పశ్చిమాసియాలో వైమానిక దాడులు చేసిన అగ్రరాజ్య కూటమి
ఎర్ర సముద్రం గుండా వెళ్లే నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబెల్స్ పై అమెరికా, బ్రిటిష్ వైమానిక దాడులకు దిగాయి. ఈ దాడిలో..
By : The Federal
Update: 2024-05-31 12:45 GMT
గల్ఫ్ లోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థ హౌతీలపై అమెరికా- బ్రిటిష్ సంయుక్తంగా వైమానిక దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో 16 మంది చనిపోయారని, 35 మంది గాయపడ్డారని హౌతీలు ప్రకటించారు.
ఈ దాడులపై ఇరుదేశాల అధికారులు వివరించే ప్రయత్నం చేశారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడానికి ఉపయోగిస్తున్న విస్తృత శ్రేణి భూగర్భ సౌకర్యాలు, క్షిపణి లాంచర్లు, కమాండ్, కంట్రోల్ సైట్‌లు, హౌతీ నౌక, ఇతర సౌకర్యాలను ధ్వంసం చేసినట్లు ఓ ప్రకటనలో వివరించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ.. హౌతీలు ఎర్రసముద్రం, ఏడెన్ గల్ఫ్ లోని ఓడలపై ఇరాన్-మద్దతుగల ఉగ్రవాద సంస్థ ఇటీవలి దాడులకు పాల్పడుతోంది. దీనిని నివారించడానికి వైమానిక దాడులకు దిగినట్లు ఈ రెండు దేశాల దళాలు ప్రకటించాయి.
ఎర్ర సముద్రంలోని USS డ్వైట్ D. ఐసెన్‌హోవర్ విమాన వాహక నౌక నుంచి US F/A-18 యుద్ధ విమానాలు దాడుల్లో పాల్గొన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని ఇతర US యుద్ధనౌకలు కూడా వైమానిక దాడుల్లో తమ వంతు సహకారం అందించాయి. కానీ హౌతీలు ఈ దాడులు మాపై జరగలేదని ప్రకటించారు.
ఎర్ర సముద్రంలోని ఓడరేవు నగరంలో హోడెయిడా రేడియో, పౌర గృహాలను, హౌసింగ్ భవనాలపై యూఎస్ దాడులు చేసినట్లు వారు చెప్పారు. వారి అల్ మసీరా శాటిలైట్ న్యూస్ ఛానెల్ రక్తంకారుతున్న ఒక వ్యక్తిని మెట్లపైకి తీసుకెళ్తున్నట్లు, ఇతరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను ప్రసారం చేసింది.
యెమెన్ లోని హూదీడాలో జరిగిన దాడిలో చనిపోయిన వారందరూ కూడా హౌతీలు పౌరులుగా అభివర్ణించారు. అయితే అసోసియేటెడ్ ప్రెస్ వెంటనే వీటిని ధృవీకరించలేకపోయింది. 2014 నుంచి యెమెన్ రాజధాని సనా లో తిరుగుబాటు జరుగుతోంది. ఇక్కడ చాలామంది సాధారణ దుస్తుల్లోనే ఉండి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
అయితే వైమానిక దాడులు మాత్రం సనా వెలుపల ఉన్న హౌతీల విమానాశ్రయం, తైజ్‌లోని కమ్యూనికేషన్ పరికరాల సమీపంలో తాకినట్లు బ్రాడ్‌కాస్టర్ తెలిపారు. ఇవన్నీ కూడా హౌతీల ఆధీనంలోని స్థలాలు అని అంచనాలు ఉన్నాయి.
దాడులను సమర్ధించుకున్న హౌతీలు
ఎర్ర సముద్రంలోని నౌకలపై దాడులకు దిగడం పై హౌతీలు సమర్ధించుకున్నారు. గాజా లో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ చేస్తున్న ఆకృత్యాలను వెంటనే ఆపాలని హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో రాశారు. .
దాడులు చేశాం: యూకే
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ FGR4లు హోడెయిడా, దక్షిణాన ఉణ్న ఘులేఫిఖాలో దాడులు నిర్వహించాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి చేసిన ప్రాంతాలను హౌతీలకు సంబంధించిన "హౌసింగ్ డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ భవనాలని, ఇవి చాలా సుదూర ప్రాంతాల కోసం ప్రయోగించే డ్రోన్‌లు, ఇతర ఆయుధాలను నిల్వ చేసే భవనాలు అని " వివరించింది. "హౌతీల నుంచి కొనసాగుతున్న ముప్పు నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం దాడులు జరిగాయి" అని బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ అన్నారు. "హౌతీలు కొనసాగుతున్న ముప్పు" గా ఆయన అభివర్ణించారు.
US మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, హౌతీలు షిప్పింగ్‌పై 50 కంటే ఎక్కువ దాడులు చేశారు.వీరి దాడుల్లో ముగ్గురు నావికులు మరణించారు. ఒక నౌకను స్వాధీనం చేసుకున్నారు. మరొక నౌకను సముద్రంలో మంచారు. ఈ వారం, వారు తిరుగుబాటుదారుల ప్రధాన భాగస్వామ్య మైన ఇరాన్‌కు ధాన్యాన్ని తీసుకువెళుతున్న ఓడపై దాడి చేశారు.
బుధవారం, మరొక US MQ-9 రీపర్ డ్రోన్ యెమెన్‌లో కూలిపోయింది, హౌతీలు దానిపై ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణిని ప్రయోగించి కూల్చివేశారని పేర్కొన్నారు. అయితే US వైమానిక దళం ఏ విమానం కూలిపోయినట్లు నివేదించలేదు, అయితే ఈ డ్రోన్ CIA చేత ఆపరేట్ చేసి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి.