గ్రామీణ అభ్యర్థుల వడపోతకే సంస్కరణలు!
శతజయంతిలోకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ -2
భారత సివిల్ సర్వీస్ లలోకి పట్టణాలకు చెందిన చదువుకున్న ఉన్నత వర్గాలవారు వారసత్వంగా వచ్చారు. ఈ వ్వవస్థలోకి 2010 వరకు ప్రవేశించిన వారిలో 70 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందిన వారు. సివిల్ సర్వీసెస్ సామర్థ్య పరీక్ష/ప్రలిమినరీ పరీక్షల రూపంలో 2011లో చేపట్టిన సంస్కరణల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి, సామాజిక శాస్త్రాలు చదువుకుని వచ్చిన ఆశావహులను వడపోయడం కోసం తెచ్చారనే ఆరోపణ ఉంది.
విశిష్టమైన అంశాల్లో విద్యార్హత సాధించిన వారు తాము చదువుకోని అంశాలను ఎంపిక చేసుకోవలసి వస్తోంది. పౌర పరిపాలనా వ్యవస్థలో 1980వరకు మానవీయ, సామాజిక శాస్త్రాలు చదువుకున్న వారు ఎక్కువగా ఉండే వారు. ఇప్పుడు సమాజిక శాస్త్రాలు చదివిన వారి కంటే, ఇంజినీరింగ్, ఐఐటి, వైద్య విద్య, వ్యవసాయ విద్య చదివిన వారే సివిల్ సర్వీసెస్ లోకి ఎక్కువగా వస్తున్నారు. యాదృశ్చిక విద్య ద్వారా శిక్షణ పొందిన వారు విశ్వవిద్యాలయాల్లో సామాజిక శాస్త్రాలు బోధించడం ద్వారా సమస్య ఏర్పడుతోంది.
ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ ఎస్, ఐఆర్ ఎస్ అభ్యర్థులతో పాటు గ్రూప్ ఏ అభ్యర్థులకు కూడా ఉత్తరాఖండ్ లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్త్రేషన్ (ఎల్ .బి.ఎస్. ఎన్. ఏ.ఏ) లో రెండు సంవత్సరాల శిక్షణనిస్తారు. ఎల్ .బి.ఎస్ .ఎన్ ఏ.ఏ లో ఐఏఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఐపీఎస్ అభ్యర్థులకు హైదరాబాదులోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇలా ఒక్కొక్క సర్వీసుల వారికి ఒక్కొక్క చోట శిక్షణనిస్తారు.
రాష్ట్ర స్థాయి అధికార అభ్యర్థులకు వారి వారి రాష్ట్రాల్లో తమతమ పరిపాలనా అకాడమీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ శిక్షణకు తోడుగా డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ ద్వారా ఉద్యోగం మధ్యలో అనేక దశల్లో శిక్షణ నిస్తున్నారు. గ్రూప్ బి, కింది స్థాయి సివిల్ అధికారులకు కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను ఇస్తున్నారు. ఒక్కో విభాగం వారు తమ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు.
అసలు శిక్షణ నివ్వడం, చేర్చుకోవడం అనే క్రమంలో యూ.పీ.ఎస్.సీ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నియామక పద్ధతులు అమెరికా వంటి వలస ప్రజలతో నిండిన అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మానవ వనరుల వినియోగం, మానవ శక్తిని వినియోగించే విధానాల్లో యూ.పీ.ఎస్.సి, సర్వీస్ కమిషన్ లు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది.
కమిషన్ లు రాజ్యాంగం ద్వారా రక్షణ పొందుతాయి కనుక విమర్శల నుంచి ఇబ్బంది ఉండదు. రాష్ట్ర సర్వీసు కమిషన్లు యాంత్రిక అనుకరణతో సాగుతుంటాయి. యువతరంలోని గుణగణాలను గమనించి ప్రైవేటు రంగంలోకి జారిపోకుండా పరిశోధన, అభివృద్ధిపైన దృష్టి సారించాలి. పశ్చిమ దేశాల్లో సివిల్ సర్వీస్ అధికారులను ఎంపిక చేసే బాధ్యతను ప్రైవేటు టెస్టింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. భారత్, సార్క్ దేశాలు వాటిని అనుకరించడం నుంచి బైటపడాలి.
సివిల్ సర్వీసులకు తగిన అభ్యర్థులను ఎంపిక చేసి, శిక్షణ నిచ్చే బాధ్యత కమిషన్ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. రెవన్యూ విభాగానికి ఐ.ఆర్.ఎస్ అధికారులు ఉన్నప్పటికీ, రెవెన్యూ వంటి అన్ని ముఖ్యమైన స్థానాలనూ ఐఏఎస్ అధికారులు ఆక్రమిస్తున్నారని వారి పైన అసంతప్తితో కూడా ఉంది.
