బాలిస్టిక్ మిస్సైల్ ను పరీక్షించినట్లు వెల్లడించిన పాక్

భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్ దుందుడుకుడు చర్యలు;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-03 12:09 GMT
వాఘా సరిహద్దు

భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తన సైనిక సన్నద్దతను మెరుగుపరుచుకుంటోంది. తాజాగా మిస్సైల్ టెస్ట్ ను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది.

450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన క్షిపణిని ప్రయోగం విజయవంతంగా చేసినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ఇది భూతలం నుంచి భూతలం మీదకు లక్ష్యాలు గురి పెట్టగలదు.

‘‘సైనిక కార్యాచరణ సంసిద్దతను నిర్ధారించడం, క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ పరీక్షించడం, కీలకమైన సాంకేతిక పారామితులను ధృవీకరించడం ఈ ప్రయోగం లక్ష్యం’’ అని పాక్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరీక్ష ‘‘ ఇండస్ ట్రైనింగ్ ’’ లో భాగమని కానీ ఆ కసరత్తు గురించి వివరాలు ఇవ్వలేమని పేర్కొంది. ఈ ప్రయోగాన్ని ఆర్మీ స్ట్రాటజీ ఫొర్సెస్ కమాండర్, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నుంచి సీనియర్ అధికారులు, అలాగే పాకిస్తాన్ వ్యూహాత్మక సంస్థల శాస్త్రవేత్తలు ఇంజనీర్లు వీక్షించారని పీటీఐ నివేదించింది.
పాకిస్తాన్ దళాలపై నమ్మకం..
అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్ధారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, త్రివిధ దళాలు అధిపతులు ఈ వ్యాయామంలో పాల్గొన్న దళాలు, శాస్త్రవేత్తలు ఇంజనీర్లను ప్రశంసించారు.
పాకిస్తాన్ వ్యూహాత్మక దళాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా జాతీయ భద్రతను కాపాడటానికి, తమ దళాలు ఎప్పుడూ సిద్దంగా ఉంటాయన్నారు. పాక్ దళాలకు కార్యాచరణ సంసిద్దత, సాంకేతిక నైపుణ్యం ఉందని వారు గట్టిగా విశ్వసిస్తున్నామని చెప్పారు.
స్పందించిన భారత్..
భారత్ ఈ చర్యను విమర్శించింది. ఈ పరీక్షను రెచ్చగొట్టే చర్యగా, ప్రమాదకరమైన తీవ్రతరంగా దుందుడు చర్యగా విమర్శించింది. 
పాకిస్తాన్ పై ముప్పేట దాడి..
పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారత్ నిలిపివేసిన సింధు జల ఒప్పందం ప్రకారం తన వాటాలను మళ్లించే ఏ చర్యనైనా యుద్ద చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ గతంలో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా క్షిపణి పరీక్ష నిర్వహించింది.
పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ మాట్లాడుతూ.. భారత్ వచ్చే 36 గంటల్లో సైనిక దాడి చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదులకు తాము స్వయంగా శిక్షణ ఇస్తున్నట్లు రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అంగీకరించారు.
పహల్గామ్ దాడి తరువాత పాక్ ఎల్ఓసీ వద్ద పదే పదే కాల్పులు జరుగుతోంది. ఇప్పటికే ఆ దేశం తన సైన్యాన్ని సరిహద్దులకు తరలించింది. మరో వైపు ఇదే అదనుగా బలూచ్ తిరుగుబాటుదారులు ఆ రాష్ట్రంలోని కలాత్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
Tags:    

Similar News