పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ...

డాక్టర్ ప్రకాశ్ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చింది. డాక్టర్ గా ఉంటూ పార్లమెంటు సభ్యురాలైతే ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవ చేయవచ్చని ఆమె నమ్ముతున్నారు.

Update: 2023-12-26 10:07 GMT
డా. సవీరా ప్రకాశ్ (source: Dawn News)

డాక్టర్ సవీరా ప్రకాష్ (Dr Saveera Parkash)  అనే హిందూ మహిళ పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రం బునెర్ నుంచి ఎన్నికల్లో పోటీచేయబోతున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేసేందు ముందుకు వచ్చిన తొలి హిందూ మహిళ ఆమె. ప్రస్తుతం ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. అబోత్తాబాద్ ఇంటర్నేషన్ మెడికల్ కాలేజీ నుంచి ఆమె వైద్య విద్య పూర్తి చేశారు. డిసెంబర్ 23న ఆమె నామినేషన్ వేశారు.దీనిని పిపిపి ఆమోదిస్తే, ఆ రాష్ట్రం నుంచి ఎన్నికల్లో నిలబడిన తొలి హిందూమహిళ అవుతారు. 

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తున్న ప్రకాష్, బునెర్ జిల్లాలోని PK-25 జనరల్ సీటుకు అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారని పాకిస్తాన్ న్యూస్ పేపర్ డాన్ రాసింది.స

సవీరా ప్రకాష్ తండ్రి ఓం ప్రకాష్, వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన పీపిపి సభ్యుడు. మూడు దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తూ వస్తున్నారు. పాకిస్తాన్‌లో హిందువులతో సహా మతపరమైన మైనారిటీల జీవితం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో డా. సవీర్ నామినేషన్ వేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నది.

పాకిస్థాన్ లోక్ సభ కు ఏడాది ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగుతున్నాయి.

జనరల్ నియోజకవర్గాలలో 5 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని ఈమధ్య ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభిస్తూఉంది. ఒక హిందూ మహిళ పాకిస్తాన్ ఎన్నికల్లో నిలబడేందుకు ముందుకురావడంతో వార్తలకెక్కింది.

Tags:    

Similar News