ఢాకాలో తదుపరి ఎత్తు వేసేది ఎవరూ?

ఆర్మీ చీఫ్, తాత్కాలిక ప్రభుత్వ సారథికి మధ్య ముదిరిన ఆధిపత్య పోరు;

Update: 2025-05-25 11:22 GMT
ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్, తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్

పొరుగుదేశం బంగ్లాలో ఆధిపత్య రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్, సైన్యాధిపతి వకార్- ఉజ్- జమాన్ మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అక్కడి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.

ఈ పోరాటంలో ఎవరూ ముందంజ వేస్తారనే దానిపై రాబోయే రోజుల్లో బంగ్లా రాజకీయాలు బాగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇరువైపుల బలాలు సమానం అయ్యాయి. ఇద్దరు మరో ఎత్తు వేయడానికి సిద్దం అయ్యారు.

యూనస్ ఎదురుదాడి
మే 21 న సైన్యాధికారి తాత్కాలిక ప్రభుత్వానికి రెడ్ లైన్ గీశారు. ఇది అక్కడ కుదుపులకి కారణమైంది. ఈ హెచ్చరికను ఎదుర్కోవడానికి యూనస్ ఎదురుదాడికి దిగాడు. తన పాలన, ప్రకటించిన ప్రణాళికలను దెబ్బతీసే ఏ ప్రయత్నమైన ప్రజా మద్దతుతో ఎదుర్కొంటామని ప్రకటించి సైన్యాధికారికే హెచ్చరిక జారీచేశారు.
‘‘అసమంజసమైన డిమాండ్లు, ఉద్దేశపూర్వక రెచ్చగొట్టే అధికారిక పరిధిని అతిక్రమించే ప్రకటనలు, అంతరాయం కలిగించే కార్యక్రమాలు.. సాధారణ పనితీరు వాతావరణానికి ఆటంకం కలిగిస్తూ, ప్రజలలో గందరగోళం, అనుమానాన్ని సృష్టిస్తున్నాయని కౌన్సిల్ అభిప్రాయపడింది’’ అని శనివారం సాయంత్రం షెడ్యూల్ చేయని సమావేశం తరువాత విడుదల చేసిన ప్రకటనలో సలహమండలి తెలిపింది.
‘‘అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ తాత్కాలిక ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని తన బాధ్యతలను నెరవేరుస్తూనే ఉంది. అయితే ఓడిపోయిన శక్తుల ప్రొద్బలంతో లేదా విదేశీ కుట్రలో భాగంగా ఈ బాధ్యతల నిర్వహణ అసాధ్యం అయితే, ప్రజలకు అన్ని కారణాలను తెలియజేస్తుంది. ప్రజలతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటుంది’’ అని ప్రకటన తెలిపింది. అంటే పరోక్షంగా సైన్యాధికారికి హెచ్చరిక జారీలాంటిదే ఈ ప్రకటన.
యూనస్ స్పష్టం చేసిన ఉద్దేశం..
యూనస్ అధ్యక్షత వహించిన ఈ సమావేశం రెండు గంటల పాటు జరిగింది. తాత్కాలిక ప్రభుత్వం మూడు ప్రధాన బాధ్యతలను వెల్లడించింది. అవి ఎన్నికలు, సంస్కరణలు, విచారణలు.
మా ఉద్దేశం స్పష్టంగా ఉంది. ఈ ప్రభుత్వం మూడు విధులను నెరవేర్చడానికి అవసరమైనంత కాలం అధికారంలో ఉండటానికి ప్రయత్నిస్తుంది. ‘‘మా ప్రణాళిక పూర్తి అయ్యే వరకూ మేము ఎక్కడికి వెళ్లము’’ అని ప్రణాళిక సలహదారు వహిదుద్దీన్ మహమూద్ సమావేశం నుంచి బయటకు వచ్చి చెప్పినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
దీనితో యూనస్ రాజీనామా చేసే అవకాశాలు లేవని తెలిసింది. ఎన్నికల కూడా త్వరలో నిర్వహించే అవకాశం కూడా లేదని సంకేతాలు ఇచ్చారు.
ఆర్మీ చీఫ్ వైఖరి ఎలా ఉంది..
మే 21న తన టాప్ కమాండింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో జమాన్, హస్టింగ్ లకు ఆయన డిసెంబర్ వరకూ డెడ్ లైన్ విధించారు. దేశంలో డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగాలని, ఎన్నికైన ప్రభుత్వం మాత్రమే దేశం గమనాన్ని నిర్ణయించాలని, ఎన్నిక కానీ పరిపాలన కాదని ఆయన గట్టిగా పేర్కొన్నారు. ఆయన సందేశం కూడా సుస్పష్టం.
ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఏకైక ఆదేశం ఎన్నికలు నిర్వహించడం, సంస్కరణలు, విచారణలను ఎన్నికల ద్వారా అధికారం చేపట్టే ప్రభుత్వానికి వదిలివేయాలి. ఎన్నికల సమయం ఆర్మీ చీఫ్, యూనస్ నేతృత్వంలోని ఆపధర్మ పరిపాలన మధ్య ప్రధాన వివాదానికి దారితీసింది.
ఆర్మీ జనరల్ కాలపరిమితితో కూడిన ఎన్నికల కోసం మంచి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనే చేశారు. సంస్కరణలు, విచారణ ప్రక్రియ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో యూనస్ ప్రభుత్వం ఎటువంటి కాలపరిమితిని ఇవ్వలేదు. చట్టపరమైన విచారణ సుదీర్ఘమైన ప్రక్రియ దానికి సంవత్సరాల కాలం పట్టవచ్చు.
యూనస్ అనుకూలుర ర్యాలీ..
ప్రభుత్వం తనకు కేటాయించిన మూడు బాధ్యతలను పూర్తి చేయడానికి ఎంత సమయం కేటాయించాలో చెప్పకుండా తప్పించుకుంటున్నప్పటికీ యూనస్ అనుచరులు కనీసం ఐదు సంవత్సరాల పదవీకాలం ఆయనను అధికారంలో ఉంచాలని కోరుకుంటున్నారు.
శనివారం ఢాకాలో ఆయన మద్దతుదారులు నిర్వహించిన ‘‘యూనస్ కోసం మార్చ్’’ ర్యాలీ ఆయనకు ఐదేళ్ల పదవీకాలం అవసరమని పునరుద్ఘాటించింది. ఇది సాధారణ యాధృచ్చిక మార్చ్ కాదు. బల ప్రదర్శనగా ప్రభుత్వం స్వయంగా దీనిని నిర్వహించిందని చాలామంది నమ్ముతారు. యూనస్ కు ఇప్పటి వరకూ బాగానే ఉంది. కానీ యుద్దం ఇంకా గెలవలేదు.
బీఎన్పీ మద్దతు ఇస్తుంది కానీ..
గత ఏడాది ఆగష్టులో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దె దించిన విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు నాయకత్వాలు ఏర్పాటు చేసిన మూడు ప్రధాన పార్టీలు, అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇ ఇస్లామీ నూతన నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) ల మద్దతు యూనస్ కు లభించిందని ముఖ్య సలహదారుడి ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పార్టీలు నిన్న రాత్రి యూనస్ తో అనేక సమావేశాలు నిర్వహించాయి.
ఇక్కడ ఒక చిక్కు ఉంది. బీఎన్పీ మద్దతుకు స్పష్టంగా గడువు తేదీ ఉంది. నిన్న రాత్రి యూనస్ తో జరిగిన సమావేశంలో తదుపరి సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ నాటికి జరగాలని, ప్రభుత్వం వెంటనే దాని కోసం ఒక రోడ్ మ్యాప్ ను ప్రకటించాలని పార్టీ స్పష్టంగా పేర్కొంది.
ఆ విషయంలో బీఎన్పీ, ఆర్మీ చీఫ్ ఒకే వైపు ఉన్నారు. వారు యూనస్ ప్రభుత్వానికి చాలా బలీయమైన ప్రత్యర్థి అవుతారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, మొత్తం పాలనా లోపాల కారణంగా గత నెలల్లో దాని ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింది.
ప్రత్యర్థుల బలీయమైన సందేశం..
బీఎన్పీ, ఆర్మీ చీఫ్ తన డిమాండ్ కు కట్టుబడి ఉంటే ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు నిర్వహించిన తరువాత యూనస్ కు నిష్క్రమించడం తప్ప వేరే మార్గం లేదు. తన బసను పొడిగించడానికి ప్రభుత్వం డిసెంబర్ వరకూ సమయాన్ని ఉపయోగించుకుని జమాన్ ను అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. 
బంగ్లాదేశ్ వర్గాలు జమాన్ ఇటీవల ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం, ఆయనను తొలగించడానికి కొత్త సైన్యాధ్యక్షుడిని నియమించడానికి చేసిన ప్రయత్నానికి ప్రతిస్పందనగా డిసెంబర్ డెడ్ లైన్ వచ్చిందని చెబుతున్నారు. రాబోయే రోజులు జమాన్ కు అలాగే యూనస్ కు కష్టకాలంగా మారనున్నాయి.
Tags:    

Similar News