రెండు దేశాల సంబంధాలు లోతైనవి: ఎస్ జైశంకర్
భారత్- రష్యా చాలా సంబంధాలు చాలా లోతైన, ధృఢవైనమని భారత విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ అన్నారు.
న్యూఢిల్లీ- మాస్కో సంబంధాలు దౌత్యనీతి, ఆర్థిక అంశాలు లేదా రాజకీయాలకో పరిమితం కాలేదని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. గురువారం ఆయన సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఇండాలజిస్టులతో మాట్లాడారు. ‘మా బంధం చాలా ధృడమైంది. చాలా సార్లు కాలపరీక్షను తట్టుకుని నిలబడింది’ అని ఇండాలజిస్టులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అవగాహన, బంధానికి మేధావుల పాత్ర, ప్రొఫెసర్ల సహకారం చాలా ఉందని అన్నారు. కాగా, ఐదు రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి రష్యా వెళ్లారు.
భారత్- రష్యా ఉమ్మడి లక్ష్యాల సాధన కోసం కొత్త బంధాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగుతూనే ఉన్నాం. కానీ తనను తాను మేధావిగా భావించుకునే ఓ ప్రపంచం మా మధ్య ఎప్పుడు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించిందన్నారు. ‘మా బంధాన్ని మాకు మేమే ప్రత్యక్షంగా నిర్మించుకున్నాం.. అర్థం చేసుకున్నాం.. ఇతర సమాజాలు, దేశాలు మా బంధాన్ని నిర్ణయించే అవకాశాన్ని మేము ఇవ్వదలచుకోలేదు’ అని విదేశాంగమంత్రి చెప్పారు.
‘మీరు ఇప్పుడు భారతదేశాన్నిచూడండి. మా ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకు చేరబోతోంది. మరో 25 ఏళ్లలో మేం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగబోతున్నాం. అందుకు అవసరమైన చర్యలు వేగంగా తీసుకుంటున్నాం. అభివృద్ది చెందిన దేశం అంటే ఎదిగిన ఆర్థిక వ్యవస్థే కాదు.. ఆ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు సైతం ఎదిగినట్లే అని’ విదేశాంగమంత్రి అన్నారు.
సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్శిటీలోని ఇండాలజిస్టులను కలవడంపై ఎస్ జై శంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇరు దేశాల బంధం బలపడడంతో మేధావుల పాత్ర ఎంతో ఉంది. మా బంధం మరింత బలపడటానికి మీరు సూచించిన ఆలోచనలు ఉత్తమం’ అన్నారు. అంతకుముందు బుధవారం ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు మాస్కో లో కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పుడు ప్రపంచం మొత్తం రష్యాపై ఆంక్షలు విధించిన, భారత్ మాత్రం స్వతంత్ర్యంగా వ్యవహరించింది. అంతేకాకుండా భారత్ ఇదే అదనుగా రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేసి, దేశంలో పెట్రోల్ ధరలు స్ధిరీకరణకు పూనుకుంది. ఇరు దేశాల మధ్య సంక్షోభాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితబోధ చేసింది. చమురు దిగుమతిపై యూరప్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ భారత్ లక్ష్య పెట్టలేదు. అందుకే రష్యా- భారత్ స్నేహం కాలపరీక్షకు తట్టుకుని నిలబడిందని విదేశాంగ నిఫుణులు చెబుతుంటారు.