అమెరికా అభియోగాలను పరిశీలిస్తున్నాం: భారత్

భారత్ నుంచి పంజాబ్ ను వేరు చేసి ఖలిస్తాన్ ప్రత్యేక దేశం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర చేసిందని కోర్టులో అమెరికా అభియోగాలు మోపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

Translated by :  Chepyala Praveen
Update: 2023-11-30 10:33 GMT
అరిందమ్ బాగ్చీ, విదేశాంగ ప్రతినిధి

ఇది నిజంగా చాలా తీవ్రమైన అంశమని, కేంద్రం ప్రభుత్వం ఈ అంశంపై ఒక ఉన్నత స్థాయి ప్యానెల్ నియమించిందని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. అయితే తదుపరి సమాాచారం ఇవ్వడం సాధ్యంకాదని వివరించారు.

భారత ప్రభుత్వం పై , అమెరికా తీవ్రమైన అభియోగాలు మోపింది. దేశంలో ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ, విద్వేషాలు రెచ్చగొడుతున్న నిషేధిత సిఖ్ ఫర్ జస్టిస్ అధినేత గురు పత్వంగ్ సింగ్ పన్నూను చంపడానికి కుట్ర పన్నిందని కోర్టులో కేసు పెట్టింది. దీనికి సంబంధించి తాము నిఖిల్ గుప్త అనే వ్యక్తిని గుర్తించినట్లు ప్రకటించింది. ఇతడు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు నేరారోపణ పత్రంలో ఆరోపించింది.

ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశమని విదేశాంగ ప్రతినిధి బాగ్చీ అన్నారు. దీనిపై భారత్ కూడా విచారణ జరుపుతుందని వెల్లడించారు. భారత ప్రభుత్వ విధానానికి ఇది పూర్తి విరుద్దమని అమెరికాతో చెప్పినట్లు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత నేరాలు, మానవ అక్రమ రవాణా, తీవ్రవాదులు చేసే పనులు, చట్టాలను అమలు చేసే ప్రభుత్వాలు చేయవని చెప్పారు. కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి కమిటినీ నియమించామని పేర్కొన్నారు.

మళ్లీ వంతపాడిన కెనడా

తమ దేశంలో జరిగిన హత్యలకు కూడా భారతే కారణమని మరోసారి కెనడా ఆరోపించింది. ఈ ఏడాది జూన్ లో సిఖ్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ సైతం హత్యకు గురవడం వెనక న్యూఢిల్లీ ఉందని అట్టావా విమర్శించింది. భారత్ వియన్నా ఒప్పందాన్ని గౌరవించాలని కోరారు.

నిఖిల్ గుప్తా భారత్ ప్రభుత్వ అధికారితో కలిసి గురుపత్వంత్ పన్నూను చంపడానికి షార్ప్ షూటర్ ను మాట్లాడుకున్నారని, ఒకరిని హత్య చేయడానికి లక్ష డాలర్లు చెల్లించడానికి గుప్తా అంగీకరించినట్లు అభియోగం పత్రంలో అమెరికా ఆరోపించింది. ఈ పరిణామం భారత్ - అమెరికా సంబంధాలపై ఏమైనా ప్రభావితం చూపుతాయా అనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది. 

Tags:    

Similar News