విలక్షణ తీర్పరి ఓటరు నేర్పరి

ప్రలోభాలకు లొంగినట్టు కనిపించినప్పటికీ తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ఓటరు గైకొనే నిర్ణయంలో బహు నేర్పరి ఓటరు.

Update: 2025-11-26 09:17 GMT

 రాజ్యాంగంలో ఓటు హక్కు గురించి ఒక నిర్దిష్టమైన అధికరణ లేకపోయినా ప్రాథమిక హక్కు ద్వారా ప్రతి పౌరునికి ఓటు హక్కును వినియోగించుకునే అధికారం సంక్రమించినది .

గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఓటరు తీర్పులో పరిణతి విలక్షణత కనిపిస్తుంది. ఇంత ఎందుకు మొన్నటికి మొన్న వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల సరళిని చూస్తే ఓటరు లో లోతైన దార్శనికత అగుపిస్తున్నది . ఈ వ్యాసగర్త ఇటీవల జరిగిన ఒక ఎన్నికలలో ఒక ఓటర్ ని అడిగిన ప్రశ్నలకు చెప్పిన జవాబులు పరిశీలిస్తే ఈ విషయం మరింత రూడీ అవుతున్నది. ఎవరికి వేస్తావు నీ ఓటు? అంటే "ఇదివరకే రెండు పార్టీలు వచ్చి డబ్బులు ఇచ్చారు.కానీ మూడో పార్టీ పంచే డబ్బుల కోసం ఎదురుచూస్తున్నాను"అన్నాడు. తీరా ఓటరు

మనసులో ఏముందో అంతూ దరి దొరకలేదు. రాజకీయ పార్టీల నాయకులు చూపే ఆశలకు పెట్టె ప్రలోభాలకు లొంగినట్టు కనిపించినప్పటికీ తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ఓటరు గైకొనే నిర్ణయంలో బహు నేర్పరి తనం దక్షత కనిపిస్తుంది. భారతీయ ఓటరు రానున్న అనతి కాలంలో ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యాన్ని గొప్ప మలుపు తిప్పే దిశలో ఆశాజనకంగా కనిపిస్తున్నది.

ఈ సందర్భంగా 1952 నుండి 2024 వరకు జరిగిన 16వ లోకసభ ఎన్నికల ఫలితంగా ఏర్పడిన ప్రాంతీయ రాజకీయ పార్టీల రంగప్రవేశం ప్రభావాల కారణంగా కేంద్రంలో ఏర్పడిన మిశ్రమ ప్రభుత్వాల గురించి విశ్లేషించుకోవలసిన సమయం ఆసన్నమైనది. 1952 నుండి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నది.అయితే 25 ఏళ్లకే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేక జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో ఉద్యమం కారణంగా 1977లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనది . అనంతరం మొట్టమొదటిసారిగా వివిధ రాజకీయ పార్టీలతో కూడిన కాంగ్రెసేతర మిశ్రమ ప్రభుత్వం జనతా పార్టీ మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా రెండు సంవత్సరాల128 రోజులకే చీలిక వచ్చి, చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు ఆయన సైతం 170 రోజులకే పదవి వీడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినది . జనతా పార్టీ ప్రయోగం విఫలమైన అనంతరం ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ పంజాబ్ ఉగ్రవాదుల చేతిలో మరణించింది.

ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కీలుబొమ్మ ప్రభుత్వాల ఏర్పాటుకు వ్యతిరేకంగా విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరున తెలుగుదేశం ప్రాంతీయ పార్టీని 1983లో స్థాపించి కొద్దికాలంలోనే అధికారంలోకి వచ్చాడు. అప్పటికే తమిళనాడులో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నది. కేరళ బెంగాల్ త్రిపురలలో వామపక్ష వాదుల ప్రభుత్వాల పాలన అప్రతిహతంగా నడుస్తున్నది .

అనంతరం 1984లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ సానుభూతి పవనాలు వీచి రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి లోకసభలో మెజార్టీ రాకపోవడంతో నేషనల్ ఫ్రంట్ పేరున విపి సింగ్ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని కొనసాగించాడు. కానీ మందిర్ మరియు మండల్ ఉద్యమం దేశంలో అశాంతిని రేకెత్తించింది. తత్ఫలితంగా వి.పి. సింగ్ 143 రోజులు,అనంతరం చంద్రశేఖర్ 223 రోజుల పిదప అనేక లుకలుకలు బెకబెకల మధ్య ప్రధానమంత్రిగా తప్పుకోవలసి వచ్చింది .

దక్షిణాది రాష్ట్రాలకు తోడు ఉత్తరాదిలోని ఝార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాయి. నాటినుండి నేటి వరకు ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం లేకుండా ఏ ఒక్క జాతీయ పార్టీ ప్రభుత్వాల మనుగడ కొనసాగించలేకపోతున్నాయి. దీనికి కారణాలు భాషా సంస్కృతులు ఆయా రాష్ట్రాల మధ్య కేంద్రం చూపించే వివక్ష అసమానతలు ఉన్నాయి .

1991 లో 10వ లోకసభ ఎన్నికలలో పీ.వి. నరసింహారావు ప్రధాన మంత్రి పదవి చేపట్టాడు ఈ కాలంలో ఆర్థిక సంస్కరణలు పేరున సరళీకరణ యుగం ఆరంభమైనది. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కుల, ప్రాంతీయ రాజకీయాలు అధికారంలోకి వచ్చాయి. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడి అవినీతి ఆర్థిక కుంభకోణాలు తలెత్తడంతో మిశ్రమ ప్రభుత్వం రెండు సంవత్సరాలకే జనతాదల్ అధికారం నుంచి దిగిపోయింది . 1998లో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజిపేయి ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పడింది. అనతి కాలంలోనే 1999లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన్మోహన్ సింగ్ పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశాడు. 2009లో 15వ లోకసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ప్రభుత్వం ఏర్పడినది. కానీ ఈ ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో సరళీకరణ సంస్కరణల అమలులో మందకొడితనం పెద్ద ఎత్తున ఆర్థిక కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొన్నది.

2014లో జరిగిన సామాత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సాధించి మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు కొనసాగుతుంది. తెలుగుదేశం బీహార్ ప్రాంతీయ పార్టీల మద్దతుతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మళ్లీ తిరిగి చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకంగా పని చేసే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కొరకు తెదేపా మద్దతు తో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెద్ద మొత్తంలో నిధులను, వివిధ ప్రాజెక్టులను సాధించుకుంటున్నాడు.

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల అధికారాన్ని అనుభవించిన బిఆర్ఎస్ పార్టీని గద్దె దించి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చాతుర్యం వలన అధికారంలోకి వచ్చింది. తన హామీలను పరిమిత ఆర్థిక వనరుల దృష్ట్యా 2023 ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాడు. అటు దేశం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఉచితాలు వలన రుణ భారం పెరిగిపోతున్నది . ఇటు రాష్ట్రాలు ప్రణాళిక బద్దంగా వ్యవహరించలేక ప్రజలు కోరని ఉచిత పథకాల అమలు కారణంగా అప్పుల్లో కూరుకు పోతున్నాయి.

"రాజ్యాంగం అమలుపరచడంలో అధికార రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి ఉండాలి లేకుంటే, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులు తిరిగి ప్రశ్నార్ధకమవుతాయి". అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం అమల్లో అమలు చేయడంలో అంబేద్కర్ చెప్పిన పై విషయాన్ని నేడు ప్రస్తావించడం అవసరం.

Tags:    

Similar News