ఆ విద్యార్థుల వీసాలు రద్దు..!

నేర చరిత్ర ఆధారంగా, సోషల్ మీడియా కార్యకలాపాల ఆధారంగా F -1 వీసాలను రద్దు చేసే ఆలోచనలో అమెరికా - అగ్రరాజ్యం తీరుతో ఆందోళనలో విద్యార్థులు;

Update: 2025-04-09 13:02 GMT
Click the Play button to listen to article

అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అగ్రరాజ్యంలో కొత్తకొత్త ఆంక్షలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను గుర్తించి యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. ఇకపై వీసా ఉన్నా కూడా తప్పు చేస్తే స్వదేశాలకు తిరిగి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలో చిన్నచిన్న నేరాలకు (Minor offences) పాల్పడిన విద్యార్థుల F-1 వీసాలను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొంతమంది భారత విద్యార్థులు అమెరికాలో వాహనాలను అతివేగం నడిపి, మరికొంతమంది దుకాణాల్లో దొంగ దొంగతనానికి పాల్పడి, ఇంకొందరు మద్యం తాగి పోలీసులకు దొరికిపోయిన సందర్భాలున్నాయి. ఇలా పట్టుబడిన వారిపై అమెరికా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కేసులున్న విద్యార్థులు కోర్టులో పరిష్కరించుకున్నా వదిలిపెట్టడం లేదు. UC బర్కిలీ, స్టాన్‌ఫోర్డ్, UCLA వంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులను ఇప్పటికే టెర్మినెట్ చేశారు.

ఇదిలా ఉండగా చిన్న నేరాలకు వీసాలను రద్దు చేయడం సమంజసం కాదని అక్కడి న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఏడాది క్రితం నేరాలు చేసిన విద్యార్థులు తక్షణ న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా కూడా విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలస్తీనాకు అనూకూలంగా పోస్టులు పెడుతున్న వారిపై కూడా ఓ కన్నెసి ఉంచారు.

అమెరికాకు అంతర్జాతీయంగా విద్యార్థుల సంఖ్యను పెంచుతున్న దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో 3.32 లక్షల మంది భారతీయులు చేరారని తెలుస్తోంది. అమెరికాలో పెరిగినోతున్న ఆంక్షల నేపథ్యంలో భవిష్యత్తులో అంతర్జాతీయ విద్యార్థులు US విశ్వవిద్యాలయాలను ఎంచుకునే అవకాశం తగ్గే అవకాశం ఉంది. 

Tags:    

Similar News