పాకిస్తాన్ దర్యాప్తు ప్రతిపాదనలను భారత్ ఎందుకు పట్టించుకోవడం లేదు?

ముంబాయి ఉగ్రవాద దాడి పై ఆ దేశ విచారణ అధికారులు వెల్లడించిన సంచలన విషయాలు ఏంటీ?;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-04 06:02 GMT
షహబాజ్ షరీఫ్

(మూలం.. రాజేష్ అహుజా)

ప్రశాంతంగా ఉన్న బైసారన్ గడ్డి మైదానాల్లో పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదులు అమాయకుల రక్తపుటేరులు పారించారు. ఐడీకార్డులు చూసి, ప్యాంట్లు విప్పి హిందువులు, క్రైస్తవులుగా గుర్తించి మరీ చంపారు.

ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘోర కలిపై యావత్ భారతం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ ప్రభుత్వ ఆగ్రహం చూసిన పాకిస్తాన్ వెంటనే ఉగ్రవాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసింది.

అందులో భాగంగానే పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మధ్యవర్తిత్వ, పూర్తి పారదర్శక, నిష్పాక్షిక విచారణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.

పాకిస్తాన్ బాధ్యతగల దేశంగా ఆయన సెల్ప్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. కానీ దాని గడిచిన చరిత్రను చూసే అది బాధ్యతలకు ఎంత దూరంగా ఉంటుందో సవివరంగా తెలిపే ఉదంతాలు కోకొల్లలు.

