హెచ్ వన్ - బీ వీసా విధానంపై రెండుగా చీలిన ట్రంప్ మద్ధతుదారులు
అమెరికా కార్మికులను ప్రొత్సహించాలని సంప్రదాయ వాదుల డిమాండ్.. నిపుణులను తీసుకురావాలంటున్న మస్క్, వివేక్ రామస్వామి..;
By : The Federal
Update: 2024-12-29 11:10 GMT
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన వలస విధానంపై కాస్త మెత్తపడినట్లు కనిపిస్తున్నారు. దేశంలోకి ఇక నుంచి నైపుణ్యం కలిగిన వలసదారులు మాత్రమే ప్రవేశించేలా హెచ్ వన్ -బీ వీసా విధానాన్ని రూపొందిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ఆయన తాజా ప్రకటన యునైటెడ్ స్టేట్స్ లో తనకు అత్యంత బలమైన మద్ధతు ఇచ్చే సాంప్రదాయ వాదులు- వ్యాపార వర్గాల మధ్య విభజనను తీసుకొచ్చింది.
ట్రంప్ ప్రకటించిన ఈ విధానం కచ్చితంగా భారత ఐటీ నిపుణులు, టెక్ కంపెనీలకు ఊరట కల్పించేది. మొదటి సారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వలసదారులతో పాటు టెక్ కంపెనీలు, నిఫుణులపై ఒకే విధానం అనుసరించారు. ఆయన పత్రాలు లేని వలసదారులను బహిష్కారిస్తామని, చట్టబద్దమైన వలసలను పరిమితం చేస్తామని ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. ఇదే విధానంపై ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ ఈసారి కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.
సాంప్రదాయ బేస్ vs టెక్ మాగ్నెట్స్..
మొదటి పరిపాలన కాలంలో హెచ్ వన్ -1 బీ వీసాలను దాదాపుగా తిరస్కరించిన పనిచేసిన ట్రంప్, ఈ సారి కూడా అదే విధాన్ని అనుసరిస్తారని ఆందోళనలు టెక్ దిగ్గజాల్లో నెలకొన్నాయి. 2016 లో ట్రంప్ హెచ్ వన్ -1 బీ వీసాలపై పరిమితులు 6 శాతం నుంచి 24 శాతానికి చేరుకున్నాయి. అందులో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు భారీ స్థాయిలో ధరలు పెంచింది. అనేక కొత్త నిబంధనలు చేర్చింది.
నాకు హెచ్ వన్ బీ వీసాలంటే ఇష్టమని, కాబట్టి వీటికి నేను అనుకూలమని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు న్యూయార్క్ పోస్టు వార్తలు ప్రచురించింది. దీనిపై ఆయన మద్ధతుదారుల్లో చీలికను తెచ్చింది. ఈ విధానం ఇలాన్ మస్క్ కూడా స్పందించారు. ఇంజనీరింగ్ నిఫుణులను ఆకర్షించడం అమెరికా గెలుపుకు అత్యవసరం అని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. దీని కోసం ఎలాంటి పోరాటాలకైన సిద్ధమని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ట్రంప్ ఆధ్వర్యంలోని కాస్ట్-కటింగ్ ప్యానెల్‌కు కో-ఛైర్‌గా పనిచేస్తున్న మరో రిపబ్లిక్ నాయకుడు వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. US అత్యంత నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్ల కొరతను ఎదుర్కొంటుందని, H1-B ప్రోగ్రామ్ అనివార్యమని అభిప్రాయపడ్డారు. లేకపోతే చైనా కంటే అమెరికా వెనకబడి ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అయితే రామస్వామి వ్యాఖ్యలపై అనేకమంది యూరోపియన్ వలసదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్ దిగ్గజాలు అంతా అమెరికన్ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
మస్క్ వ్యాఖ్యలపై..
హెచ్ వన్ బీ వీసాలకు మద్ధతుగా ఇలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ కు సాంప్రదాయకంగా ఉన్న వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. లారా లూమర్ అనే ట్రంప్ మద్థతుదారులు మాట్లాడుతూ.. టెక్ దిగ్గజాలు, ట్రంప్ మధ్య విభేదాలు రావడానికి ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
టెక్నో క్రాట్ల నుంచి అధ్యక్షుడు ట్రంప్ ను రక్షించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ అమెరికన్ కార్మికులను ప్రోత్సహించాలని, వలసలను పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల్లో ప్రచారానికి ఆయన 250 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందించారు.
H1-B వీసా - భారతీయ నిపుణులు..
అమెరికాలో చదువుకోవడానికి, తాత్కాలిక ఉద్యోగాల కోసం అమెరికా హెచ్ వన్ బీ వీసాలను మంజూరు చేస్తారు. ఇవి దిగ్గజ వ్యాపార సంస్థలు నిఫుణులైన ఉద్యోగులను నియమించుకోవడానికి కూడా అనుమతి ఇస్తుంది. ఇవి సంవత్సరంలో నిర్ణీత సంఖ్యలో మంజూరు చేస్తారు. కనీసం ఒక సంవత్సరంలో 65 వేల వీసాలు, అదనంగా మరో 20 వేల వరకూ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ మొదటిసారిగా పగ్గాలు చేపట్టిన కాలంలో దీనిపై అనేక ఆంక్షలు విధించారు.
ప్రస్తుతం ఏ దేశాల వారీగా వీసాలు కేటాయిస్తున్నారు. ఇది భారతీయ నిపుణులకు పెద్ద అడ్డంకిగా మారింది. మన దగ్గర నుంచి లక్షలో సంఖ్యలో నిపుణులు హెచ్ వన్ బీ వీసాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ చాలా తక్కువ మందికి ఈ విధానంలో వీసాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం, డిమాండ్‌తో సంబంధం లేకుండా ఏ ఒక్క దేశానికి చెందిన కార్మికులకు మొత్తం H1-B వీసాల సంఖ్యలో 7% కంటే ఎక్కువ కేటాయించరు.
H1-B వీసా పరిమితులను తొలగించాలి
US అధికారులు ప్రస్తుతం H1-B వీసా పరిమితులను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఈ చర్య వేలాది మంది భారతీయ కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల శ్రీరామకృష్ణన్‌ను సీనియర్ పాలసీ సలహాదారుగా నియమించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కృష్ణన్ మెరిట్ ఆధారంగా ఇమ్మిగ్రేషన్ చట్టాల కోసం చాలా కాలంగా గొంతెత్తుతున్నారు. నైపుణ్యం ఆధారంగా గ్రీన్ కార్డు ఇవ్వాలని ఆయన వాదన. కొత్త సంస్కరణల ప్రకారం.. H1-B వీసాలపై ప్రతి దేశం ఉన్న పరిమితి తొలగిస్తారు. వీసాలు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఇస్తారు. ఇది అనేక కాలంగా వేచి చూస్తున్న భారతీయ టెకీలకు వరంగా మారనుంది.