‘‘అవును.. రష్యాకు సైనికులను పంపాము’’: ఉత్తర కొరియా

పది నుంచి పన్నెండు వేల మంది ఉంటారని అంచనా;

Translated by :  Chepyala Praveen
Update: 2025-04-28 08:51 GMT
కిమ్ జోంగ్ ఉన్

ఉక్రెయిన్ పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు సైన్యాన్ని పంపినట్లుగా ఉత్తరకొరియా సొమవారం ధృవీకరించింది. గత ఏడాది చలికాలంలో ఉత్తర కొరియా రష్యాకు దాదాపు పదివేల నుంచి పన్నెండు వేల మంది సైనికులకు పంపిందని అమెరికా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్ నిఘా అధికారులు తెలిపారు. కానీ ఉత్తరకొరియా సోమవారం వరకూ రష్యాకు తన సైనిక మోహరింపులను ధృవీకరించలేదు 

ఉత్తర కొరియా దేశ అధికారిక మీడియాకు అందించిన ఒక ప్రకటనలో పాలక వర్కర్స్ పార్టీకీ చెందిన ఉత్తర కేంద్ర సైనిక కమిషన్ పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం రష్యాకు యుద్ద దళాలను పంపాలని నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ నిర్ణయించినట్లు తెలిసింది.
‘‘ఉక్రెయిన్ నియో- నాజీ ఆక్రమణదారులను నిర్మూలించడం, తుడిచిపెట్టడం, రష్యాన్ సాయుధ దళాల సహకారంతో కుర్క్స్ ప్రాంతాన్ని విముక్తం చేయడానికి దళాలను పంపించాము’’ అని కిమ్ చెప్పినట్లు సదరు ప్రకటన తెలిపింది. ‘‘న్యాయం కోసం పోరాడిన వారందరూ హీరోలు, మాతృభూమి గౌరవానికి ప్రతినిధులు’’ అని కిమ్ అన్నారు.
ఫిబ్రవరిలో రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో మోహరించిన తన సైనికులు భారీ ప్రాణనష్టం పాలైన తరువాత ఉత్తర కొరియా రష్యాకు అదనపు సైన్యం పంపినట్లు కనిపిస్తోందని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ తెలిపింది. జనవరిలో ఉత్తర కొరియాకు చెందిన మూడువందల మంది సైనికులు మృతి చెందారని, మరో 2,700 మంది గాయపడ్డారని తెలిపింది.
జెలెన్ స్కీ ముందుగా ఉత్తర కొరియాకు చెందిన సైనికుల సంఖ్యను 4 వేలుగా పేర్కొన్నాడు. అయితే యూఎస్ అంచనా ప్రకారం ఈ సంఖ్య కేవలం 12 వందలకు మించదు.
Tags:    

Similar News

అరుణ తార!