గొప్ప జాతి నిర్మాతలు
బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలోని నీతి నియమాలు కల సీనియర్ పాలనాధికారులు నేటి సర్వీస్ కమిషన్ వ్యవస్థకు, దాని ప్రతిష్టకు పునాది వేశారు. వారు బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లో ప్రయోజనకరమైన శిక్షణను పొందారు. సివిల్ సర్వెంట్స్ అధికారుల వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడంలో జేమ్స్ మిల్, ఆయన కుమారుడు జే.ఎస్. మిల్, మాల్తస్ వంటి వారి కృషి ఎంతో ఉంది.
‘అత్యధికులకు ఆనందం కలిగించడం’ అనే ప్రయోజనవాదులు (యుటిలిటేరియన్లు) యువ అధికారుల మనసులపైన ప్రభావం కలిగించారని ఎరిక్ స్టాక్ వంటి పండితులు గుర్తించారు. భారత దేశంలో వనరులను బ్రిటిష్ వారు దోచుకున్నారన్న విషయాన్ని కాదనలేకపోయినప్పటికీ, ఆ అధికారులు మాత్రం ‘నిష్ఫక్షపాతంగా-తటస్తంగా’ మచ్చలేని వారుగా తమతమ సర్వీసులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని వారీ వ్యవస్థలను రూపొందించారు.
మన సివిల్ సర్వెంట్స్ అనుసరించే ప్రయోజనవాదం, ఫ్యాబియన్స్(ప్రజాస్వామిక సోషలిజాన్ని క్రమపరిణామంలో తీసుకు వచ్చేవాళ్ళు) తో నేటి ప్రపంచంలో మన దేశాన్ని ఏకీ కృతం చేయగలుతున్నాం. పరిపాలనా చరురతతో మన పరిసరాలన్నీ సోషలిస్టు ఆలోచనతో నవ స్వతంత్ర దేశంగా అభివృద్ది చెందాలని పథకాలు రూపొందిస్తున్నారు.
ఎస్.ఆర్.శంకరన్, బి.డి.శర్మ, పిసి అలెగ్జాండర్ వంటి సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన వారు పేదలకు, సామాజికంగా అట్టడుగున ఉన్న వారి కోసం నిబద్దతతో పనిచేయడానికి విధానాల రూపకల్పనలో వారి పాత్ర కీలకమైంది. ఈ సేవా దృక్ఫథంతో పనిచేసేవారు 1980 వరకు ఉన్నారు. ఆ తరువాత అధికారులకు స్వార్ధం ఏర్పడడంతో ఇంగ్లాండ్ లో మార్గరెట్ థాచర్ అమలు చేసిన నూతన సంస్కరణల వంటి తాత్వికత తలకెక్కించుకున్నారు.
మన దేశంలో సివిల్ సర్వేంట్స్ ఎలా ఉన్నారంటే, ప్రజా సరుకు, సేవలను అందించడానికి బదులు, కార్పొరేట్ శక్తుల ఆదేశాలను అనుసరిస్తూ, ప్రజల, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తుల ఖజానాకు తరలించేలా ఉన్నారు. లాభాలను ఆర్జించడంలో ఎలా మేనేజ్ చేయాలనే ఏకైక విషయంలో నైపుణ్యం సాధించిన కొందరు వ్యాపార పరిపాలనాధికారులు ఉన్నారు. కానీ, ప్రభుత్వాధికారులు మాత్రం పౌరుల సంక్షేమం, వారిని ఎలా చూసుకోవలనేది ధ్యేయంతో ఉంటారు.
కాలం చెల్లిన నిరర్ధక ఆస్తులను ఎలా చక్కగా ఉపయోగించి, ఉత్పత్తిని ఎలా సాధించాలనే సమర్ధవంతమైన అధికారులు కూడా ఉన్నారు. ఇలా చేయడానికి మనకు సీనియర్ ఐఏఎస్ అధికారి కావాలా? హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ చదివిన వ్యాపార పాలనా దక్షుడు కావాలా? పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం అనే ఒకదానికొకటి పొసగని తాత్వికతలు(దీని మారు పేరే ప్రైవేటీకరణ) వచ్చాయి. ఈ తాత్వికతలు ప్రపపంచ విలువలతో రాజ్యాంగ ఆదేశాల ప్రకారం ప్రజలకు సేవ చేయాలనే నిజాయితీగల అధికారులను బయటకు పంపేస్తున్నారు.
అలాంటి నిజాయితీకల అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, పౌర సమాజంలో కార్యకర్తలుగా కొనసాగుతున్నారు. అలాంటి వారు చేసే పనులు, ఆందోళనల వల్ల పేదలు, అట్టడువర్గాల వారు, బాధితుల పరిస్థితులు కాస్త మెరుగు పడ్డాయి. ప్రభుత్వ అధికారుల వ్యవస్త ఎలా సంక్షోభంలో పడిందో, ఎంత అనవసరమైందిగా తయారైందో తెలుపుతుంది. ఏది ఏమైనప్పటికీ, మన మింకా రాజ్యాంగ గణతంత్ర వ్యవస్థలో ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం, సమానావకాశాల వంటి హామీలతో జీవిస్తున్నాం. ప్రభుత్వాధికారులు వీటిని అమలు చేయవలసి ఉంది.
