ఉక్రెయిన్ లో ఉన్న వ్యాపారం చేస్తున్న భారత్ కు చెందిన ‘కుసుమ’ ఫార్మాస్యూటికల్ గిడ్డంగులపై రష్యా శనివారం దాడి చేసిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో దాడికి సంబంధించి చిత్రాలు ఉన్నాయి. భారత్ ను తమ గొప్ప స్నేహితుడని రష్యా తరుచు చెప్తుందని, కానీ ఉక్రెయిన్ లో ఉన్న భారత వ్యాపారాలపై మాత్రం మిస్సైల్స్ తో విరుచుకుపడుతుందని ఆరోపించింది. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలిపింది.
‘‘ఈ రోజు ఉక్రెయిన్ లోని ఫార్మాస్యూటికల్ గిడ్డంగులపై మిస్సైల్ దాడి జరిగింది. ఇవి భారత్ కు చెందిన కుసుమ్ అనే సంస్థవి’’ అని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది.
‘‘రష్యాకు భారత్ గొప్ప స్నేహితుడని చెప్పుకుంటూ భారత వ్యాపారాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులకు మందులు అందకుండా అడ్డుకుంటోంది’’ అని ఎక్స్ లో ఆరోపణలు గుప్పించింది. దాడులకు సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా అందలేదు.
ఈ దాడులకు సంబంధించి ఉక్రెయిన్ లో ఉన్న బ్రిటిష్ రాయబారి మార్టిన్ హారిస్ స్పందించారు. రష్యా డ్రోన్లతో ఈ దాడులు చేసినట్లు ఆయన చెప్పారు.
‘‘ ఈరోజు ఉదయం రష్యా డ్రోన్లు పెద్ద కీవ్ లోని ఫార్మాస్యూటికల్ గిడ్డంగిని పూర్తిగా నాశనం చేశాయి. చిన్న పిల్లలు, వృద్దులకు అవసరం అయ్యే ఔషధాలను అందకుండా చేసింది. రష్యా, ఉక్రెయిన్ పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులు చేస్తోంది.’’ అని ఆయన ఎక్స్ లో విమర్శలు గుప్పించారు.
దాడులను అంగీకరించిన కంపెనీ..
ఉక్రెయిన్ లోని తమ ఔషధ గిడ్డంగులపై దాడులు జరిగాయని వెబ్ సైట్లో తెలిపింది. తమకు ఉక్రెయిన్ తో పాటు మరో 29 దేశాలలో సేవలు అందిస్తున్నామని తెలిపింది. అందులో మాల్దోవా, ఉజ్బేకిస్తాన్, కజకిస్తాన్, కెన్యా, ఐవరీ కోస్ట్, బెనిన్, బుర్కినా ఫాసో, ఇథియోపియా, నైగర్, కామెరూన్, మాలి, టాంజినియా వంటి దేశాలు ఉన్నాయని తెలిపింది.
అమెరికాలో ట్రంప్ సర్కార్ ఏర్పడిన తరువాత మాస్కో- కీవ్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు వేగం ఫుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తన దాడులను ఉధృతం చేసింది.
యూఎస్ రాయబారీ స్టీవ్ విట్ కాఫ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను సెయింట్ పీటర్స్ బర్గ్ లో కలిసి మాట్లాడారు. వీరిద్దరి మధ్య ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం అంశాలు చర్చకు వచ్చాయని తేలింది.
యూఎస్ ప్రతిపాదించిన మధ్యంతర కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించి శనివారానికి నెల రోజులు పూర్తి అయింది. గత నెల రోజుల నుంచి మాస్కో, కీవ్ పై దాడుల తీవ్రతను పెంచింది. ఉక్రెనియన్ విదేశాంగమంత్రి ఆండ్రి సైబిహ మాట్లాడుతూ... శాంతికి రష్యానే అడ్డంకి అని ఆరోపించారు.
జెడ్డాలో జరిగిన శాంతి చర్చలలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ అంగీకరించిందని జెడ్డాహ్ తెలిపారు. కానీ రష్యా మాత్రం ఇందకు నిరాకరించిందని అన్నారు. శాంతి కోసం అనేక డిమాండ్లు పెట్టిందని అన్నారు.
మార్చి 11 నుంచి ఏప్రిల్ 11 మధ్య రష్యా, ఉక్రెయిన్ పై 70 మిస్సైల్ లు, 2,200 షాహిద్ డ్రోన్లు ప్రయోగించారని తెలిపారు. అలాగే ఆరు వేల గైడెడ్ బాంబులు ఉపయోగించారని ఆరోపించారు. శాంతి కోసం రష్యానే ముందుకు రావాలన్నారు.