‘సుచిర్ బాలాజీ’ ది ఆత్యహత్యే అని తేల్చిన అమెరికా పోలీసులు
ఓపెన్ఏఐ విజిల్ బ్లోయర్ మృతి కేసు పై శాన్ ఫ్రాన్సిస్కో పోలీసుల ప్రకటన;
By : The Federal
Update: 2025-02-17 11:31 GMT
ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీది ఆత్మహత్యే అని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు నిర్థారించారు. శవపరీక్ష నివేదికను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ప్రకటన చేశారు.
సుచిర్ బాలాజీ(26), నవంబర్ 2024 లో తన అపార్ట్ మెంట్ లో చనిపోయి కనిపించారు. ఆయన హత్యకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు లోపభూయిష్టంగా నిర్వహించారని విమర్శలు చేశారు.
ఎస్ఎఫ్పీడీ నివేదిక ఫలితాలు..
శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ ప్రచురించిన వార్త ప్రకారం.. శవ పరీక్ష నివేదికను పరిశీలిస్తే స్థానిక పోలీస్ డిపార్ట్ మెంట్ నవంబర్ 26, 2024న బుకానన్ స్ట్రీట్ లోని తన అపార్ట్ మెంట్ లో సుచిర్ బాలాజీ స్వయంగా తుఫాకీతో కాల్చుకుని మరణించాడని చెబుతూ దర్యాప్తును ముగించింది.
బాలాజీ తన ఇంటి తలుపు మూసుకుని బోల్ట్ బిగించుకున్నారని, ఆయన ఉన్న నాల్గవ అంతస్తు అపార్ట్ మెంట్ లోని వేరే ఇతర మార్గాలు కూడా లేవని పోలీసులు తెలిపారు. ఇంటి కిటికీలు ఎత్తుగా ఉన్నాయి. అవి కేవలం 4 అంగుళాలు మాత్రమే తెరవగలం అని చెప్పారు. శవపరీక్ష నివేదిక సమీక్షించిన పోలీసులు ‘‘మిస్టర్ బాలాజీ మరణం హత్య అని చెప్పడానికి ఆధారాలు లేవు’’ అని పేర్కొంది.
కేసు ఏంటీ?
సుచిర్ బాలాజీ 2020 నుంచి ఆగష్టు 2024 వరకూ ఓపెన్ ఏఐలో ఉద్యోగం చేశారు. అయితే అక్టోబర్ 23, 2024 లో ఓ వార్తా పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ ఏఐ తన కార్యక్రమాలకు శిక్షణ ఇవ్వడానికి డేటాను అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతుందని తెలిపారు.
తాను డేటా సేకరించే పనిలో ఉన్న సభ్యులలో ఒకరని వెల్లడించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అని, చాట్ జీపీటీలోని ఇతర సాంకేతికతలు ఇంటర్నెట్ ను దెబ్బతీస్తున్నారని బాలాజీ ఆరోపించారు. టెస్లా సీఈఓ, ఒపెన్ ఏఐ విమర్శకుడు ఇలాన్ మస్క్ సుచిర్ బాలాజీ మరణం పై స్పందిస్తూ.. ఇది ఆత్యహత్య కాదని పరోక్షంగా అన్నారు.
సరిగా దర్యాప్తు చేయలేదు: తల్లిదండ్రులు
ఒపెన్ ఏఐ కథనం ప్రచురించిన ఒక నెల తరువాత బాలాజీ ఆత్యహత్య చేసుకున్నాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు సంతృప్తికరంగా లేదని పూర్తి నివేదిను పోలీసుల నుంచి డిమాండ్ చేశారు. వారు తమకు న్యాయం చేయాలని టక్కర్ కార్లన్స్ షో లో కూడా పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాలాజీ తల్లి పూర్ణిమా రామారావు మాట్లాడుతూ.. శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు దర్యాప్తు సరిగా చేయలేదని ఆరోపించారు. శవపరీక్ష నివేదికలో తప్పులు ఉన్నాయన్నారు. అపార్ట్ మెంట్ భవనం సీసీటీవీ ఫుటేజీలో కొన్ని భాగాలు మిస్ అయ్యాయని అన్నారు.
ఈ ఆత్మహత్యపై జనవరి 31న సుచిర్ బాలాజీ తల్లిదండ్రులు దర్యాప్తుపై పూర్తి ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ కోర్టులో దావా వేశారు. అలాగే విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమీక్షిస్తున్నారు.