ఉగ్రవాద దాడి విషయంలో అసిస్టెట్స్ ఇన్విస్టిగేషన్ కోసం కోర్టుల నుంచి డజన్ కు పైగా నోటీసులు పంపినప్పటికి వాటికి ఒక్కసారి కూడా పాకిస్తాన్ స్పందించలేదు. కనీసం చీమ కుట్టినట్లు అయినా కాలేదు.
కానీ ఇప్పుడు మరోసారి దర్యాప్తు చేయాలని సన్నాయినొక్కులు నొక్కుతోంది. మనదేశంలో జరిగిన ప్రతి టెర్రరిస్ట్ దాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం. కానీ దర్యాప్తులో మాత్రం ఏనాడు అది సహకరించలేదు. ఏ ఆధారం ఇచ్చిన ఇవి మావి కావు అని చేతులు దులుపుకోవడం, అక్కడి మంత్రులు వాచాలత్వం ప్రదర్శించడం మనకు కొత్త కాదు.
పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు..
పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్ లో గడచిన దశాబ్దాలలో అనేక ఉగ్రవాద దాడులు చేయించింది. వాటిలో ఉరి(2016), నగ్రోటా(2016), లాంగాటే(2016), పుల్వామా(2019) చాలా పెద్దవి.
భారత దర్యాప్తు సంస్థలు కోర్టుల ద్వారా పాకిస్తాన్ కోర్టులకు విచారణ లో సాయం కోరుతూ అనేక సార్లు లేఖలు పంపాయి. న్యాయ పరిభాషలో వీటిని ‘లెటర్ ఆఫ్ రోగాటరీ’(ఎల్ఆర్) అంటారు. అయినప్పటికీ వాటికి పాకిస్తాన్ ఎలాంటి విలువను ఇవ్వలేదు.
‘‘అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రెండు సార్లు పాకిస్తాన్ దర్యాప్తును చేసింది. అందులో ఒకటి ముంబై ఉగ్రవాద దాడి(2008), పఠాన్ కోట్ ఎయిర్ బేస్ జరిగిన దాడి(2016) లో విచారణ ప్రారంభించింది కానీ అవి ఎలాంటి ఫలితం తేల్చకుండానే ముగించింది. అన్ని వృథా ప్రయాసగా మారాయి’’ అని డజన్ కు పైగా లెటర్ ఆఫ్ రోగాటరీ పంపిన ఓ అధికారి ‘ది ఫెడరల్ ’ తో చెప్పారు.
ఇప్పుడు పాక్ ప్రధాని షరీఫ్ మరోసారి ఇదే డ్రామాను బయటకు తెచ్చాని భారత అధికారులు అంటున్నారు. ఓ దర్యాప్తు అధికారి ఫెడరల్ తో మాట్లాడుతూ షరీఫ్ తెచ్చిన ప్రతిపాదనలను తోసిపుచ్చారు.
‘‘ షరీఫ్ తన ఊహజనిత పుస్తకం నుంచి మరో పేజీని ముందుకు తెచ్చారు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదుల దగ్గరికి వెళ్లదు. ఎలాంటి చర్య తీసుకోదు’’ అని ఆయన చెప్పారు.
ఉగ్రవాద దాడి గురించి అంగీకరించిన పాకిస్తాన్..
పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి చెందిన మాజీ చీఫ్ తారిక్ ఖోసా ముంబాయి ఉగ్రవాద దాడిని అంగీకరించారు. 2008 లో జరిగిన ఈ పాశవిక దాడిలో 166 మంది సాధారణ ప్రజలు మరణించారు. ఇక్కడ కూడా ఇస్లామేతరులను మాత్రమే వారి ఐడీకార్డులు చూసి మరీ చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో అజ్మల్ కసబ్ మాత్రమే ప్రాణాలతో చిక్కాడు.
‘‘ముంబై అల్లాకల్లోలానికి కారణం పాకిస్తానే. ప్రణాళిక రచన, ఆయుధ శిక్షణ, ఉగ్రవాదుల ఎంపిక ఇక్కడే పురుడుపోసుకున్నాయి’’ అని ఖోసా 2015 లో ‘డాన్’ పత్రికకు రాసిన వ్యాసంలో అంగీకరించారు.
కానీ ఇవన్నీ వారు అంగీకరించరు. మొత్త భద్రతా సంస్థలో ఉన్న ఉగ్రవాద సూత్రధారులను న్యాయస్థానం ముందుకు నిలబెట్టాలి.
‘‘ముంబై ఉగ్రవాద దాడిలో సజీవంగా పట్టుబడ్డ అజ్మల్ కసబ్ పాకిస్తాన్ కు చెందిన జాతీయుడిగా అన్ని ఆధారాలు లభించాయి. అతని ఇల్లు, నివసించిన ప్రదేశం, ప్రాథమిక విద్యాభ్యాసం, నిషేధిత ఉగ్రవాద సంస్థలో చేరడం వంటి వివరాలన్నీ దర్యాప్తు అధికారులు సేకరించగలిగారు.
తరువాత అతన్ని లష్కర్ ఏ తోయిబా వీరికి ‘తొట్టా’ అనే ప్రదేశంలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చి, కరాచీ మీదుగా ముంబై పంపారు. దర్యాప్తు అధికారులు వీరికి శిక్షణ ఇచ్చిన ప్రాంతాలను సైతం గుర్తించారు’’ అని ఖోసా అందులో రాసుకొచ్చారు. ముంబైలో దొరికిన పేలుడు పదార్థాల శాంపిల్ తో, శిక్షణా కేంద్రంలో లభించిన ఆనవాళ్లతో సరిపోలాయని అన్నారు.
అనేక సంచలన విషయాలు వెల్లడించిన ఖోసా..
ఖోసా ఆ వ్యాసంలో అనేక సంచలన విషయాలు వెల్లడించారు. ‘‘ఉగ్రవాదులు ముంబైకి ప్రయాణించిన భారతీయ ట్రాలర్ ను హైజాక్ చేయడానికి ఉపయోగించిన ఫిషింగ్ ట్రాలర్ ను తిరిగి ఓడరేవుకు తీసుకువచ్చి, ఆపై పెయింట్ చేసి దాచారు. దానిని పరిశోధకులు స్వాధీనం చేసుకుని నిందితుల ఆధారాలకు అనుసంధానించారు.
