భూమి మీదకు తిరిగి రాబోతున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
ప్రత్యేక మిషన్ ప్రారంభించిన స్పేస్ ఎక్స్, తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు;
By : The Federal
Update: 2025-03-15 04:46 GMT
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుని పోయిన నాసా శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ నడుంబిగించింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ అంతరిక్ష కేంద్రానికి కొత్త సిబ్బందిని తీసుకునే వెళ్లే రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కేవలం ఎనిమిది రోజుల ప్రయోగాల షెడ్యూల్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు.
అయితే సుదీర్ఘ కాలంగా అంతరిక్షంలో నివాసం ఉన్న మానవులుగా చరిత్ర సృష్టించారు. ఈ ఇద్దరు వ్యోమగాములు యూఎస్ నేవీ టెస్ట్ పైలట్లతో పాటు, బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్షనౌకను ఐఎస్ఎస్ కు పరీక్షించిన మొదటి మానవులుగా కూడా చరిత్ర పుటల్లో తమ పేరు లిఖించుకున్నారు.
ప్రస్తుతం స్పేక్స్ ప్రయోగించిన కొత్త రాకెట్, కొత్త సిబ్బంది ఐఎస్ఎస్ కు చేరిన రెండు రోజుల తరువాత వారు భూమి మీదకు తిరుగు ప్రయాణం అవుతారు.
నాసా కమర్షియల్ క్రూ ప్రొగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ.. వారి రాక కోసం సంతోషంగా ఎదురుచూస్తున్నామని అన్నారు. దీనిని మిషన్ లో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.
ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రాకెట్ లో నలుగురు కొత్త వ్యోమగాములు ఉన్నారు. నాసాకు చెందిన మెక్ క్లెయిన్, నికోల అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన టకుజా ఒనిషీ, రష్యా కంపెనీ రోస్కోస్మోస్ కు చెందిన కిరిల్ పేస్కోవ్ అన్నారు. వీరంతా ఐఎస్ఎస్ కు ప్రయోగించిన క్రూ-10 లో భాగంగా ఉన్నారు.
అనుకూల ఫలితాలు...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా, విల్మోర్ లను కాపాడటానికి నాసా అనేక ప్రయోగాలు చేసినప్పటికీ అన్ని విఫలమయ్యాయి. అయితే ఇద్దరు వ్యోమగాములు ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటం వలన పరిశోధనలకు దీర్ఘకాలిక అంతరిక్షయానం వలన విలువైన సమాచారం లభించింది.
ప్రస్తుతం సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాలు, మానవ శరీరంపై అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే ప్రస్తుతం అందరి లక్ష్యం వీరిని భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడంపైనే ఉంది.