భారత్ కు రాబోతున్న ‘వాన్స్’ దంపతులు
వైస్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఇండియాకు రాబోతున్న జేడీ వాన్స్;
By : The Federal
Update: 2025-03-12 06:33 GMT
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల చివర్లో భారత్ వస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. ‘‘ఈ నెల చివరలో సెకండ్ లేడీ ఉషా వాన్స్ తో కలిసి జేడీ వాన్స్ భారత్ కు వెళతారు. ’’ అని పొలిటికోలోని ఒక నివేదిక బయటకు వచ్చింది. ప్రణాళికను అమెరికా ఉన్నత స్థాయి బృందం ధృవీకరించిందని వెల్లడించింది.
‘‘గత నెల లో ఫ్రాన్స్, జర్మనీలో పర్యటించిన వాన్స్.. యూరప్ కు విధానాలపై చురకలంటించారు. నాటో, ఉక్రెయిన్ విషయంలో యూరప్ దే తుది నిర్ణయని తేల్చి చెప్పేశారు.
వాన్స్ భారత్ కు వస్తే ఆయన సందర్శించిన రెండో దేశం ఇదే’’ అని నివేదిక పేర్కొంది. ఉషా వాన్స్ తల్లిదండ్రులు కృష్ణా చిలుకూరి, లక్ష్మీ చిలుకూరీ 1970 ల చివరలో భారత్ నుంచి అమెరికా వలస వెళ్లారు. సెకండ్ లేడీ అయ్యాక ఉషా తొలిసారి భారత్ సందర్శించబోతున్నారు.
ఉషా- జేడీ వాన్స్ ‘యేల్’ లా స్కూల్ లో చదువుతున్నప్పుడూ కలిశారు. ఉష ఒక లిటిగేటర్, యూఎస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ జి రాబర్ట్స్, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పిల్స్ న్యాయమూర్తి బ్రేటె కవనాగ్ లో క్లర్క్ గా పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ ను పూర్తి చేశారు.