మస్క్ తో సంబంధం వల్ల మాకో పాప పుట్టింది: సెయింట్ క్లెయిర్
ఇప్పటికే టెస్లా అధినేతకు 12 మంది సంతానం;
By : The Federal
Update: 2025-02-15 11:54 GMT
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ తో సంబంధం వల్ల తనకో బిడ్డకు జన్మించినట్లు రచయిత్రి, కాలమిస్ట్ ఆష్లే సెయింట్ క్లెయిర్ ప్రకటించారు. ఈ పాప ఐదు నెలల క్రితం జన్మించినట్లు ఆమె చెప్పారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ ద్వారా ఆమె ప్రకటించారు. ‘‘ ఐదు నెలల క్రితం నేను ఓ పాపకు జన్మనిచ్చాను. ఇలాన్ మస్క్ ఈ బిడ్డకు తండ్రి, మా పాప గోప్యత, భద్రతను కాపాడానికి నేను ఇంతకుముందు ఈ విషయాన్ని వెల్లడించలేదు.
కానీ ఇటీవల రోజుల్లో టాబ్లాయిడ్ మీడియా దీనిని బయటపెట్టాలని చూస్తోంది. ఈ తరువాత జరిగే పరిణామాలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తోంది’’ అని పోస్ట్ లో పేర్కొన్నారు.
నా పాప సాధారణ, సురక్షితమైన వాతావరణంలో పెరగాలని నేను అనుకుంటున్నాను. అందుకే మీడియా మా బిడ్డ గోప్యతను గౌరవించాలని, నేను కోరుతున్నానని చెప్పారు.
ఇలాన్ మస్క్ ఏమన్నారంటే..
సెయింట్ క్లెయిర్ సోషల్ మీడియాలో ఈ పాప విషయాన్ని ప్రకటించడంతో మీడియాలో చర్చకు దారి తీసింది. కానీ టెస్లా అధినేత నుంచి దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.
అయితే మస్క్ జీవితంలోని చీకటి కోణపు పొరలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయన జీవితంలో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. అతనికి వేరు వేరు మహిళలతో సంబంధాలు ఉండటం వల్ల ఇప్పటి వరకూ 12 మంది సంతానం ఉన్నారు. వీరిలో ముగ్గురు పిల్లల తల్లుల పేర్లు.. జస్టిస్ విల్సన్, క్లైర్ ఎలిస్ బౌచర్, షివోన్ జిలిస్
సెయింట్ క్లెయిర్ ప్రకటన తరువాత మస్క్ ఎక్స్ లో చురుకుగా ఉన్నప్పటికీ, అతను ఆ విషయం నోరు మెదపకుండా ఉన్నాడు. అతని వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఊహగానాలకు ఆజ్యం పోసింది. క్లెయిర్ వాదన అంగీకరిస్తే మస్క్ ఈ బిడ్డ 13వ సంతానం అవుతుంది.
ఆష్లే ఎవరూ?
మీడియా నివేదికల ప్రకారం.. ఆష్లే క్లెయిర్ ఒక ప్రసిద్ద సంప్రవాద వ్యాఖ్యాత. ఆమె రాజకీయ అభిప్రాయాలు, సోషల్ మీడియా ఉనికి ద్వారా ఆమెకు పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. ఆమె పుస్తకాలు కూడా రాశారు. కరెంట్ అఫైర్స్ పై క్రమం తప్పకుండా చర్చలలో పాల్గొంటారు.
అమెరికన్ మీడియా నివేదిక ప్రకారం.. సెయింట్ క్లెయిర్ ఒక సంవత్సరం క్రితం సిటీ హాల్ సమీపంలోని ఒక ఉన్నత స్థాయి మాన్ హట్టన్ అపార్ట్ మెంట్ కు మారారు. అద్దె నెలకు 12 వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.
సైబర్ ట్రక్ ను పొందిన చాలా పెద్ద విలాసవంతమైన భవనంలో ఆమె కచ్చితంగా ఉంటున్నారని నేను చెప్పగలని ఓ అపార్ట్ మెంట్ వాసి మీడియాకు చెప్పారు.
ట్రంప్ కార్యక్రమానికి హాజరు..
మాన్ హట్టన్ భవనం నివాసితులు ఆమె భవన సిబ్బందితో చాలా తక్కువగా సంభాషించారని తెలిసింది. మీడియా నివేదికల ప్రకారం.. సెయింట్ క్లెయిర్ తన గర్భధారణ పరిస్థితిని దాచిపెట్టి చాలా నెలలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కెమెరా ముందు కనిపించకుండా జాగ్రత్త పడింది.
తన బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మార్ ఏ లాగో కార్యక్రమానికి హాజరైంది. దీనిని ట్రంప్ గెలిచిన తరువాత నిర్వహించారు. క్లెయిర్ కాంగ్రెస్ సభ్యుడు మాట్ గేట్జ్ భార్య జింజర్ గేట్జ్, జీఓపీ ప్రతినిధి ఎలిజబెత్ పిప్కో, మాజీ అధ్యక్ష అభ్యర్థి రామస్వామి, ట్రంప్ ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వంటి వ్యక్తులతో ఫొటో దిగారు.