మళ్లీ మోగిన ట్రంప్ ‘డబ్బా’

"ఆరు నెలల్లో ఆరు యుద్ధాలు పరిష్కరించాను>" అందులో భారత్- పాక్ అణుయుద్ధ ప్రస్తావన;

Update: 2025-08-19 07:00 GMT
డొనాల్డ్ ట్రంప్

తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆరు యుద్ధాలను ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అందులో భారత్- పాక్ మధ్య అణు యుద్ధం ఆపినట్లు 40 వ సారి తన వాదనను వినిపించారు.

ఉక్రెయిన్ అధ్యక్షడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ తో సమావేశం సందర్భంగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. భారత్ - పాక్ మధ్య యుద్ధంతో సహ ఆరు యుద్దాలను కేవలం ఆరు నెలల కాలంలోనే ముగించినట్లు చెప్పుకొచ్చారు.

విలేకరులు అడిగిని ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించడం చాలా సులభం అని తాను భావించానని, కానీ అది కాలేదని చెప్పారు.

రష్యా- ఉక్రెయిన్.. కఠిన వైఖరి..
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం చాలా కఠినమైనదని అన్నారు. మేము చాలాకాలంగా దీనిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ‘‘మేము ఇతరుల గురించి దీనితో పై మాట్లాడుతున్నాము’’ పేర్కొన్నారు. ట్రంప్ అంతకుముందు రోజు తన ట్రూత్ సోషల్ లో చేసిన పోస్ట్ లో భారత్- పాకిస్తాన్ లను పరోక్షంగా ప్రస్తావించారు.
‘‘నేను ఆరు నెలల్లో ఆరు యుద్దాలను పరిష్కరించాను. వాటిలో ఒకటి అణు విపత్తు వరకూ వెళ్లింది’’ అని ట్వీట్ చేశారు. మే 10 న వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో సుదీర్ఘ రాత్రి చర్చల తరువాత భారత్- పాక్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు.
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి తాను సాయం చేశానని ఇప్పటికీ 40 సార్లు తన వాదనను బహిరంగంగా పునరావృతం చేశాడు.
ఖండిస్తున్న భారత్..
అయితే ట్రంప్, అమెరికా నాయకులు చేస్తున్న ప్రకటనలు భారత్ ఖండిస్తూ వస్తోంది. రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా తరువాత పాకిస్తాన్ తో సైనిక ఘర్షణ విరమణపై అవగాహాన కుదిరిందని భారత్ చెబుతోంది.
రెండు దేశాల మధ్య మూడో పక్షం జోక్యం చేసుకోలేదని, అందుకు తాము సమ్మతించమని కూడా న్యూఢిల్లీ వాదన. ఆపరేషన్ సిందూర్ ఆపమని ఏ దేశ నాయకుడు భారత్ ను అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ తో కాల్పుల విరమణ తీసుకురావడంలో మూడోపక్షం జోక్యం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగిన తన శిఖరాగ్ర సమావేశం రోజున కూడా ట్రంప్ భారత్- పాక్ మధ్య యుద్ధం విషయాన్ని అనేకసార్లు పునరావృతం చేశారు. తాను యుద్దాన్ని ఆపినట్లు చెప్పుకున్నారు. భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలును సైతం ప్రస్తావించారు.
ఆపరేషన్ సిందూర్..
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకుల్లో హిందువులను ప్రత్యేకంగా గుర్తించి వారి భార్యల ముందే భర్తలను పాకిస్తాన్ కు చెందిన ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద మూకలు కాల్చి చంపాయి.
దీనిపై యావత్ భారతం భగ్గునమండింది. భారత ప్రభుత్వం ఇందుకు ప్రతీకారంగా పాక్, పీఓజేకేలోని 9 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు చేపట్టింది. దీనికి ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేసింది.
పాక్ కూడా మన సైనిక, పౌర నివాసాలే లక్ష్యంగా దాడులు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఒక్క మిస్సైల్, డ్రోన్ కూడా మన భూభాగంలోకి రాలేకపోయింది.
దీనికి తోడు భారత వాయుసేన పాక్ లోని 9 వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఆరు పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేసింది. పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగష్టు 14న పాక్ సైన్యంలోని 150 మంది మరణించినట్లు వారికి ఆ దేశ శౌర్య పథకాలు అందించింది.
ఈ విషయం మీడియాలోకి రాగానే వాటిని తొలగించింది. అలాగే భారత నేవీకి భయపడి పాక్ నేవీ తన వార్ షిప్పులను ఇరాన్ బార్డర్ కు తరలించి, వాటిని వాణిజ్య నౌకల మధ్యలో దాచిపెట్టినట్లు శాటిలైట్ చిత్రాలు భయటకు వచ్చాయి.
Tags:    

Similar News