‘‘ఎవరెన్నీ ఒత్తిళ్లు తెచ్చిన భారత్- రష్యా కలిసే ఉంటాయి’’

రష్య సీనియర్ దౌత్యవేత్త రోమన్ బాబుష్కీన్;

Update: 2025-08-20 13:46 GMT
రష్యా సీనియర్ దౌత్యవేత్త రోమన్ బాబుష్కీన్

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై అమెరికా చేస్తున్న ఒత్తిడి అన్యాయమని సీనియర్ రష్యన్ దౌత్యవేత్త బుధవారం అన్నారు. బాహ్య శక్తుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్- రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందని రష్యన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ చెప్పారు.

భారత ఎగుమతులకు స్వాగతం..
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందున భారత్ పై అమెరికా విధించిన 50 శాతం సుంకాలను ఆయన ప్రస్తావిస్తూ.. ఒక వేళ అమెరికాకు ఎగుమతులకు ఇబ్బంది వస్తే అక్కడికి పోగా మిగిలిన వస్తువులను రష్యా అనుమతిస్తుందని చెప్పారు. భారత్ తో వాణిజ్యాన్ని విస్తరిస్తామని కూడా వెల్లడించారు.
‘‘ఇది భారత్ కు సవాళ్లతో కూడిన సమయం’’ అని రష్యన్ డిప్లమాట్ విలేకరులతో అన్నారు. రష్యాకు భారత సంబంధాలపై విశ్వాసం ఉందని చెప్పారు. ‘‘ భారత వస్తువులకు యూఎస్ మార్కెట్లకు వెళ్లడం ఇబ్బంది ఏర్పడితే, వాటికి రష్య మార్కెట్లు స్వాగతం పలుకుతాయి’’ అని బాబుష్కిన్ విలేకరుల సమావేశంలో వివరించారు. పశ్చిమ దేశాలు మాస్కోపై విధించిన ఆంక్షలు తిరిగి వారికే బూమారాంగ్ అయ్యాయని చెప్పారు.
యూఎస్ నయా వలసవాదం తీరు..
యూఎస్ ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనకూడదని సూచించిన అమెరికన్ అడ్వైజర్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ఏకపక్ష, నయా వలసవాద విధానాలు అన్నారు.
‘‘రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన ఉత్పత్తిదారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు. ఏకపక్షంగా ఎలాంటి చర్యలు తీసుకున్న అది ఆయిల్ సప్లై లో ఆటంకం కలిగిస్తుంది. ధరలలో హెచ్చతగ్గులు వస్తాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్థిరతకు లోనవుతాయి. ప్రపంచ శక్తి మార్కెట్లు ప్రమాదంలో పడిపోతాయి. ఇది అభివృద్ది చెందుతున్న దేశాలకు నష్టదాయకం’’ అన్నారు.
‘‘ఊహత్మకంగా భారత్, రష్యా చమురును నిరాకరిస్తే అది సాధారణంగా పశ్చిమ దేశాలతో సమాన సహకారానికి దారి తీయదు. ఎందుకంటే ఇది పాశ్చాత్య స్వభావంలో లేదు. ఇది ఇటీవల సంవత్సరాలలో స్పష్టంగా నిరూపించబడింది. వారు తమ సొంత ప్రయోజనం గురించి ఆలోచించే కొత్త వలసవాద శక్తుల లాగా ప్రవర్తిస్తారు. ఈ ఒత్తిడి అన్యాయమైనది.. ఏకపక్షమైనది’’ అని ఆయన అన్నారు.
భారత్- రష్యా సంబంధాలు..
భారత్ - రష్యా సంబంధాలను ఆయన ప్రశంసించారు. న్యూఢిల్లీ తన స్వంత ప్రయోజనాలను అనుసరిస్తోందని ఇందుకు పాశ్చాత్య విమర్శలను రుజువుగా చూపించారు.
‘‘పశ్చిమ దేశాలు మిమ్మల్ని విమర్శిస్తే మీర ప్రతిదీ సరిగ్గా చేస్తున్నారని అర్థం. అలా జరుగుతుందని మేము ఆశించము( భారత్ చమురు కొనుగోళ్లు ఆపడం). భారత్ ఎదుర్కొంటున్న సవాల్ తో కూడిన పరిస్థితుల గురించి మాకు తెలుసు. ఇది మేము అనుభవిస్తున్న నిజమైన వ్యూహాత్మక భాగస్వామ్యం. ఏమి జరిగినా, సవాళ్ల సమయంలో కూడా ఏమైన సమస్యలు తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అని బాబుష్కిన్ అన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలలో నమ్మకం, వ్యూహాత్మక లోతుకు నిదర్శనంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణలను ఆయన ఉదహరించారు.
‘‘ఉక్రెయిన్ ఇటీవల పరిణామాల గురించి అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి వివరించడం, సమాచారాన్ని పంచుకోవడం ద్వారా రష్యాకు భారత్ చాలా ముఖ్యమైనదని అర్థం. పరస్పర సంతృప్తి కోసం పరిష్కారాన్ని కనుగొనగల సామర్థ్యం ఉన్నాయి. రెండు దేశాల భాగస్వామ్యం మరింత పెరగడం వల్ల మనం కలిసి ఎదగడానికి సహాయపడుతుంది.’’ అని ఆయన అన్నారు.
బ్రిక్స్..
యూఎస్, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలు వాణిజ్యాన్ని అడ్డగించలేవని బాబుష్కిన్ అన్నారు. ‘‘మేము చాలా సంవత్సరాలుగా ఈ ఆంక్షలను ఎదుర్కొంటున్నాము. కానీ మా వాణిజ్యం మాత్రం పెరుగుతోంది. ఇటీవల సంవత్సరాలలో అది ఫుంజుకుంది. ఏకంగా ఏడు రెట్లు పెరిగింది’’ అని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులకు బ్రిక్స్ ఒక మెడిసిన్ ల పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం తరువాత భారత్- అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇందులో భారత్- రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా అమెరికా 25 శాతం సుంకాలు విధించింది.
Tags:    

Similar News