అక్రమ వలసదారుల్లో హత్యకేసు నిందితులు

అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చిన రెండో ధఫా అక్రమ వలసదారుల్లో ఇద్దరు హత్య కేసు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.;

Update: 2025-02-16 10:42 GMT
తమవారి కోసం ఎయిర్‌పోర్టు బయట వేచి ఉన్న బంధువులు
Click the Play button to listen to article

అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చిన రెండో ధఫా అక్రమ వలసదారుల్లో ఇద్దరు హత్య కేసు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అమెరికా (America) అక్రమవలసదారులను (Illegal immegrants) వారి స్వదేశాలకు పంపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రెండో దఫాగా 116 మంది భారతీయులను శనివారం అర్థరాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వారి వివరాలు తెలుసుకుంటుండగా.. హత్య కేసు నిందితులు దొరికారు. రాజ్‌పురాకు చెందిన వీరు 2023లో పటియాలలో జరిగిన ఓ హత్యకేసులో నిందితులు. ఈ ఇద్దరి మీద IPC సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం), 323 (దేహదండన), 506 (భయాందోళనకు గురిచేయడం), 148 (ఆయుధాలతో దాడి), 149 (సామూహిక నేరం) కింద కేసు నమోదయ్యాయి. అయితే లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ కాలేదని అధికారులు వెల్లడించారు.

మొదటి విడతలో 104 మంది అక్రమవలసదారులతో అమెరికా విమానం ఫిబ్రవరి 5న అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలిసిందే. శనివారం అర్థరాత్రి రెండో ధపాగా 116 మందిని తీసుకొచ్చారు. మూడో ధపా మరికొంతమందిని ఈ రోజు (ఫిబ్రవరి 16) తీసుకువస్తారని సమాచారం. 

Tags:    

Similar News