రాజకీయాలు, వ్యాపార సంస్థ ఒకటి కాదని మస్క్ తెలుసుకున్నారా?

నెలల కాలంలోనే బీటలువారిన ట్రంప్, మస్క్ స్నేహం;

Update: 2025-06-01 12:11 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తో మస్క్

వివేక్ కట్జూ

పెట్టుబడిదారి దేశాలలో ప్రయివేట్ సంస్థలు చాలా సులువుగా సిబ్బందిని తొలగించగలవు. కానీ అదేవిధంగా ప్రభుత్వాలు చేయలేవు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పాలనా పగ్గాలు చేపట్టిన ట్రంప్, ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడానికి ప్రతినబూనారు.

అందుకోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ను అధిపతిని చేశాడు. ఈ ఇద్దరు అహంకారులతో ఈ వ్యవస్థలో మధ్యే మార్గానికి అవకాశం లేకుండా పోయింది.

ఈ విషయంపై నేను మార్చిలో ఒక ప్రముఖ భారతీయ పత్రికకు వ్యాసం వ్రాస్తూ నేను ఇలా అన్నాను. ‘‘ట్రంప్- మస్క్ బృందం ఎంత వరకూ విజయవంతమవుతుందో లేదో  చూడాలి.
ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యూరోక్రసీలు ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక మార్గాన్ని కనిపెట్టాయి’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాను.  నేను రాసిన వ్యాసంపై ఒక అమెరికన్ స్నేహితుడు నాకు సమాధానం పంపాడు. ‘‘ఈ అహంకారాలు కలసి ఎంతకాలం ఒక జట్టుగా ఒకరిపై ఒకరు తిరగబడకుండా ఉంటాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది’’ అని అన్నారు.
ట్రంప్ - మస్క్ జట్టు ఎక్కువ కాలం ఉండదని నా అమెరికన్ స్నేహితుడి అంచనా నిజమైంది. ట్రంప్ కు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఈ భూమి మీద ఉన్న కొన్ని ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇద్దరి స్నేహితుల మధ్య పతనం..
ట్రంప్- మస్క్ విడిపోవడానికి తక్షణ కారణం ట్రంప్ బడ్జెట్ పై మస్క్ తీవ్ర విమర్శలు చేయడం. ఇది అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఆయన బడ్జెట్ ను బహిరంగంగా విమర్శించారు. ఆయన ఒక యూఎస్ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘‘బడ్జెట్ లోటును పెంచి, దాని సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) బృందం చేస్తున్న పనిని బలహీనపరిచే భారీ వ్యయ బిల్లును చూసి నేను నిరాశపడ్డాను’’ అన్నారు.
ఇటువంటి బహిరంగ విమర్శలు ట్రంప్ కు, ఆయన సలహదారులకు నచ్చలేదు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి ట్రంప్ తనకు సహకరిచడంలేదని కూడా మస్క్ భావించి ఉంటాడు.
ఇది ఆయనకు ఇష్టంలేదు. నా అమెరికన్ స్నేహితుడు గుర్తించినట్లుగా ట్రంప్, మస్క్ ఇద్దరికి ఆహంకారం ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా మారింది. దీనితో రాజీకి అవకాశం లేదు.
మస్క్ తప్పుకోవడానికి ప్రధాన కారణంగా బడ్జెట్ కనిపిస్తున్నప్పటికీ, కొంతకాలంగా ఇరువురి మధ్య సయోధ్య లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ట్రంప్ క్యాబినేట్ లోని సీనియర్లకు ఆయన విధానాల పట్ల సంతృప్తి లేరని సంకేతాలను అమెరికా అధ్యక్షుడు గ్రహించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యక్తులలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఉన్నారు. ఈ సీనియర్ రాజకీయ నాయకులు కొత్తగా సృష్టించబడిన డోజ్ లో సమావేశాన్ని బహిష్కరించడం, బడ్జెట్లు, ఉద్యోగులను తగ్గించడంలో మస్క్ నియమించిన వ్యక్తులను తలదూర్చడానికి ఇష్టపడలేదు.
