భారత్ కు సుంకాల నోటీస్ జారీ చేసిన అమెరికా

ఎన్ని ఒత్తిడులు అయిన భరిస్తామన్నా ప్రధాని మోదీ;

Update: 2025-08-26 05:41 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ పై రెండో దశ టారిఫ్ అమలు చేయడానికి అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం సుంకాలకు సంబంధించిన సాధారణ నోటీస్ ను అందించింది. ఆగష్టు 27, 12.01 అదనంగా 25 శాతం సుంకాలు విధించబోతున్నట్లు అందులో పేర్కొంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినందుకు ప్రతీకార సుంకాలు విధించినట్లు అందులో పేర్కొన్నారు.

ఈ నోటీస్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ జారీ చేసింది. రష్యా నుంచి అమెరికాకు బెదిరింపులు ఎదురువుతున్న నేపథ్యంలో భారత్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు నోటీస్ లో పేర్కొంది.
‘‘ఆగష్టు 27, 2025 అమెరికాలో నమోదు చేసుకున్న భారతీయ ఉత్పత్తులకు గిడ్డంగి నుంచి బయటకు వచ్చిన భారతీయ ఉత్పత్తులకు సంబంధించి సుంకాలు అమలులో ఉంటాయి’’ అని నోటీస్ లో పేర్కొన్నారు.
ఒత్తిడిని తట్టుకుంటాం..
భారతీయ రైతులు, పశు పోషకులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై తాను రాజీపడబోనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అహ్మాదాబాద్ లో జరిగిన ఒక సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పై ఒత్తిడి పెరగవచ్చు కానీ మేము అన్నింటిని భరిస్తాము’’ అని ప్రధాని అన్నారు.
‘‘మనమందరం భారత్ లో తయారైన వస్తువులను మాత్రమే కొనాలనే మంత్రాన్ని అనుసరించాలి. వ్యాపారవేత్తలు తమ సంస్థల వెలుపల స్వదేశీ వస్తువులను మాత్రమే అమ్ముతామని ఒక పెద్ద బోర్డును పెట్టాలి’’ అని అన్నారు.
తాజా సుంకాల బెదిరింపు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి కొత్త సుంకాలు విధిస్తామని బెదిరింపు చేశాడు. అమెరికా టెక్నాలజీ సంస్థలపై డిజిటల్ సేవ పన్నులు, సంబంధిత నిబంధనలను విధించే దేశాలకు అమెరికా చిప్ లను ఎగుమతిని పరిమితం చేయడానికి ఈ సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా టెక్ కంపెనీలపై దాడి చేసే దేశాలకు తాను అండగా నిలుస్తానని ట్రంప్ అన్నారు.
‘‘డిజిటల్ పన్నులు, డిజిటల్ సేవల చట్టం, డిజిటల్ మార్కెట్ల నిబంధనలు అన్నీ అమెరికన్ టెక్నాలజీకి హానీ కలిగించడానికి లేదా వివక్ష చూపడానికి రూపొందించబడ్డాయి. చైనాలోని అతిపెద్ద టెక్ కంపెనీలకు పూర్తి స్థాయి పాస్ ఇస్తాయి. ఇది ఇప్పుడే ముగియాలి’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ ఫాంలో పోస్ట్ చేశారు.
ఈ వివక్ష చర్యలు తొలగించకపోతే ఆ దేశం యూఎస్ కి ఎగుమతి చేసే వస్తువులపై అదనపు టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఇకపై ప్రపంచానికి పిగ్గీ బ్యాంక్ లేదా డోర్ మ్యాట్ కాదని ట్రంప్ అన్నారు. అమెరికా, మా కంపెనీలపై గౌరవం చూపండి లేకపోతే తరవాత పరిణామాలకు బాధ్యత వహించాల్సిందే అని ట్రంప్ పోస్ట్ చేశారు.
డిజిటల్ పన్నులు..
ఇతర దేశాలతో వాణిజ్య చర్చలలో అమెరికాకు డిజిటల్ పన్నులు కొత్త ఘర్షణగా మారాయి. జూన్ లో డిజిటల్ పన్నులపై కెనడాతో అన్ని వాణిజ్య చర్చలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
అమెరికా, ఈయూ ఒక సంయుక్త ప్రకటనలో అన్యాయమైన వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి, ఎలక్ట్రానిక్ ప్రసారాలపై కస్టమ్స్ సుంకాలను విధించకూడదని అంగీకరించిన వారం తరువాత ట్రంప్ తాజా హెచ్చరిక చేశారు. ఈయూ కూడా నెట్ వర్క్ వినియోగ రుసుములను స్వీకరించబోమని తెలిసింది.
Tags:    

Similar News