స్వాతంత్య్రం కోసం ‘సంప్రదాయ వ్యూహం’’ పన్నిన గాంధీ

తెలివైన వ్యూహకర్త, రెండు వర్గాలను ఏకం చేసిన సాంప్రదాయవాదీ

Update: 2025-10-02 06:59 GMT
మహాత్మా గాంధీ

భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ప్రత్యేకమైనది. ఆయన రెండు విడదీయరాని రాజకీయ తార్కిక ప్రపంచాలను ఏకం చేయడంలో విజయం సాధించారు.

అప్పటికే దేశంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ఉన్నత విద్యను అభ్యసించిన ఆధునిక వర్గం కాగా, మరొకటి సంప్రదాయ సామాన్య భారతీయులు. గాంధీ స్వాత్రంత్య ఉద్యమంలోకి రావడానికి ముందు దేశంలో జరుగుతున్న ఉద్యమం అనేక ముక్కలుగా ఉంది.

బ్రిటీష్ పాలనపై ఉన్నత వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. కానీ వారికి కింది స్థాయి ప్రజల మద్దతు లేదు. దేశంలో రైతుల తిరుగుబాట్లు తీవ్రంగా సాగుతున్నాయి కానీ వాటికీ ఏకీకరణ లేదు. అవి భౌగోళికంగా కలిసికట్టుగా ఏకకాలంలో ఒక నాయకత్వం కింద కొనసాగలేదు. వాటిని వలస పాలకులు సులువుగా అణచివేశారు.

