ఆపరేషన్ సిందూర్‌‌లో ‘స్కాల్ప్‌, హామర్‌’ వినియోగం ..

టార్గెట్ గురితప్పకుండా చేరుకోవడమే వీటి ప్రత్యేకత..;

Update: 2025-05-07 10:29 GMT
Click the Play button to listen to article

పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత వైమానికి దళం ‘ఆపరేషన్ సిందూర్‌‌’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. అయితే ప్రాణనష్టం జరగకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగల అత్యాధునిక ఆయుధాలను వాడటం గమనార్హం.

టెర్రరిస్టు స్థావరాలను సమర్థవంతంగా ధ్వంసం చేసిన స్కాల్ప్ క్రూయిజ్ మిసైళ్లు, హామర్ ప్రెసిషన్ బాంబుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం..

స్కాల్ప్(SCALP) మిసైల్..

స్కాల్ప్ లేదా స్టార్మ్ షాడోగా పిలిచే ఈ క్రూయిజ్ మిసైల్ 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించగలదు. శత్రుదేశపు రాడార్లకు చిక్కకుండా టార్గెట్‌ను చక్కగా ఛేదించే ఈ మిసైల్..రాత్రి సమయంలోనూ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని చేరుకోగలరు. ఇటీవలే యుక్రెయిన్‌ కూడా ఈ మిసైల్‌ను రష్యాపై ప్రయోగించింది.

హామర్(HAMMER) బాంబు ..

హామర్ (Highly Agile Modular Munition Extended Range) అనేది అన్ని వాతావరణ పరిస్థితుల్లో గాల్లోంచి భూమిమీదకు ప్రయోగించే గ్లైడ్ బాంబు. దీని పరిధి సుమారు 70 కిలోమీటర్లు. సాధారణ బాంబులకు అమర్చి, తక్కువ ఎత్తు నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఫ్రెంచ్‌ సంస్థ ‘సఫ్రాన్’ అభివృద్ధి చేసిన ఈ ఆయుధం సురక్షిత లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఛేదించగలదు.

కమీకాజ్(Kamikaze) డ్రోన్లు..

“లాటరింగ్ మునిషన్స్”గా పిలిచే ఈ డ్రోన్ ఆయుధాలు లక్ష్యాన్ని గుర్తించేందుకు వాడతారు. ఇవి టార్గెట్‌లపై తేలుతూ, శత్రు లక్ష్యాలను గుర్తించి దాడి చేస్తాయి.

బాలాకోటు తర్వాత ఇదే అతిపెద్ద సరిహద్దు దాడి. అయితే ఈసారి మిరాజ్ 2000 జెట్ విమానాలకు బదులు రఫేల్ యుద్ధవిమానాలను వినియోగించారు.

Tags:    

Similar News