కరూర్ తొక్కిసలాటకు ఏడు కారణాలు.. నాయకులు వింటున్నారా?

అభిమానుల అత్యుత్సాహం, స్తబ్ధుగా పరిపాలన వ్యవస్థ

Update: 2025-09-30 07:04 GMT
కోలీవుడ్ నటుడు విజయ్

కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత చేస్తున్న ఎన్నికల ర్యాలీ కరూర్ లో తీవ్ర విషాదం నింపింది. జనసమూహ నియంత్రణ, ప్రణాళికలో ఘోరమైన లోపాలను ఇది బయటపెట్టింది.

రాజకీయ పార్టీలు, పోలీసులకు తక్షణ ప్రశ్నలు సంధించింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్ షోలు అనేవి రాజకీయ వర్గాలు జనసమీకరణ కోసం ఉపయోగించి, కాలపరీక్షకు గురైన సాధనం.

తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళులు సినిమా తారలను ఆరాధిస్తారు. వారిపై విశ్వాసం ప్రదర్శిస్తారు.
చెన్నై నుంచి 384 కిలోమీటర్ల దూరంలో వస్త్ర పరిశ్రమ కేంద్రమైన కరూర్ లో తమ అభిమాన నటుడిని చూడటానికి వెళ్లిన సందర్భంలో ఇలాంటి విధ్వంసం జరుగుతుందని తమిళులు కలలో కూడా భావించి ఉండరు.
మొన్న సూపర్ స్టార్ విజయ్ ప్రసంగిస్తున్న ఒక మోడిఫైడ్ కారవాన్ చుట్టూ తొక్కిసలాట జరగడంతో నలభై ఒక్క మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బాధిత కుటుంబాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి.
అన్నింటికంటే ఘోరమైనది..
గతంలో రాష్ట్రంలో తొక్కిసలాటలు జరిగాయి. కానీ అదే అత్యంత దారుణమైనది. అభిమాన వేడుక అకస్మాత్తుగా విషాదకరంగా మారింది. యువకుల జీవితాలను, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, శిశువును కూడా తుడిచిపెట్టడంతో అది ప్రజల హృదయాల్లో, మనస్సులో తీరని వేదన, లోతైన మచ్చను మిగిల్చింది.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. సంతాపం, ఖండనలు వెల్లువెత్తాయి. కరూర్ దాని చుట్టూ పక్కల ప్రాంతాలలో అంబులెన్స్ లు, ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.
తమిళనాడులో ప్రయివేట్, ప్రజా ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా బాగున్నందున పారా మెడిక్స్, ప్రథమ చికిత్స అందించే సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. దురదృష్టవశాత్తూ అత్యవసర సంరక్షణ అధికారులు అన్ని చర్యలు తీసుకునే లోపు చాలామంది తుది శ్వాస విడిచారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారం ప్రకటించింది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వం. తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్ పరిహారం రెట్టింపు చేసి మృతులకు రూ.20 లక్షలు గాయపడిన వారికి రూ. 2 లక్షలు ప్రకటించారు.
కేంద్రం కూడా జోక్యం చేసుకుని బాధితులకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించుకుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఏకసభ్య జ్యూడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి అనేది ప్రశ్నగా ఉంది.
విజయ్ ఈవెంట్లలో స్పష్టమైన లోపాలు..
ఈ విషాదానికి ఒక్క కారణం అంటూ చెప్పలేము. వరుస తప్పులు ఈ విపత్తుకు దారి తీశాయి. గత సంవత్సరం రాజకీయ పార్టీ టీవీకే ఏర్పాటును ప్రకటించిన తరువాత విజయ్ చేస్తున్న ఐదో పర్యటన ఇది.
ఇందులో మొదటి రెండు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద మైదానాల్లో నిర్వహించే వార్షిక కార్యక్రమాలు. వచ్చే ఆరు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రతి శనివారం ఆయన రోడ్ షోలు చేయడానికి ప్రణాళిక రూపొందించారు.
ఇంతకుముందు టీవీకే నిర్వహించిన ఐదు కార్యక్రమాలు తీవ్ర గందరగోళంలోనే ముగిశాయి. వీటికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. నీరు, ఆహారం అందక అంతా ఇబ్బంది పడ్డారు.
