సేపటికి పుతిన్, షీ జిన్ పింగ్ లతో కలిసి ఉన్న రెండు ఫోటోలను మోదీ ఎక్స్ లో షేర్ చేశారు. ‘‘టియాంజిన్ లో పరస్పర చర్యలు కొనసాగుతున్నాయి’’ అని క్యాప్షన్ ఇచ్చారు. పుతిన్, జిన్ పింగ్ తో అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నామని ఆయన చెప్పారు.
మోదీ చిరునామా..
ఈ రోజు మోదీ ఎస్సీఓ ప్లీనరీ సమావేశం ప్రసంగించనున్నారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహాకారం, కనెక్టీవిటీతో సహ భారత దేశ వ్యూహాత్మక ప్రాధాన్యతలను వివరించబోతున్నారు. రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక వ్యవహారాలలో రష్యాతో భారత దీర్ఘకాల సంబంధాలను పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం పుతిన్ తో మరోసారి కలవనున్నారు.
ప్రపంచం అల్లకల్లోలం..
ప్రపంచం మొత్తం సుంకాల మోత, యుద్దాలతో అల్లకల్లోలంగా ఉంది. ఇదే సమయంలో తియాంజిన్ లో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాక్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అలాగే మరో పొరుగు దేశం అయిన చైనా తో సరిహద్దు సమస్యలు సమసినట్లే కనిపించినప్పటికీ ఎప్పుడో ఒకసారి అవి తిరిగి వస్తూనే ఉన్నాయి. ఇంకో వైపు భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో న్యూఢిల్లీ కూడా తన విధానాలను పున: సమీక్షించుకునే అవకాశం కనిపిస్తోంది.
Tags:    

Similar News