సునీతా విలియమ్స్, విల్మోర్ లు గాజు పాత్రలు ఉపయోగించకూడదు.. ఎందుకంటే..

ప్రస్తుతం ప్లాస్టిక్ కప్ లనే ఉపయోగిస్తున్న శాస్త్రవేత్తలు;

Update: 2025-03-20 13:51 GMT

అంతరిక్షంలో చిక్కుకుపోయి, ఈ మధ్యనే భూమి మీదకు సురక్షితంగా చేరుకున్న సునీతా విలియమ్స్, విల్మోర్ లు గాజు పాత్రలు వాడకూడదని శాస్త్రవేత్తలు చెబతున్నారు. ప్రస్తుతం వారికి కేవలం ప్లాస్టిక్ కప్ లు అందిస్తున్నారు. 

వారు సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉండటం వలన కండరాలు బలహీనంగా మారాయని గాజు పాత్రలను పట్టుకుంటే అవి సులభంగా చేతుల్లోంచి జారిపోతాయని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ అన్నారు.

వీరు సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉండటంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం వారు కోల్పోయిన కండరాల క్షీణత, ఎముకలు సాంద్రతను తిరిగి పుంజుకోవడానికి నెలల తరబడి పునరావాస షెడ్యూల్ కి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారు. 

కండరాలు తిరిగి కోలుకోవడం..

దీని అర్థం వారు బలహీనంగా ఉన్నారని మాత్రమే. ‘‘ఐఎస్ఎస్ లో వారు వ్యాయాయం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కాకపోతే తేడా ఏమిటంటే.. మీరు బరువు లేకుండా ఎక్కువ సమయం గడిపినప్పుడూ మీరు దిశలను కోల్పోతారు. గ్రావిటేషన్ లేకపోవడం వల్ల మీరు మీ శరీరాన్ని మోయాల్సిన పనిలేకుండా పోతుంది అందుకే మీ సామర్థ్యం దెబ్బతింటుంది’’ అని టైసన్ అభిప్రాయపడ్డారు.
భూమి మీదికి తిరిగి వచ్చిన తరువాత గురుత్వాకర్షణ శక్తిని అనుగుణంగా మీరు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుంది. దానికి కొంత సమయం పడుతుందన్నారు.
ప్లాస్టిక్ కప్పులు
టైసన్ ప్రకారం.. వ్యోమగాములు అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చిన ఒకవారం తరువాత అంతా సర్థుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు బుచ్, విలియమ్స్ కోసం కేవలం ప్లాస్టిక్ కప్పులు మాత్రమే అందజేస్తున్నారు.
మానసిక స్థితి..
వ్యోమగాముల మానసిక స్థితి ప్రభావితమై ఉండవచ్చనే వాదనను టైసన్ తోసిపుచ్చారు. నాసా తన ఆస్ట్రోనాట్స్ ను కేవలం మనస్సు, శరీరం రెండింటి బలం ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తుందని చెప్పారు.
‘‘ఆహారం, నీరు ఉన్నాయి. వారు ప్రొఫెనషల్ వ్యోమగాములు, ఒక విషయం ఏంటంటే వారు కనీసం అదనపు లో దుస్తులు కూడా తీసుకెళ్లలేదు’’ అని పేర్కొన్నారు.
అంతరిక్ష ప్రయాణం..
ఫ్లోరిడా తూర్పు తీరంలో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్ అంతరిక్ష నౌక లో సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు చేరుకున్నారు.
వారు గత ఏడాది జూన్ 5న ఐఎస్ఐఎస్ కు వెళ్లారు. వారిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ క్యాపూల్స్ లో ప్రొపల్షన్ సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుపోయారు. వీరికి సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరకు స్పేస్ ఎక్స్ ప్రయోగించిన అంతరిక్ష నౌక ద్వారా భూమి మీదకు వచ్చారు.


Tags:    

Similar News