ద్వంద్వవాదం..
గాంధీ నిజమైన నాయకత్వ ప్రతిభ ఈ అంతరాలను తగ్గించడంలోనే ఉంది. విశ్లేషకులు దీనిని సెమియోటిక్ ద్వంద్వత్వం తగ్గించడంలోనే బయటపడిందని అంగీకరిస్తారు. ఉన్నత వర్గాలు, సామాన్య ప్రజలను ఇద్దరూ ఏకమయ్యేలా, రాజకీయ విధానాలు రూపొందించారు. ఇది కూడా భిన్నమార్గాలను అనుసరించడం ద్వారా. అందరిని ఒక్క మార్గంలోని మళ్లించారు. 
భారత్ లో గాంధీ చేసిన మొదటి ప్రయోగం, 1917లో జరిగిన చంపారన్ సత్యాగ్రహం, ఈ సంశ్లేషణకు ఉదాహరణగా నిలుస్తుంది. చంపారన్‌ను విడిచిపెట్టమని బ్రిటిష్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాన్ని ఆయన ధిక్కరించడం తీన్ కతియా విధానాన్ని అనుసరించమని ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి నాయకుడిగా కనిపించాడు.
ఉన్నత వర్గాలకు, చట్టపరమైన ప్రక్రియ, డాక్యుమెంటేషన్ చర్చలపై గాంధీ ఆధారపడటం వంటివి అరాచక తిరుగుబాటును నివారించిన వ్యూహకర్తగా గుర్తించింది. రైతుల బాధలను రాజ్యాంగ నిరసనగా అనువదించగల ఈ సామర్థ్యం జాతీయవాదాన్ని ఒకేసారి రెండు పార్శ్వాలలో మాట్లాడటానికి వీలు కల్పించింది.
గాంధీ ఆధునిక మేధావి వర్గానికి ఒక తెలివైన వ్యూహకర్తగా కనిపించాడు. 1922లో అతని విచారణ ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు. గాంధీ దేశద్రోహ ఆరోపణలను అంగీకరించాడు కానీ వలస చట్టాల నైతిక చట్టబద్ధతను సవాలు చేశాడు.
ఒక విధంగా తన నేరాన్ని కల్పితంగా కేసుగా మార్చేశాడు. విద్యావంతులైన భారతీయులకు, ఆయన వలస వ్యవస్థను లోపలి నుండి అర్థం చేసుకున్న న్యాయవాదిగా కనిపించాడు.
అలాగే దాని చట్టపరమైన తర్కాన్ని తనకు వ్యతిరేకంగా మార్చుకున్నాడు. న్యాయమూర్తులను శిక్ష- నిగ్రహం మధ్య సందిగ్ధంలోకి నెట్టాడు. అందువలన గాంధీ చర్యలను తర్కబద్దమైన గణన, వ్యూహాలు, రాజకీయ యుక్తి పరంగా పేరు పొందాయి.
మరో స్థాయిలో, గాంధీ సాధారణ రైతులకు నిరక్షరాస్యులకు ఒక సాధువుగా కనిపించాడు. ఆయన ధిక్కార ధోరణి దాదాపు అద్భుతం. గ్రామీణ ఊహలో, దేశం ఒక సుదూర అణచివేతతో ఉంది.
దీనిని సాధారణ పురుషులు, మహిళలు అరుదుగా సవాలు చేస్తారు. రైతుల విషయానికొస్తే, గాంధీ మహాత్ముడు అయ్యాడు, బలహీనుల బాధలను స్వయంగా విన్న గొప్ప వ్యక్తి, ఉపవాసం, ప్రార్థన చేసేవాడు, సాధారణ దుస్తులను ధరించేవాడు.
త్యాగం, విముక్తి వంటి పాత సాంస్కృతిక పదజాలాన్నితరుచుగా ఉపయోగించేవాడు. ఆ విధంగా గాంధీ రాజకీయాలు అద్భుతమైన విమోచన సంప్రదాయాలతో ప్రతిధ్వనించాయి. ఒకేసారి పాతతరం, ఆధునిక భావనలు జాతీయోద్యమంలో కనిపించడం ప్రారంభం అయ్యాయి.
ఈ ద్వంద్వ అవగాహన గాంధీ సాధించిన గొప్ప విజయం. గాంధీ ప్రత్యేకత కేవలం అహింసను బోధించడంలో మాత్రమే కాదు, చాలా మందికి అర్థమయ్యే రాజకీయాలను నిర్మించడంలో కూడా ఉంది.
బ్రిటిష్ వలస పాలకులకు.. చట్టబద్ధత పరిమితులలో ఆందోళనను నిర్వహించిన ఒక తెలివైన వ్యూహకర్త, రైతులకు త్యాగం, విముక్తి మూర్తీభవించిన మహాత్ముడు. ఆయన ఒక్క చర్య విభిన్న అర్థాలను సృష్టించింది.
1930లో గాంధీ చేపట్టిన దండియాత్ర ఉప్పు సత్యాగ్రహాం లండన్‌లోని ‘ది టైమ్స్’ రాజద్రోహంగా ఖండించింది. అయితే భోజ్‌పురి జానపద పాటలలో ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా ఖ్యాతికెక్కింది.
