హెచ్ వన్ -బీ లో లాటరీ వ్యవస్థ రద్దు చేసిన ట్రంప్
నైపుణ్య ఉంటేనే వీసాల జారీ చేయాలని నిబంధనలు
By : The Federal
Update: 2025-12-24 06:37 GMT
హెచ్ వన్ బీ వీసాల జారీ పద్దతిలో ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇది వరకూ ఉన్న లాటరీ పద్దతిని రద్దు చేసి, దాని స్థానంలో వేతనం, నైపుణ్యం ఆధారంగా వీసాలు జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఇంతకముందు ఉన్న లాటరీ వలె కాకుండా హెచ్ వన్ బీ వీసాల కోసం కొత్త పద్దతిలో నైపుణ్యం ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తామని డిపార్ట్ మెంట్ హోమ్ ల్యాండ్ సెక్యురిటీ(డీహెచ్ఎస్) మంగళవారం పేర్కొంది.
అమెరికన్ కార్మికులకు చెల్లించేదానికంటే తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను దిగుమతి చేసుకోవడమే ఏకైక ఉద్దేశ్యంగా ఉన్న అమెరికన్ యజమానులలో ఒక వర్గం యాధృచ్చిక లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని డీహెచ్ఎస్ ఆరోపించింది. ‘‘అమెరికా కార్పొరేట్ యజమానులు లాటరీ పద్దతిని దుర్వినియోగం చేస్తున్నారు’’
‘‘హెచ్ వన్ బీ రిజిస్ట్రేషన్ల ప్రస్తుత ఎంపిక ప్రక్రియను అమెరికన్ యజమానులు దోపిడి చేసి దుర్వినియోగం చేశారు. ప్రధానంగా అమెరికన్ కార్మికులకు చెల్లించే దానికంటే తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులకు దిగుమతి చేసుకోవాలని చూస్తున్నారు’’ అని యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిది మాథ్యూ ట్రాగెస్సర్ అన్నారు.
హెచ్ వన్ బీ వీసా కేటాయింపులో మార్పులు కాంగ్రెస్( అమెరికా పార్లమెంట్) లక్ష్యానికి బాగా ఉపయోగపడతాయని, అధిక జీతం, అధిక నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల కోసం పిటిషన్ వేయడానికి అమెరికన్ యజమానులను ప్రొత్సహించి తద్వారా అమెరికాలో పోటీతత్వాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఏడాది హెచ్ వన్ బీ వీసాల సంఖ్యను 65 వేలకు పరిమితం చేయడంతో పాటు యూఎస్ అడ్వాన్స్ డ్ డిగ్రీ హెూల్డర్లకు అదనంగా 20 వీసాలు జారీచేయబడతాయని డీహెచ్ఏ పేర్కొంది.
ఈ నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పాత పద్దతిలో అమెరికన్ శ్రామిక శక్తికి హనీ కలిగిందని, తక్కువ వేతనాలతో తక్కువ నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులతో తీసుకురావడంతో యజమానులు వ్యవస్థను దోపిడి చేయడానికి అనుమతించిందని పేర్కొంది.
‘‘ఈ ఆందోళనలను పరిష్కరించడానికి వెయిటేడ్ ఎంపిక ప్రక్రియను అమలు చేస్తుంది. ఇది హెచ్ వన్ బీ వీసాలను అధిక నైపుణ్యం అధిక వేతనం పొందే విదేశీయులకు ఉపయోగపడుతుంది.
అదే సమయంలో యజమానుల అన్ని వేతన స్థాయిలలో హెచ్ వన్ బీ కార్మికులను పొందె అవకాశాన్ని కొనసాగిస్తుంది. ఈ నియమాలు ఫిబ్రవరి 27, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే 2027 నుంచి హెచ్ వన్ బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్ అమలులో ఉంటుంది’’ అని డీహెచ్ఎస్ పేర్కొంది.