భారత్‌లో టెస్లా ఉద్యోగ నియామకాలు..

టెస్లా తన LinkedIn పేజీలో 2024 ఫిబ్రవరి 17న 13 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది.;

Update: 2025-02-18 09:15 GMT
Click the Play button to listen to article

టెస్లా భారతదేశంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించింది. టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, భారత ప్రధాని మోదీ మధ్య అమెరికాలో జరిగిన భేటీ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇక భారత్‌లో టెస్లా తన కార్యకలాపాలను త్వరలో ప్రారంభించబోతుంది.

నియామక ప్రకటన విడుదల..

టెస్లా తన LinkedIn పేజీలో 2024 ఫిబ్రవరి 17న 13 ఉద్యోగ అవకాశాలకు ప్రకటన విడుదల చేసింది.కస్టమర్ ఫేసింగ్ (ప్రత్యక్ష వినియోగదారులకు సంబంధిత), బ్యాక్-ఎండ్ విభాగాల్లోని ఖాళీలను నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై, ఢిల్లీలో సర్వీస్ టెక్నీషియన్, అడ్వయిజర్ హోదాల్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా ఉద్యోగాలయిన కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటివి ముంబైలో అందుబాటులో ఉన్నాయి.

టెస్లా వ్యూహం..

అధిక దిగుమతి సుంకాల కారణంగా టెస్లా గతంలో భారత మార్కెట్‌లోకి ప్రవేశించలేదు. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అధిక ధర గల దిగుమతి వాహనాలపై 110% కస్టమ్స్ డ్యూటీ విధించేది. ఇటీవల ఈ సుంకాన్ని 40వేల డాలర్లకు పైబడిన కార్లపై 70%కి తగ్గించారు. దీనివల్ల టెస్లా తన వ్యాపారాన్ని భారతదేశంలో ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

టెస్లా కోసం నూతన మార్కెట్..

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెటింగ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. కానీ టెస్లా తన ఉత్పత్తిని పెంచుకునేందుకు ఇండియాను ఒక అవకాశంగా ఎంచుకుంది.

భారత్ vs చైనా – EV మార్కెట్ గణాంకాలు (2023)..

2023 గణాంకాల ప్రకారం.. భారతదేశ EV అమ్మకాలు – 100,000 యూనిట్లు.

చైనా EV అమ్మకాలు – 11 మిలియన్ యూనిట్లు. గత దశాబ్దంలో తొలిసారి టెస్లా వార్షిక EV అమ్మకాలలో తగ్గుదల నమోదు కావడంతో, భారతదేశాన్ని కొత్త వ్యాపార అవకాశంగా పరిశీలిస్తోంది. 

Tags:    

Similar News