నిరర్ధక ఆస్తులు-విడిపోవడాలు
భారత దేశంలో నిరర్ధక అస్తుల ద్వారా సరళీకరణ విధానాల పరిణామాలను నిష్ఫాక్షికంగా అంచనా వేసినట్టయితే, మనం ఎక్కడ తప్పు చేశామో అర్థమవుతుంది. సరళీకరణ తరువాత కాలంలో జరిగిన అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉన్నతాధికారులు , ఇతర అధికారుల గురించి జరిగిన గొడవలపై ప్రజల్లో చర్చలు జరిగాయి. ప్రజల మౌలిక అవసరాలు తీరలేదని, సామాజిక వర్గాల మధ్య, ఆర్థిక వర్గాల మధ్య ఉన్న అసమానతల వల్లనే సామాజిక ఉద్రిక్తతలు ఏర్పడ్డాయనేది ఈ చర్చల సారాంశం. ప్రభుత్వాధికారులు ఈ ఉద్రిక్తతలను ప్రభావితం చేయడమో, లాబీయింగ్ కు బాధితులు కావడమో జరగడం ప్రతి చోటా చూస్తున్నాం.
తమ సామాజిక నేపథ్యం వల్లనే ఇబ్బంది పెట్టారని కొందరు బాధితులు ఆవేశపూరితంగా ఆరోపిస్తున్నప్పటికీ, దీనిపై అనుభావిక అధ్యయనం జరగలేదు. వాస్తవానికి ప్రస్తుత సంకట స్థితికి కొందరు విచక్షణారహిత ఉద్యోగజీవితం కల ఐఏఎస్ ఆఫీసర్లు కారకులు. వారు ఆర్థిక విషయాలు, పారిశ్రామిక విధానం వంటి ఒకటి రెండు రంగాలకు మాత్రమే పరిమితమై, వాషింగ్ టన్ ఏకాభిప్రాయానికి అనుకూలంగా ఆర్థిక, సామాజిక విధ్వంసాలపై పట్టు సాధిస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన కొందరు ఆఫీసర్లు ప్రమోషన్ పై అఖిలభారత సర్వీసులకు, కేంద్ర సర్వీసులకు వెళ్ళి డెప్యుటేషన్ పై సాంఘిక సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, రక్షణ, సాంస్కృతిక, దేశీయాంగ, విదేశీ వ్యవహారాలు, గనులు, గ్రామీణాభివృద్ధి వంటి శాఖల్లో చెప్పుకోదగ్గ విధంగా కృషి చేసి, దేశ ఐక్యతకు పాటుపడుతున్నారు. వారు కూడా యూపీఎస్ సీ ద్వారా ఎంపికైన వారు. తమ పర్యవేక్షణలో వారి క్రమశిక్షణ పరిశీలించాకే ఉన్నతాధికారులు వారిని సివిల్ సర్వీసులకు సిఫారసు చేస్తారు. సివిల్ సర్వీసు ప్రమాణాలను పెంపొందింపచేయడానికి ఆత్మపరిశీలన కోసం సివిల్ సర్వెంట్స్ తో పాటు ప్రతి వారికి ప్రస్తుత నేపథ్యంలో అవగాహన కల్పించడానికే ఈ చర్చ.
జాతికి వంద సంవత్సరాలు సేవలందించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని ఈ చీకటి వెలుగులు ఇతర రాజ్యాంగ సంస్థల్లో ఎప్పటికీ కనిపించవు. స్పష్టమైన రాజ్యాంగ ఆదేశాలతో ఏర్పడిన ఈ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ, ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షలో పనిచేసే ఈ కమిషన్ చేసే పరిపాలనా సంస్కరణలు, అంతర్గత కమిటీలు, వ్యక్తిగత విషయాల విభాగానికి కొన్ని పరిమితులున్నాయి.
ఈ కమిషన్ ప్రజాస్వామిక సూత్రాలతో గొప్ప సంప్రదాయాలు, విలువలు, నియమాలతో ఏర్పడింది. గత వంద సంవత్సరాలుగా దీనికి అధ్యక్షత వహించిన 32 మంది, సభ్యులుగా కొనసాగిన 160 మంది కలిసి దీన్ని ఎవరూ నాశనం చేయలేని విధంగా, స్ప్రుశించ దగిందిగా, రాజ్యాంగ సందేశాన్ని మోసుకొస్తోంది.
అనువాదం : రాఘవ
(సమాప్తం)