‘‘ముంబై నౌకాశ్రయం సమీపంలో ఉగ్రవాదులు వదిలివేసిన డింగీ ఇంజిన్ లో ఒక పేటేంట్ నంబర్ ఉంది. దీని ద్వారా పరిశోధకులు జపాన్ నుంచి లాహోర్, తరువాత కరాచీ స్పోర్ట్స్ షాపుకు దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాది దానిని డింగితో పాటు కొనుగోలు చేశారు. డబ్బు జాడను అనుసరించి అరెస్ట్ చేసిన నిందితుడి ఆధారాలతో సరిపోల్చారు. ’’ అవి నిజమని తేలాయి.
‘‘ముంబై పై జరిగిన దాడిని ఆపరేషన్ చేసిన ఆపరేటర్ల గదిని కూడా పరిశోధకులు గుర్తించారు. వాయిస్ ఓవర్ ఇంటర్నేట్ ప్రోటోకాల్ ద్వారా జరిగిన కమ్యూనికేషన్లను వెలికితీశారు. అలాగే కమాండర్, అతనికి సహకరించిన వారందరిని గుర్తించి అరెస్ట్ చేశారు.
విదేశాలలో ఉన్న ఇద్దరు ఫైనాన్షియర్లు, ఫెసిలిటేటర్లను అరెస్ట్ చేసి విచారణకు తీసుకువచ్చారు’’ అని ఏడు ఆధారాలను ఆయన ఆ వ్యాసంలో ప్రస్తావించారు. అయితే 26/11 విచారణ గురించి మాత్రం తదుపరి ఏం జరిగిందో ఒక్కముక్క రాయలేదు.
ఒక్కదానికి సమాధానం లేదు..
2016 పఠాన్ కోట్ దాడికి ముందు పాకిస్తాన్ కు పంపిన తొమ్మిది లెటర్ ఆఫ్ రోగాటరీలు పెండింగ్ లో ఉన్నాయి. వేటీకి సమాధానం ఇవ్వలేదు. పఠాన్ కోట్ దాడి తరువాత పాకిస్తాన్ మళ్లీ తన సొంత దర్యాప్తును ప్రారంభించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
మే 2016 లో పాకిస్తాన్ దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించడానికి భారత్ కు వచ్చింది. దేశ రాజధానిలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో వారికి ఆతిథ్యం ఇచ్చారు.
ఉగ్రవాద సంస్థ జేష్ ఎ మహ్మద్ (జేఎం) నాయకుడు మౌలానా మసూద్ అజహార్ సోదరుడు, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మాట్లాడిన ఒక వీడియోను భారత్, పాక్ అధికారులకు చూపించారు. తాను స్వయంగా ఉగ్రవాదులను పంపినట్లు అస్గర్ అందులో ఒప్పుకున్నారు. అందులో భారత్ ప్రతిస్పందనను ఎగతాళి చేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది.
ఏడుగురు భద్రతా సిబ్బందితో సహ ఎనిమిది మంది మృతి చెందిన దాడిపై దర్యాప్తు కోసం బృందం వైమానిక స్థావరాన్నికూడా సందర్శించింది. స్థావరం ముట్టడి సమయంలో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు.
దాడి సమయంలో వైమానిక స్థావరం లోపలికి దాడి చేసిన వారిని పాకిస్తాన్ లోని హ్యండర్ల సంఖ్యను కూడా ఎన్ఐఏ దర్యాప్తు లో గుర్తించింది. ఎన్ఐఏ పాకిస్తాన్ పర్యటన చేయాల్సి ఉన్నా.. అది జరగలేదు. పఠాన్ కోట్ దాడి విషయంలో భారత్ కు పాక్ సహకారం అక్కడితో ముగిసింది. భారత అధికారుల పాక్ వెళ్లి ఆధారాలు సేకరించడానికి దాయాదీ దేశం ఒప్పుకోలేదు. ఎప్పటి లాగే మొండి, వితండ వాదనలకు దిగింది.
కాశ్మీర్ పోలీస్ ల ఆర్డర్లు..
‘‘ఎన్ఐఏతో పాటు జమ్మూకాశ్మీర్ పోలీసులు పాకిస్తాన్ కు అనేక ఎల్ఆర్ లు పంపారు. మళ్లీ వారి పాకిస్తాన్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఉగ్రవాదులు పాక్ నుంచి సామగ్రిని తీసుకుని వస్తారు.
పండ్లు, కూరగాయలు, మందులు, ఆయుధాలు ఎల్ ఆర్ ద్వారా మేము ధృవీకరణ కోసం పంపుతాము. కానీ మాకు అక్కడి నుంచి ఎలాంటి సహకారం అందదు’’ అని ఓ దర్యాప్తు అధికారి తెలిపారు.
2016 అక్టోబర్ లో జమ్ముకాశ్మీర్ లోని హంద్వారాలో ఒక ఆర్మీ క్యాంప్ పై ముగ్గురు ఆత్మాహుతి దాడికి ప్రణాళిక వేశారు. వారిని హతమార్చడంతో కుట్ర భగ్నమైంది. దర్యాప్తు బాధ్యతను ఎన్ఐకి అప్పగించారు.
చనిపోయిన వారి దగ్గర లభించిన కొన్ని ఆధారాలలో ఒక మొబైల్ బుక్ లెట్ దొరికింది. ఈ నంబర్ ట్విట్టర్ ఖాతాకు అనుసంధానించబడి ఉన్నట్లు తేలింది. ఆ ఖాతా చిత్రం చనిపోయిన వ్యక్తి చిత్రంలో సరిపోలింది.
ఫ్రొఫైల్ చిత్రంలో ఉన్న వ్యక్తి లష్కర్ ఏ తోయిబా తో సంబంధం ఉన్న జమాత్ ఉద్ దవా సంస్థ దుస్తులు ధరించి కనిపించాడు. ఈ దాడిని ఎల్ఈటీ నేరుగా చేయించినట్లు ఆధారాలు లభించాయి. కానీ మళ్లీ పాకిస్తాన్ ను సంప్రదించడానికి మేము ఇష్టపడలేదన్నారు.
కానీ ఇప్పడు పాకిస్తాన్ మరోసారి నిష్ఫక్షిక విచారణ జరిపిస్తామని మరోసారి డ్రామా ఆడేందుకు ప్రయత్నిస్తోంది. తాము బాధ్యత గల దేశం అంటూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది.
పాకిస్తాన్ మంత్రులు కూడా దానికి వంతపాడుతున్నారు. కొంతమంది భారత్ సైనిక చర్యకు దిగుతుందంటూ, తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని బీరాలు పలుకుతున్నారు. 
Tags:    

Similar News