మహిళలు, పిల్లలతో సహా అభిమానులు మండుతున్న ఎండలో చాలాగంటలు వేచి ఉన్నారు. చాలామంది డీ హైడ్రేషన్ తో బాధపడ్డారు. కొందరు తాగి కూడా వచ్చారు. క్రమశిక్షణ లేని అభిమానులు విద్యుత్ స్తంభాలు, చెట్లు, ట్రాన్స్ ఫార్మర్ లతో సహ అనేక ఎత్తైన పాయింట్లు ఎక్కి తమ అభిమాన నటుడిని చూడటానికి ప్రయత్నించారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడటానికి నానా అవస్థలు పడ్డారు.
హైకోర్టు ర్యాప్ ను..
మొదటి రెండు సమావేశాలు ఆందోళన రేకెత్తించింది. ఈ సమస్య మద్రాస్ హైకోర్టుకు చేరింది. టీవీకే ర్యాలీలలో భద్రతా లోపాలను ప్రిసైడింగ్ జడ్జి ఎత్తి చూపుతూ ఒక ప్రశ్నను లేవనెత్తారు. ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరూ బాధ్యత వహిస్తారు?
అధికారంలో ఉన్న డీఎంకేకు పరిపాలన విభాగం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, టీవీకేను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నాయకుల వాదన. అయితే విజయ్ అభిమానులు ఎవరి మాట వినడం లేదని, ఇది పరిపాలనపై ఒత్తిడి పెంచుతోందని అధికారులు ఆరోపించారు.
ఇరుపక్షాల వాదనలో కొంత వాస్తవం ఉంది. అయితే న్యాయమూర్తి దూరదృష్టితో చేసిన వ్యాఖ్యలను వారు వినిపించుకుని ఉంటే ఈ విషాదం ఉండేది కాదు. రెండు పక్షాలు సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశాయి.
రాజకీయ శత్రుత్వం ఇందులో ప్రధాన కారణం అయితే.. ఇందులో ఒకరు అధికారాన్ని నిలుపుకోవడం మరొకటి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు పార్టీలకు ప్రజలకు సేవచేయాలనే తొట్టతొలి ప్రజా హమీని విస్మరించి తమ దూరదృష్టి లేని విధానాన్ని బయటపెట్టాయి.
తొక్కిసలాటకు ఏడు కారణాలు ఉన్నాయి..
కరూర్ విషాదానికి ఏడు కారణాలు కనిపిస్తున్నాయి. వాటికి డీఎంకేతో పాటు, విజయ్ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంది.
మొదటిది: విజయ్ మొదటి ర్యాలీ ఉదయం 8.45 గంటలకు కరూర్ నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాణా కేంద్రమైన నామక్కల్ నుంచి ప్రారంభం కావాలి. అక్కడికి జనం ఉదయం 3 గంటల నుంచే రావడం ప్రారంభించారు.
కానీ విజయ్ చెన్నై నుంచే ఉదయం 9 గంటలకు తన ప్రత్యేక విమానం లో బయలు దేరాడు. నేరుగా తిరుచ్చికి చేరుకుని అక్కడి నుంచి నామక్కల్ చేరుకున్నాడు. ఇందుకు గంటన్నర సమయం తీసుకుంది. ఫలితంగా మొదటి సమావేశం మధ్యాహ్నం 2.30కు ప్రారంభం అయింది. ఇంత ఆలస్యం ఎందుకు?
రెండు: విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు కరూర్ లో జరిగే సమావేశంలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఇది ఏకంగా 7.30 గంటలకు ప్రారంభం అయింది. రాత్రి ఏడు గంటలకు నగర శివార్లకు చేరుకున్నాడు.
పోలీసులు అతని కారవాన్ 40 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డులోకి కష్టంగా ప్రవేశపెట్టాడు. తొక్కిసలాట జరిగిన వేలుసామిపురం రోడ్డుపై జనం పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. హైవే పై ఉన్న అభిమానులు, సమీపంలో ప్యాక్టరీ అభిమానులు కూడా జత అయ్యారు. తన కోసం భారీగా అభిమానులు వచ్చినప్పటికి విజయ్ మాత్రం సమావేశం రద్దు చేయాలని అనుకోలేదు?
మూడు: టీవీకే ఈ సమావేశానికి పదివేల మంది వస్తారని అంచనా వేసింది. కానీ పోలీసుల ప్రకారం ఈ రోడ్ షోకు దాదాపు 27 వేల మంది వచ్చారు. విజయ్ తన ప్రసంగం ప్రారంభించగానే కొద్ది మంది అభిమానులు వాన్టేజ్ పాయింట్లపైకి ఎక్కారు.
అయితే సమీపంలో అభిమానులు ఎక్కిన చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ తీగలపై పడి, సరఫరా నిలిచిపోయింది. సౌండ్ సిస్టమ్ విఫలమైంది. జనసమూహం స్టార్ ను చూడటానికి, ఆయన మాటలు వినడానికి మరింత ముందుకు వచ్చింది. అభిమానులు ఈవెంట్ ను లైవ్ గా ప్రసారం చేయడానికి ప్రయత్నించారు.