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూఎస్ ఎయిడ్) సంబంధించిన వ్యవహరాలు దీనికి కారణం. అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక, ప్రాజెక్ట్ సహాయాన్ని అందించడానికి యూఎస్ ఎయిడ్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక సాధనం. అయితే డోజ్ దీనిని పూర్తిగా విచ్చిన్నం చేసింది.
ఇది అక్కడ గందరగోళానికి దారితీసింది. దీనితో పేద దేశాలకు యూఎస్ నుంచి అందుతున్న సాయం పూర్తిగా నిలిచిపోయింది. సీనియర్ స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారులు లేదా కార్యదర్శి రూబియో నుంచి బహిరంగంగా ఎటువంటి నిరసనలు లేనప్పటికీ, అది యూఎస్ విదేశాంగ విధానానికి హనీ కలిగిస్తుందని భావించారు.
పాలన వర్సెస్ కార్పొరేట్ సంస్కరణలు
జనవరి 2017- జనవరి 2021 మధ్య అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ తెలుసుకోవాల్సిన అసలు సమస్య ఏమిటంటే.. ప్రభుత్వంలో సంస్కరణలు వ్యాపారం, పరిశ్రమలలో సంస్కరణల వలె ఉండకూడదు.
అమెరికా, ఇతర పెట్టుబడిదారి దేశాలలోని ప్రయివేట్ సంస్థలు ఉద్యోగులను నియమించుకోవచ్చు, తొలగించుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఇలా చేయలేవు.
ప్రయివేట్ కంపెనీలు నష్టాలను ఆర్జించే యూనిట్లుగా భావించే వాటిని మూసివేయవచ్చు. కానీ ప్రభుత్వాలు అకస్మాత్తుగా ఆ విభాగాలను మూసివేయలేము. ఎందుకంటే ఒక విభాగానికి, ఇతరులకు మధ్య సంబంధాలు ఉన్నాయి.
ఒక విభాగం మూసివేయడం వల్ల మొత్తం ప్రభుత్వం ప్రభావితం కావచ్చు. కాబట్టి వాటిని మూసివేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి.
వ్యాపార సంస్థలు, ప్రభుత్వం మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వ్యాపారానికి ముఖ్యం లాభం. కానీ తరువాత ఉద్దేశం ప్రజలకు సేవ చేయడం. అందువల్ల వ్యాపారాలు, ప్రభుత్వాలు రెండింటిలోనూ సామర్థ్యాన్ని పెంచడానికి పొదుపును పెంచడానికి నిరంతరం సంస్కరణలు ఉండాలి.
ఒక వైపు వ్యాపారం, పరిశ్రమలలో ఉపయోగించే పద్దతులు, మరో వైపు ప్రభుత్వ యంత్రాంగం పద్దతులు వేర్వేరుగా ఉంటాయి.
మస్క్ అధికారిక సంప్రదాయాలను తుంగలో తొక్కారు. అనుచిత మార్గాలను ఉపయోగించినప్పుడూ ట్రంప్ దీనిని పట్టించుకోలేదు. అతని మార్గాలు, స్పష్టంగా అమెరికా వ్యాపార సంప్రదాయంలో భాగమే. కానీ అవి అమెరికా ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థ సంప్రదాయాలకు అనుగుణంగా లేవు.
ఉన్నత వర్గాల సమూహాలు..
కొంతకాలంగా మస్క్ చర్యలు ట్రంప్ పాలనలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే ట్రంప్ కు మద్దతు ఇచ్చే విస్తారమైన సామాజిక సమూహాలు ప్రభుత్వాలు, బ్యూరోక్రసీలను అనుమానిస్తున్నాయి.
అందువల్ల డోజ్ లో ఉన్న మస్క్ వ్యక్తులు, ప్రభుత్వ విభాగాల్లోకి వెళ్లి, కార్యక్రమాలను నిలిపివేసి ప్రజలను బయటకు పంపడాన్ని వారు సంతోషించారు. డోజ్ నిర్ణయాలు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే భారీ పొదుపులకు దారి తీస్తాయని, ముఖ్యమైన ప్రభుత్వ సేవలపై ప్రతికూల ప్రభావం చూపకుండానే జరుగుతున్నాయనే ప్రకటనలను వారు ప్రశంసించారు.
అనుభవరాహిత్యం..
అమెరికా ప్రభుత్వం నిబ్బరంగా ఉందని, మస్క్ దర్శకత్వంలో డోజ్ ముందుకు సాగుతుందని తనకు ట్రంప్ మద్దతు ఉంటుందని ప్రపంచ కుబేరుడు భావించారు. దీనికి తోడు ఆయనకు పెద్దగా పాలనానుభవం లేదు.