దండియాత్ర ఈ ద్వంద్వ మార్క్ కు ఉదాహరణగా నిలిచింది. ఈ సత్యాగ్రహం ఉన్నత వర్గాలకు వలసరాజ్యాల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా రాజకీయ వ్యూహంగా పనిచేసింది, కానీ గ్రామీణ భారతానికి ఇది ఒక పవిత్రమైన చర్యగా మారింది.
స్వేచ్ఛకు చిహ్నంగా మార్చింది. అదేవిధంగా, విద్యావంతులైన భారతీయులకు ఉపవాసం రాజకీయ ఒత్తిడిగా కనిపించింది, కానీ సాధారణ హిందువులు, జైనులకు ఇది తపస్సు, శుద్ధి దీర్ఘ సంప్రదాయాలతో ప్రతిధ్వనించింది.
ఆర్థిక పురోగతి భాషలో ప్రధానంగా మాట్లాడే ఇతర జాతీయవాద నాయకుల మాదిరిగా కాకుండా, గాంధీ ఉద్దేశపూర్వకమైన విస్తృతమైన సెమియోటిక్ రిజిస్టర్, నిశ్శబ్దం, ఉపవాసం, నూలు వడకడం, ప్రార్థన సరళతను ఎక్కువగా ఉపయోగించాడు. ఇవి సాధారణ ఆచారాలు కానీ.. భాషా, సాంస్కృతిక విభజనలలో కనిపించే రాజకీయ చిహ్నాలు. దీనిని సాధారణ భారతానికి అనుసంధానించారు.
డిగ్లోసియా జాతీయవాదం..
గాంధీ డిగ్లోసియా జాతీయవాదంగా వర్ణించబడే దానిని పెంపొందించాడు.ఈ కార్యక్రమం వలన జాతీయవాద ఉద్యమం రెండు విభిన్న రిజిస్టర్లలో పనిచేసే సామర్థ్యాన్ని సంపాదించింది.
వలస రాజ్యంలో ఇంగ్లీష్ అనేది ఉన్నత విద్యావంతులైన వారి భాషగా ప్రాధాన్యం దక్కించుకుంది. స్థానిక భాషలు గ్రామీణుల భాష. ఈ ద్విభాషావాదం వివిధ ప్రావిన్సుల నుండి వచ్చిన ఉన్నత వర్గాలకు భారతదేశం అంతటా సంకీర్ణాలను ఏర్పరచడానికి వీలు కల్పించింది, అదే సమయంలో జాతీయవాద చర్చ కనీస అనువాదంతో సాధారణ ప్రజలలో ప్రసారం చేయడానికి వీలు కల్పించింది. అప్పటికి గ్రామీణ భారతంలో నిరక్ష్యరాస్యత చాలా ఎక్కువ.
గాంధీ ఈ భాషా ప్రపంచాలను వారధి చేయడానికి ప్రతీకవాద శక్తి వైపు మొగ్గు చూపాడు. రాట్నం, చేతినిండా ఉప్పు ఎప్పుడూ మంచి నినాదాలుగా ఉండలేవు. అవి సాంస్కృతిక అర్థంతో సంతృప్తమైన భౌతిక సుపరిచితమైన వస్తువులు.
ఉన్నత వర్గాలకు, అటువంటి వస్తువులు సంక్లిష్టమైన రాజకీయ విమర్శను సరళమైన, పునరావృతమయ్యే ప్రతిఘటన చిహ్నాలుగా ఆవిర్భవించాయి. గ్రామస్తులను,సామాన్యుడిని వీటితో పవిత్రం చేశారు.
రోజువారీ జీవితాన్ని జాతీయవాద పోరాట ప్రదేశంగా మార్చారు. ఈ సంకేత సంగ్రహణ ద్వారా, రెండు భాషలలో వ్యక్తీకరించబడిన ఉద్యమం ఒకే నైతిక రాజకీయ ప్రాజెక్టుగా ప్రతిఘటించేలా గాంధీ ప్రణాళిక వేశారు.
రెండు ప్రపంచాలు కలిపి..
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ ప్రత్యేకమైనవాడు ఎందుకంటే ఆయన కేవలం రాజకీయ నాయకుడు లేదా వ్యూహకర్త, సాధువు మాత్రమే కాదు. ఆయన ఆధునిక వ్యూహకర్త, సాంప్రదాయ విమోచకుడు.
ఒక విస్తృత జాతీయవాద ఉద్యమంలో ఉన్నత వర్గాలను, సాధారణ ప్రజలను ఏకం చేశాడు. రాజకీయ కమ్యూనికేషన్ రెండు రిజిస్టర్లలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా, ఆయన భారతీయులను మార్చారు.
వారికి తమ లక్ష్యాలను నిర్దేశించారు. జాతీయవాదం విచ్ఛిన్నమైన, పరిమితమైన ప్రతిఘటన నుంచి అపూర్వమైన సామాజిక లోతు, ప్రాదేశిక పరిధి కలిగిన ఉద్యమంగా తీర్చిదిద్దాడు.

(ఫెడరల్ అన్ని వైపులా అభిప్రాయాలను గౌరవిస్తుంది. ఈ వ్యాసంలోని సమాచారం, భావ వ్యక్తీకరణ పూర్తిగా వ్యాసకర్తదే. మేము కేవలం ప్రచురణ వేదిక మాత్రమే)

Tags:    

Similar News

అంతరాలు