ఇజ్రాయెల్ లో నలభై ఎనిమిది గంటల ఎమర్జెన్సీ.. ఎందుకు ?

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్ మద్ధతుగల తీవ్రవాద సంస్థ హిజ్బూల్లా, ఇజ్రాయెల్ పైకి వందల కొలది రాకెట్లు, క్షిపణులు ప్రయోగించింది.

Update: 2024-08-25 06:04 GMT

పశ్చిమాసియాలో మరో యుద్దానికి రంగం సిద్ధమైంది. ఇరాన్ మద్ధతుగల లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఆదివారం ఇజ్రాయెల్ పై ఏకంగా 320 కత్యూషా రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి యుద్దానికి కాలుదువ్వింది. ఐడీఎఫ్ కి చెందిన మొత్తం 11 ప్రాంతాలపై రాత్రి నిరంతరాయంగా క్షిపణుల వర్షం కురిసిందని టెల్ అవీవ్ సైతం ప్రకటించింది.

ఈ దాడులతో ఇజ్రాయెల్ వ్యాపంగా 48 గంటల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానాలను దారి మళ్లించారు. అయితే దాడులపై తమకు ఇంతకుముందే సమాచారం ఉందని ఇజ్రాయెల్ పేర్కొంది. హిజ్బూల్లా దక్షిణ లెబనాన్ లోని ప్రాంతం నుంచి దాడులకు పాల్పడే అవకాశం ఉందనే ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చిందని వివరించింది.

తమ సంస్థకు చెందిన కమాండర్ ఫాద్ షుకూర్ ను చంపినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైనిక బ్యారక్ లు, ఐరన్ డోమ్ లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు ఉగ్రవాద సంస్థ హిజ్బూల్లా ప్రకటించింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ ఇజ్రాయెల్ భూభాగం వైపు క్షిపణులు, రాకెట్లను ప్రయోగించడానికి హిజ్బుల్లా ప్లాన్ చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించడం ద్వారా యూదులపైకి ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అయితే దీనిపై కచ్చితంగా తగిన సమాధానమిస్తామని హెచ్చరించారు.
“ఇజ్రాయెల్ భూభాగం వైపు క్షిపణులు, రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతున్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థను IDF గుర్తించింది. ఈ బెదిరింపులకు ప్రతిస్పందనగా, IDF ఇజ్రాయెల్ పౌరులను రక్షించడానికి హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాద లక్ష్యాలపై దాడి చేస్తాం ” IDF తెలిపింది.
ఇజ్రాయెల్‌లో 48 గంటల ఎమర్జెన్సీ
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఉదయం 6 గంటల నుంచి 48 గంటల దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రక్షణ దళాలు పౌరులకు వారి భద్రతపై ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
"ప్రత్యేక పరిస్థితి ప్రకటన వర్తించని దేశంలోని ప్రాంతాలలో పౌర జనాభాపై దాడికి ఎక్కువ అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను" అని గాలంట్ మీడియాతో అన్నారు. గ్యాలెంట్ పరిస్థితి గురించి US రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు కూడా తెలియజేసినట్లు సమాచారం.
విమానాల దారి మళ్లింపు..
ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న విమనాలను అత్యవసరంగా దారి మళ్లించారు. మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తున్నారు. "భద్రతా పరిస్థితుల కారణంగా, బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం బయలుదేరే విమానాలు రాకపోకలు వాయిదా వేశాం. రాబోయే కొద్ది గంటల్లో టేకాఫ్, ల్యాండింగ్ ఉండదు’’ అని ఎయిర్ పోర్ట్ అధారిటీ ప్రకటించింది.
ల్యాండ్ విమానాల కోసం ప్రత్యామ్నాయా ఎయిర్ పోర్ట్ లను కేటాయించారు. గాజాలో టెల్ అవీవ్ జరుపుతున్న వైమానిక దాడిలో శనివారం మరో 36 మంది మరణించారు. ఖాన్ యూనిస్ పట్టణంలో హామాస్ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో దాదాపు నాలుగ చోట్లు దాడులకు పాల్పడింది. ఇందులో సాధారణ పౌరులు సైతం మరణించారు. మరో వైపు ఈజిప్టు రాజధాని కైరో లో హమాస్- ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
Tags:    

Similar News