‘‘ట్రంప్ ఈజ్ డెడ్’’ అంటూ ట్రోల్ చేస్తున్న భారతీయులు
జేడీ వాన్స్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం పై రూమర్లు;
By : The Federal
Update: 2025-08-30 13:41 GMT
తదుపరి అమెరికా అధ్యక్షుడిని నేనే అంటూ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఎక్స్ లో ‘ట్రంప్ ఈజ్ డెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.
ఈ ఏడాది రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ అనేక దేశాలపై సుంకాలు విధిస్తూ హడలెత్తిస్తున్నారు. ప్రపంచ సంఘర్షణలు నివారించడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నానంటూ గొప్పలు ప్రకటించుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఈ మధ్య ట్రంప్ చేతికి గాయం, వాపు కనిపించింది. అందువల్ల ఆయన ఆరోగ్యం పై ప్రజల్లో సందేహాలు నెలకొన్న తరుణంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రజలలో పుకార్లు రేపడానికి కారణమైంది.
గత కొద్దికాలంగా అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం పై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ పదవిలో ఉండగా ఆయన మానసిక ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
వాన్స్ ఇంటర్వ్యూ..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ బుధవారం యూఎస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. అమెరికాలో తీవ్ర విషాదం సంభవిస్తే తాను అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నానని చెప్పడం అగ్నికి ఆజ్యం పోసింది.
అయితే ట్రంప్ మాత్రం మంచి ఆరోగ్యంతో ఉన్నారని వాన్స్ చెప్పారు. ‘‘దేవుడు అనుమతించకపోతే ఒక భయంకరమైన విషాదం జరిగితే గత రెండు వందల రోజుల్లో నేను తీసుకోకపోబోయే మంచి శిక్షణ గురించి నేను ఆలోచించలేదు’’ అని ఆయన అన్నారు.
ఇప్పటి వరకూ అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడు ట్రంప్. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో జో బైడెన్ పేరు మీద ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. మరో వైపు వాన్స్ పిన్నవయస్కుడైన ఉపాధ్యక్షుడు.
ఈ కేటగీరిలో ఆయన మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ సరిగా బయట కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం పై వదంతులు చెలరేగాయి. అలస్కాలో పుతిన్ సమావేశం అయిన తరువాత ఆయన రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్దాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన తన సొంత సోషల్ మీడియా ద ట్రూత్ లో ఆక్టివ్ గా కనిపించారు.
నెటిజన్ల ఫన్నీ మీమ్స్..
భారత్ పై సుంకాలు విధించడం, పాకిస్తాన్ జనరల్ మునీర్ తో కలిసి డిన్నర్ చేయడంతో ఆగ్రహంగా ఉన్న చాలా మంది భారతీయులు ఎక్స్ లో ఫన్నీ మీమ్స్ తో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇందులో ఎక్కువగా ట్రంప్ చనిపోయినట్లు పుకార్లతో పాటు జూలైలో భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని దూషించిన ఆయన కామెంట్లను వ్యంగ్యంగా మార్చి పోస్ట్ చేస్తున్నారు.
‘‘ట్రంప్ చనిపోయాడు’’ అనే మాట ఆయనను వ్యతిరేకించే వారికి తాత్కాలిక ఆనందం కలిగిస్తుంది కానీ ఆయన పదవీకాలంలో మొదటి ఏడు నెలలు చేసినట్లుగా మిగిలిన కాలం చేయాలని ధైర్యవంతులైన మిగిలిన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.