నెట్ కూడా అక్కడ విఫలమైంది. ఇన్ని జరుగుతున్నా, విజయ్, పోలీసులు జనసమూహాన్ని అంచనా వేయడంలో ఎందుకు విఫలమయ్యారు? దాదాపు అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. రియల్ టైమ్ జనాభా గణను ఎందుకు లెక్కించలేకపోయారు?
నాలుగు: ప్రజలు భారీగా రావడంతో జనసమూహంలో ఉన్న మహిళలు, పిల్లలు, పురుషులు కూడా ఊపిరి అందక మూర్చపోవడం ప్రారంభించారు. జనసమూహంలో తొమ్మిదేళ్ల బాలిక తప్పిపోయినట్లు ప్రకటన చేసి, ప్రసంగం నిలిపివేసి లిప్ట్ దిగి కిందకి దిగిపోయాడు. అప్పటికే ఏదో తప్పు జరిగిందని అందరికి తెలుసు. టీవీకే ఆఫీస్ బేరర్లు మాత్రం పరిస్థితిని నియంత్రించడానికి ఎందుకు ప్రయత్నించలేదు?
ఐదు: సహాయం కోసం బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నప్పుడూ మిగిలిన వారు తోసుకోవడం ప్రారంభించారు. నిజానికి విజయ్ మాట్లాడటం ప్రారంభించే సమయానికి అంబులెన్స్ లు లోపలికి రావడం ప్రారంభించాయి.
వారు వచ్చేసరికి వాహానాల రాకకోసం రోడ్డును క్లియర్ చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. ఇది మరో గందరగోళానికి కారణమైంది. ఎక్కువ మంది స్పృహ కోల్పోవడానికి ఇదే కారణం. విజయ్ కార్ వాన్ కారణంగా రోడ్డు ఒకవైపు బ్లాక్ చేశారు. అంబులెన్స్ వల్ల చాలామంది ఇరుక్కపోయారు. అసలు అంబులెన్స్ లు ఎవరు ఇటూ వైపు రప్పించారు?
ఆరు: అంతకుముందు జనసమూహంలో నుంచి ఎవరో విజయ్ పై చెప్పులు విసిరారు. అతన బాడీగార్డ్ లు వీటిని అడ్డుకున్నారు. ఇది స్టార్ ను అపఖ్యాతి చేయాడానికి ఉద్దేశించిన కుట్ర అని టీవీకే వర్గాలు ఆరోపిస్తున్నాయి.
దుండగులు ఎవరూ? స్థానిక పరిపాలన, పోలీసులు వారిని స్ఫష్టంగా గుర్తించి ఉండేవారు. అలాంటి ఘటనలు నిరోధించకుండా ఏదైనా నివారణ అరెస్ట్ లు లేదా చర్యలు తీసుకున్నారా?
ఏడు: పోలీసుల సూచనలను పాటించామని టీవీకే చెబుతోంది. కొత్తగా ఏర్పడిన పార్టీ తన కార్యకర్తలను క్రమశిక్షణలో పెట్టలేకపోయిందని పరిపాలన విభాగం చెబుతోంది.
గతవారం ఇక్కడే అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళని స్వామి ప్రసంగించినప్పుడూ సాధారణంగా ఉందని డీఎంకే వర్గాలు వాదిస్తున్నాయి. విజయ్ అభిమానులు మాత్రం దురుసుగా, విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఇక్కడ జనాలు భిన్నంగా ప్రవర్తించారు. ఇది అధికారులు, టీవీకే ఎందుకూ ఊహించలేదు?
రాజకీయ రచ్చ రచ్చ..
కుట్రకు బలయ్యామని టీవీకే కోర్టును ఆశ్రయించింది. డీఎంకే ప్రభుత్వం తగిన భద్రత కల్పించడంలో విఫలమైందని బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వం తన వాదనను సమర్థించుకుంటూ ఎక్కువ మంది పోలీసులను మోహరించిందని, విద్యుత్ నిలిపివేయలేదని, టీవీకే తన మీటింగ్ సమావేశం ఆ స్థలం ఎంచుకున్నారని వాదిస్తోంది. విజయ్ రాక ఆలస్యంగా రావడం వల్ల జనసమూహం పెరిగిపోయిందని చెబుతోంది.
స్లగ్ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు సాధారణ జీవితానికి అంతరాయం కలిగించే రోడ్ షోలను కొనసాగించే ఆచారాన్ని రాజకీయ వర్గాలు తీవ్రంగా పరిశీలించాలి. ర్యాలీలు నిర్ధిష్ట ప్రదేశాలలో బహుశా నగరం వెలుపల నిర్వహించాలి.
ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత ఎన్నికల కమిషన్ మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ పున: సమీక్షించుకోవాలి. కఠినమైన మార్గదర్శకాలను రూపొందించాలి. సాధారణ పౌరులకు ఆటంకం కలిగించే ప్రచార పద్దతులను నిరోధించాలి.
ర్యాలీల కోసం హైవేలు, అంతర్గత రోడ్లను బ్లాక్ చేసినప్పుడూ అత్యవసర సేవలు దెబ్బతింటాయి. ప్రతి సేవ నిలిచిపోవడంతో ప్రజలు విమానాలు, రైళ్లు, బస్సు సేవలను కోల్పోతారు. ప్రజాస్వామ్యం గందరగోళం, అస్తవ్యస్తంగా ఉండవచ్చు. కానీ దానికి ఏ మూల్యం చెల్లించాలి?
Tags:    

Similar News

అంతరాలు