ట్రంప్ కు వ్యాపారవేత్తకు ఉండే స్వభావాలు ఉన్నప్పటికీ అధ్యక్షుడిగా ఆయన విధానాలు అమలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగంపై ఆధారపడి వస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన విస్మరించలేదు.
అందువల్ల ఆయన అధికారాన్ని దూరం చేసుకుని విజయం సాధించాలని మాత్రం ఆశించలేడు. స్పష్టంగా ట్రంప్ రాజకీయ సలహదారులు మస్క్ విధానాలు ప్రభుత్వ యంత్రాంగంలో తిరుగుబాటుకు కారణమవుతున్నాయని అతనికి తెలియజేస్తున్నారు.
అది అతనికి రాజకీయంగా నష్టం కలిగిస్తుంది. స్పష్టంగా మస్క్ డోజ్ ను నడిపించే విధానాల కారణంగా తన రాజకీయ స్థానాన్ని దెబ్బతినాలని ట్రంప్ కోరుకోలేదు.
లావాదేవీలు..
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కు మస్క్ అతిపెద్ద ఆర్థిక మద్దతు ను ఇచ్చాడు. కాబట్టి ప్రభుత్వంలో తనకు పూర్తిగా సురక్షిత స్థానం ఉంటుందని భావించాడు. అలాగే అనేక వ్యాపార సంస్థలను కూడా ట్రంప్ వెనక నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.
ట్రంప్ ప్రచారానికి మస్క్ చేసిన ఆర్థిక సాయం ముఖ్యమైనదే అయినప్పటికీ 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గొప్ప విజయానికి కచ్చితంగా కారణం కాదు. డెమోక్రాటిక్ పార్టీ ప్రచారంలో చేసిన తప్పులు, బలహీనతలు, ట్రంప్ తో జరిగిన చర్చలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తడబాటు, చివరకు రేసులోకి వచ్చిన కమలా హారిస్ తన విధానాలను వివరించడంలో చాలా సమయం పట్టడంతో ఆయన విజయం సాధించారు.
అంతేకాకుండా 2020 లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలవడం ఆయన నమ్మకమైన అనుచరులు మద్దతు ఇవ్వడం కొనసాగించారు. కానీ ట్రంప్ విజయానికి ఆయన చేసిన దానిని మస్క్ అతిగా అంచనా వేశారు.
కృతజ్ఞత గల ట్రంప్ తమ మధ్య చీలిక ఏర్పడటానికి ఎప్పటికీ అనుమతించరని ఆయన అనుకున్న తప్పు. తన మీద కృతజ్ఞతతో ఎలాంటి చీలికలను ట్రంప్ అనుమతించరని ఆయన అనుకోవడం పెద్ద తప్పు. ఏ దేశంలోనూ రాజకీయాలు అలా ఉండవు.
ప్రభుత్వం వ్యాపారం కాదు..
మస్క్ తన వ్యాపారాలకు తిరిగి వచ్చినప్పటికీ అడగవలసిన ప్రశ్న ఏమిటంటే.. ఆయన వాషింగ్టన్ లో తన లక్ష్యాలను సాధించాడా? వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. ట్రంప్, డోజ్2.3 మిలియన్ల మంది ఫెడరల్ పౌర శ్రామిక శక్తిలో దాదాపు 12శాతం లేదా 2,60 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎక్కువ తొలగింపులు ముందస్తు పదవీ విరమణ, ఆఫర్ల ద్వారా బెదిరింపులతో జరిగినవే.
ఈ కోతలు అలాగే ఉంటాయా? అదే అమెరికా బ్యూరోక్రసీ వీరిని తీసుకురావడానికి మార్గాలను అన్వేషిస్తుందో చూడాలి. మస్క్ ఉదంతం నుంచి నేర్చుకోవాల్సిన చివరి పాఠం ఏంటంటే.. ప్రభుత్వ పరిపాలనా సంస్కరణల వ్యాయమాలు నిరంతరం చేపట్టాలి.
కానీ సాంప్రదాయ పద్దతుల్లోనే జరగాలి. ప్రభుత్వ యంత్రాగాన్ని సరైన పరిమాణంలో సంస్కరించడం, సాంప్రదాయ పద్దతుల్లో ప్రజాధనాన్ని వివేకవంతంగా ఖర్చు చేయడం అనేది అన్ని దేశాలలో చివరికి రాజకీయ సంకల్పం పై ఆధారపడి ఉంటుంది.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు అందిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. ఇవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)


Tags:    

Similar News