DOGE నుంచి తప్పుకుంటున్న ఎలోన్ మస్క్

సలహాదారుడి బాధ్యతల నుంచి దూరమవుతున్న ప్రముఖ వ్యాపారవేత్త.;

Update: 2025-04-03 11:34 GMT
DOGE నుంచి తప్పుకుంటున్న ఎలోన్ మస్క్
Click the Play button to listen to article

అమెరికా(America) ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ త్వరలో బాధ్యతల నుంచి తప్పుకుంటారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. "తనకు ఓ పెద్ద కంపెనీ ఉంది. ఏదో ఒక సమయంలో తిరిగి వెళ్తాడు" అని ట్రంప్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సభ్యులతో కూడా చెప్పినట్లు సమాచారం. మే చివర్లో లేదా జూన్‌ మొదటి వారంలో మస్క్‌ బాధ్యతల నుంచి దూరమయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ వచ్చే ఏడాది మిడ్‌టర్మ్‌పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. తన హౌస్ మెజారిటీకి హాని కలగకుండా జాగ్రత్తపడుతున్నారు.

కాగా ఎలోన్ మస్క్ ట్రంప్‌నకు అనధికార సలహాదారు ఉంటారని ఒక సీనియర్ పరిపాలనాధికారి చెప్పారు. మస్క్ పూర్తిగా కనుమరుగైపోతాడని భావించే వాళ్లు 'తమను తాము మోసం చేసుకున్నట్లేనని ఆయన పేర్కొన్నారు.

DOGE పనేంటి ?

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేసే ఈ శాఖకు సారథిగా ఎలాన్‌ మస్క్‌ను నియమించారు. మస్క్‌ కేవలం సలహాదారుడేనా? లేక ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో కీలక వ్యక్తి అవుతారా? అని కొంతమంది అమెరికన్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం (White House) క్లారిటీ ఇచ్చింది. ‘‘డోజ్‌లో మస్క్‌ ఉద్యోగి కాదు. అధిపతి కాదు. ఆయన ఒక సలహాదారుడు మాత్రమే. ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలు లేవు’’ అని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News